కొత్త కారు కొన్న జబర్దస్త్ అవినాష్... మండిపడుతున్న నెటిజన్లు! 

First Published | Jul 24, 2023, 1:38 PM IST


 ముక్కు అవినాష్ కొత్త కారు కొన్నారు. అయితే ఇది నెటిజెన్స్ ని ఆగ్రహానికి గురి చేసింది. అందుకు ఓ బలమైన కారణం ఉంది. 
 

Jabardasth Avinash

జబర్దస్త్ మాజీ కమెడియన్ అవినాష్ కొత్త కారు కొన్నారు. అవినాష్ గతంలో కొన్న కారు ప్రమాదానికి గురైందట. డ్యామేజ్ అయిన కారును ఎక్స్ఛేంజ్ చేసి మరో కారు తీసుకున్నాడు. మహీంద్రా ఎక్స్ యూ వీ 700 కారు ధర రూ. 25 లక్షలు అని సమాచారం. ఈ విషయాన్ని తెలియజేస్తూ అవినాష్ యూట్యూబ్ లో వీడియో షేర్ చేశాడు. 

కొందరు అభిమానులు అవినాష్ కి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కొందరు మాత్రం తిట్టిపోస్తున్నారు. అందుకు బలమైన కారణం ఉంది. ఇటీవల అవినాష్ తల్లి అనారోగ్యానికి గురయ్యారు. ఆమెకు గుండె ఆపరేషన్ జరిగింది. ఒకప్రక్క అమ్మ అనారోగ్యంతో భపడుతుంటే కొత్త కారు కొంటావా? అమ్మ ఆరోగ్యం మీద నీకు బెంగ లేదా? అని కామెంట్స్ పెడుతున్నారు. 
 


ఇలాంటి సమయంలో కారు కొనటం సరికాదన్న అభిప్రాయం వెల్లడిస్తున్నారు. అవినాష్ యూట్యూబ్ వీడియో వైరల్ అవుతుంది. కాగా అవినాష్ జబర్దస్త్ ని వీడిన విషయం తెలిసిందే. బిగ్ బాస్ సీజన్ 4లో కంటెస్ట్ చేసిన అవినాష్ బయటకు వచ్చేశాడు. 
 

జబర్దస్త్ షో ద్వారా పాపులారిటీ తెచ్చుకున్న కమెడియన్స్ లో అవినాష్ ఒకడు. కెవ్వు కార్తీక్ తో పాటు అవినాష్ టీమ్ లీడర్ గా వ్యవహరించాడు. అగ్రిమెంట్ కి ముందే షో నుండి తప్పుకున్న అవినాష్ రూ. 10 లక్షలు మల్లెమాల సంస్థకు చెల్లించాడట. ఈ విషయాన్ని ఆయన ఓపెన్ గా చెప్పాడు. 
 


బిగ్ బాస్ షోలో రాణించిన అవినాష్ మంచి రెమ్యూనరేషన్ అందుకున్నాడు. ప్రస్తుతం స్టార్ మాలో సెటిల్ అయ్యాడు. అక్కడే పలు షోల్లో సందడి చేస్తున్నాడు. శ్రీముఖితో పాటు ఆదివారం స్టార్ మా పరివార్ లో ముక్కు అవినాష్ చేస్తున్నారు. గత ఏడాది అవినాష్ వివాహం చేసుకున్నాడు. భార్య గర్భవతి కూడాను. త్వరలో అవినాష్ తండ్రి కాబోతున్నాడు. 
 

Latest Videos

click me!