ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే.. తమ పెళ్ళి కూడా తన ఫ్రెండ్స్ అంతా కలిసి చేశారట. నాగార్జున నిన్నే పెళ్ళాడతా సినిమా టైమ్ లో కృష్ణవంశీ దగ్గర పనిచేస్తున్నారట పూరి. ఆ టైమ్ లో షూటింగ్ సెట్ లో తన పెళ్లి జరిగిందని తాళబొట్టు ఒకరు, కూల్ డ్రింక్స్ మరొకరు, పెళ్ళి బట్టలు ఇంకొకరు.. ఇలా అందరూ తలా ఒక ఐటం తీసుకు వచ్చి.. సెట్ లోనే తమ పెళ్లి చేశారన్నారు పూరి. ఇలా చిత్రంగా జరిగిన పెళ్ళి గురించి ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలో వెల్లడించారు స్టార్ డైరెక్టర్.