అప్పారావు చేయాల్సిన హృదయ కాలేయం మూవీ సంపూర్ణేష్ బాబు చేతుల్లోకి ఎలా వెళ్ళింది.. షాకింగ్ మేటర్ వెలుగులోకి!

Published : Jul 10, 2024, 12:19 PM IST

హృదయ కాలేయం మూవీ సూపర్ హిట్ కాగా... ఆ మూవీలో హీరోగా  జబర్దస్త్ అప్పారావు నటించాల్సిందట. ఆ ఒక్క కారణంతో దర్శకుడు సాయి రాజేష్ అప్పారావుకు బదులు, సంపూర్ణేష్ బాబును ఎంచుకున్నాడట.   

PREV
17
అప్పారావు చేయాల్సిన హృదయ కాలేయం మూవీ సంపూర్ణేష్ బాబు చేతుల్లోకి ఎలా వెళ్ళింది.. షాకింగ్ మేటర్ వెలుగులోకి!
Sampoornesh babu

2014 లో వచ్చిన హృదయ కాలేయం సూపర్ హిట్. అప్పట్లో ఈ మూవీపై పెద్ద చర్చ జరిగింది. ఈ ఐదడుగుల హీరో ఎవరని అందరూ ఆశ్చర్యపోయారు. చిత్ర యూనిట్ అతడు ఒక ఎన్నారై అని, హీరో కావాలనే ఉద్దేశంతో ఇండియా వచ్చాడని ప్రచారం చేశాడు. 
 

27
Sampoornesh babu


ఈ మూవీ డైరెక్టర్ సాయి రాజేష్ డూప్లికేట్ నేమ్ టైటిల్ క్రెడిట్స్ లో వేసుకున్నాడు. డైరెక్టర్ స్టీవెన్ శంకర్ అని మనం చూడొచ్చు. ఆ స్టీవెన్ శంకర్ ఎవరో కాదు, సాయి రాజేషే. హృదయ కాలేయం మూవీ చూశాక జనాలు కొడతారని అలా పేర్లు మార్చుకున్నారు. సంపూర్ణేష్ బాబు అసలు పేరు నరసింహాచారి. 

37
Sampoornesh babu

హృదయ కాలేయం మూవీ స్టార్ హీరోల సినిమాల్లో ఉండే హీరోయిజం, మేనరిజం, లాజిక్ లేని సీన్స్ మీద సెటైర్ లా ఉంటుంది. అలాగే వీడు హీరో ఏంటని కూడా జనాలు కొట్టొచ్చు. కాబట్టి సినిమా విడుదలయ్యాక మీ ఊరు వెళ్ళిపో అని సాయి రాజేష్... సంపూర్ణేష్ బాబుకు చెప్పాడట. 
 

47
Sampoornesh babu

తన ఊరిలో బంగారం పని చేసుకునే నరసింహాచారి చాలా  పేదవాడు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు. సినిమాలో వేషాల కోసం పని లేనప్పుడు హైదరాబాద్ వచ్చి స్టూడియోల చుట్టూ తిరిగేవాడట. జుట్టు పెంచుకుని, విచిత్రమైన బట్టల్లో డిఫరెంట్ గా కనిపించిన సంపూర్ణేష్ బాబు ఒక రోజు సాయి రాజేష్ కంటపడ్డాడట.

57
Rashmika Mandanna


నేను వెతుకుతున్న చెత్త హీరో నువ్వే. నా మూవీలో నటిస్తావా అని అడిగాడట. ఆశ్చర్యపోయిన సంపూర్ణేష్ బాబు వెంటనే ఓకే చెప్పాడట. కొన్నాళ్ళు జర్నీ చేసిన సాయి రాజేష్-సంపూర్ణేష్ బాబు హృదయ కాలేయం మూవీ తీసి విడుదల చేశారు. ఆ మూవీ సక్సెస్ కావడంతో సంపూర్ణేష్ బాబు కామెడీ హీరోగా అనేక చిత్రాలు చేశాడు. 

67
Sampoornesh babu


ఈ మూవీలో మొదట హీరోగా జబర్దస్త్ అప్పారావును అనుకున్నారట. అయితే అప్పటికే అప్పారావు చాలా సినిమాల్లో కమెడియన్ గా నటించాడు. ఎవరికీ పరిచయం లేని కొత్త ఫేస్ అయితే బెటర్ అని సాయి రాజేష్ భావించి సంపూర్ణేష్ బాబును ఎంచుకున్నాడట. 
 

77
Sampoornesh babu


వేర్ ఈజ్ విద్యాబాలన్ అనే మూవీలో సంపూర్ణేష్ బాబుకు అప్పారావు అసిస్టెంట్ రోల్ చేశాడు.ఆ మూవీ సెట్స్ లో సంపూర్ణేష్ బాబు... బాబాయ్, హృదయ కాలేయం మూవీలో హీరోగా ముందుగా నిన్నే అనుకున్నారు. కానీ నువ్వు అప్పటికే కమెడియన్ గా చాలా సినిమాల్లో నటించావు. కొత్త వాడు అయితే బాగుంటుందని నన్ను తీసుకున్నారు, అని చెప్పాడట. తాజా ఇంటర్వ్యూలో అప్పారావు ఈ విషయం వెల్లడించాడు.. 
 

click me!

Recommended Stories