మహేష్‌, శ్రీలీల, మీనాక్షి, నమ్రత, దిల్‌రాజు దంపతులు.. `గుంటూరు కారం` సక్సెస్‌ పార్టీలో రచ్చ..మరి త్రివిక్రమ్‌?

Published : Jan 16, 2024, 07:36 AM IST

`గుంటూరు కారం` సినిమా సంక్రాంతి విడుదలై మంచి కలెక్షన్లని రాబడుతున్న నేపథ్యంలో తాజాగా పార్టీ చేసుకున్నారు. హీరోహీరోయిన్లు, నిర్మాతలు కలిసి రచ్చ చేశారు.  

PREV
112
మహేష్‌, శ్రీలీల, మీనాక్షి, నమ్రత, దిల్‌రాజు దంపతులు.. `గుంటూరు కారం` సక్సెస్‌ పార్టీలో రచ్చ..మరి త్రివిక్రమ్‌?

మహేష్‌ బాబు, శ్రీలీల, మీనాక్షి హీరోహీరోయిన్లుగా `గుంటూరు కారం` చిత్రం రూపొందింది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ దర్శకత్వం వహించిన మూవీ ఇది. హారికా అండ్‌ హాసినీ క్రియేషన్స్ నిర్మించింది. సంక్రాంతి పండుగని పురస్కరించుకుని శుక్రవారం ఈ మూవీ విడుదలైంది. 
 

212

ఈ మూవీకి ప్రారంభం నుంచి మిక్స్ డ్‌ టాక్‌ వస్తుంది. సినిమా కూడా యావరేజ్‌గా ఉంది. కానీ దీనిపై టూ మచ్‌ నెగటివిటీ వస్తుంది. బీఎంఎస్‌(బుక్‌ మై షో) దారుణంగా నెగటివ్‌ ఓటింగ్‌ జరిగింది. ఇది కొందరు కావాలని చేశారనే ప్రచారం జరుగుతుంది.  మహేష్‌ బాబుని టార్గెట్‌  చేసి కొందరు చేశారని అంటున్నారు. 
 

312

అదే సమయంలో నిర్మాత దిల్‌ రాజు కూడా ఈ నెగటివ్‌ ప్రచారానికి కారణమయ్యాడని అంటున్నారు. ఏదేమైన ఈ మూవీపై నెగటివ్‌ ప్రచారం బాగా ఎఫెక్ట్ పడింది. అదే పాజిటివ్‌ ప్రచారం జరిగి ఉంటే కలెక్షన్లు మరింతగా పెరిగేవి. సంక్రాంతి విన్నర్‌గా నిలిచినా ఆశ్చర్యం లేదు. మరి ఇంతటి ప్రచారానికి రీజన్‌ తెలియాల్సి ఉంది. 
 

412

ఇదిలా ఉంటే తాజాగా చిత్ర బృందం పార్టీ చేసుకుంది. సినిమా మంచి కలెక్షన్లు సాధిస్తున్న నేపథ్యంలో సోమవారం టీమ్‌ హైదరాబాద్‌లో సక్సెస్‌ పార్టీని ఎంజాయ్‌ చేసింది. ఇందులో హీరోహీరోయిన్లు పాల్గొన్నారు. మహేష్‌బాబు, ఆయన భార్య నమ్రత, అలాగే శ్రీలీల, మీనాక్షి చౌదరి సందడి చేశారు.  
 

512

వీరితోపాటు సినిమాని నిర్మించిన నాగవంశీ,  సినిమాని నైజాంలో కొన్న దిల్‌రాజు, ఆయన సతీమణి హల్‌చల్‌ చేశారు. వీరితోపాటు దిల్‌ రాజు సోదరుడు శిరీష్‌ రెడ్డి కూడా పాల్గొన్నారు. అలాగే సితార, గౌతమ్‌, మెహర్‌ రమేష్‌ వారి ఫ్యామిలీ సైతం ఇందులో సందడి చేయడం విశేషం. కానీ దర్శకుడు త్రివిక్రమ్‌ ఇందులో పాల్గొనకపోవడం ఆశ్చర్యంగా మారింది.

612

 ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. మహేష్‌ బాబు టీమ్‌ అందరికి పార్టీ ఇచ్చారు. తన ఇంట్లో ఈ సక్సెస్‌ పార్టీ జరిగింది. ఈ సందర్భంగా శ్రీలీల రచ్చ చేసింది. సెల్ఫీలతో అదరగొట్టింది. 

712

ఇక `గుంటూరు కారం` మూడు రోజుల్లో 164కోట్ల కలెక్షన్లని సాధించింది. మొదటి రోజు 94కోట్లు, రెండో రోజు 33, మూడో రోజులు 37కోట్లు వసూలు చేసింది. సోమవారం కూడా కలెక్షన్లు బాగానే ఉన్నట్టు తెలుస్తుంది. 

812

ఈ వీకెండ్‌లో ఇది 200కోట్ల మార్క్ ని టచ్‌ అవుతుందా అనేది చూడాలి. ఈ మూవీకి 132కోట్ల బిజినెస్‌ అయ్యింది. రికవరీ అవ్వాలంటే 260కోట్ల గ్రాస్‌ రావాలి. కానీ కొంత నష్టాలు వచ్చే అవకాశం కనిపిస్తుంది. 

912

మహేష్‌ బాబు, నమ్రత దంపతులు ఇచ్చి న `గుంటూరు కారం` సక్సెస్‌ పార్టీలో సందడి చేసిన మూవీ టీమ్‌. ఆ ఫోటోలు సోషల్‌  మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. 

1012

మహేష్‌ బాబు, నమ్రత దంపతులు ఇచ్చి న `గుంటూరు కారం` సక్సెస్‌ పార్టీలో సందడి చేసిన మూవీ టీమ్‌. ఆ ఫోటోలు సోషల్‌  మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. 

1112

మహేష్‌ బాబు, నమ్రత దంపతులు ఇచ్చి న `గుంటూరు కారం` సక్సెస్‌ పార్టీలో సందడి చేసిన మూవీ టీమ్‌. ఆ ఫోటోలు సోషల్‌  మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. 

1212

మహేష్‌ బాబు, నమ్రత దంపతులు ఇచ్చి న `గుంటూరు కారం` సక్సెస్‌ పార్టీలో సందడి చేసిన మూవీ టీమ్‌. ఆ ఫోటోలు సోషల్‌  మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories