త్రివిక్రమ్‘అతడు’కు సాయిం చేసింది గుణశేఖరే, కృతజ్ఞత లేకుండా ఆయనకే దెబ్బ ?

Surya Prakash | Published : Jul 24, 2023 1:21 PM
Google News Follow Us

దర్శకుడిగా త్రివిక్రమ్ టాప్ ప్లేస్ కి చేరుకోవడానికి అతని రైటింగ్ కారణం అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.త్రివిక్రమ్ డైరెక్టర్ గా మారిన తర్వాత కూడా రైటర్ గా కొన్ని సినిమాలకు పనిచేశారు. 

113
త్రివిక్రమ్‘అతడు’కు సాయిం చేసింది గుణశేఖరే, కృతజ్ఞత లేకుండా  ఆయనకే  దెబ్బ ?


సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకుడు త్రివిక్రమ్ కలయికలో వచ్చిన మొదటి సెన్సేషనల్  చిత్రం ‘అతడు’. దర్శకుడిగా త్రివిక్రమ్‌కు ఇది రెండో సినిమా. ఈ సినిమా తెలుగు చిత్ర పరిశ్రమలో క్లాసిక్ థ్రిల్లర్‌గా నిలిచిపోయింది.  ఆ సినిమాని మాత్రం ఇన్నేళ్ళ నుంచి ఎన్నిసార్లు టీవీలో ప్రసారం చేసినా.. ఇప్పటికీ జనం చూస్తూనే ఉన్నారు. తెలుగు వాళ్లకు అంత ఇష్టం ఆ సినిమా అంటే.  కలెక్షన్ల రికార్డులు.. శతదినోత్సవాల కేంద్రాలు ఇలాంటి లెక్కలు కాకుండా ఇంట్లో ఎన్ని రోజులు ఆడిందని లెక్కలు వేసుకోవాలి.  అది త్రివిక్రముడు సెల్యులాయిడ్ ప్రిన్స్ తో చేసిన మేజిక్!  అయితే ఆ సినిమా పట్టాలెక్కటం వెనక మరో వ్యక్తి ఉన్నాడని చాలా మందికి తెలియదు.

213


అతడు చిత్రం ఈ రోజు మన ముందు ఉండటానికి ప్రధాన కారణాల్లో గుణశేఖర్ ఒకరని ఇండస్ట్రీ విషయాలు లోతుగా తెలిసిన వారు గుర్తు చేసుకుంటారు. గుణశేఖర్ పూనుకోకపోతే... మహేష్ ఈ సినిమా వంక చూడకపోదురు అని చెప్తారు. మహేష్ ని ఒప్పించి ప్రాజెక్టులో తెచ్చింది గుణశేఖరే. త్రివిక్రమ్ ఆ విషయం మర్చిపోయాడా 
 

313

2003,2004లో ఈ సంఘటన జరిగింది. త్రివిక్రమ్ తన తొలి చిత్రం నువ్వు నేను తీసి మహేష్ చుట్టూ తిరుగుతున్నారు. మరో ప్రక్క గుణశేఖర్ చూడాలని ఉంది, ఒక్కడు లాంటి సూపర్ హిట్స్ ఇచ్చి ఉన్నాడు. త్రివిక్రమ్ ..మహేష్ కోసం తిరుగుతున్నాడు కానీ ఆయన పెద్దగా రెస్పాండ్ కావటం లేదు. యస్, నో చెప్పటం లేదు. అందుకు కారణం ఉంది

Related Articles

413


అన్నాళ్లూ స్టార్ రైటర్ గా  ఉన్న త్రివిక్రమ్ శ్రీనివాస్ అతడు సినిమాతోనే డైరెక్టర్ గా ఎంట్రీ ఇద్దామని అనుకున్నాడు.. అందులో భాగంగానే ఈ కథను ముందుగా పవన్ కళ్యాణ్ కి వెళ్లి చెప్పగా అయన కథ వింటూ నిద్రపోయారట..  ఆ తర్వాత ఇదే కథని మహేష్ బాబుకి చెబితే మహేశ్ కి బాగా నచ్చిందట.. కానీ అప్పటికే అర్జున్, నాని సినిమాలతో బిజీగా ఉన్న మహేష్ నెక్స్ట్ ఇయర్ చేద్దామని చెప్పాడట..సాధారణంగా వేరే డైరక్టర్ అయితే వెయిట్ చేస్తారు . కానీ త్రివిక్రమ్ అలా చేయలేదు.

513


తన స్నేహితులు చాలా మంది ఖాళీగా అప్పటిదాకా ఉండటం ఎందుకు.. అప్పటిలోపు ఓ సినిమా చేయండి అని సలహా  ఇచ్చాడట..దాంతో త్రివిక్రమ్ ...వెంటనే తనకు బాగా నమ్మకం ఉన్న నిర్మాత స్రవంతి రవికిషోర్ ని కలిసారు. తరుణ్ , శ్రియల కాంబినేషన్ లో నువ్వు నేను చిత్రం పట్టాలు ఎక్కించేసారు. అది బాగానే ఆడింది. కానీ మహేష్ మాత్రం వెంటనే పిలవలేదు.

613


పెద్ద హీరోతో సినిమా ఓకే అయ్యినప్పుడు ఓపిగ్గా వెయిట్ చెయ్యకుండా చిన్న సినిమా చేయటం మహేష్ కు మండిందిట. ఎందుకంటే త్రివిక్రమ్ వంటి స్టార్  రచయిత నుంచి డైరక్టర్ గా మారి తనతో చేస్తున్న సినిమా అంటే క్రేజ్ వేరు. అలా కాకుండా తరుణ్ వంటి మీడియం హీరోతో సినిమా చేసిన దర్శకుడుతో తను సినిమా చేయాల్సి రావటం వేరు. అలా త్రివిక్రమ్ ని దూరం పెట్టారట మహేష్. 
 

713


అప్పట్లో గుణశేఖర్ ...రెగ్యులర్ గా పద్మాలయాకు వెళ్లి వస్తూండేవారు. మహేష్ తో టచ్ లో ఉండేవారు. ఈ క్రమంలో మహేష్ కు..త్రివిక్రమ్ కు వచ్చిన గ్యాప్ గురించి తెలుసుకున్నారు.ఓ సారి మీటింగ్ లో మహేష్ తో గుణశేఖర్ ఈ ప్రస్తావన తెచ్చారు. త్రివిక్రమ్ దగ్గర ఉన్నది మంచి కథ అని,ఖచ్చితంగా మంచి సినిమా చేస్తాడని చెప్పి ఒప్పించి, అతడు పట్టాలెక్కించటానికి కారణమయ్యాడు.

813


ముందుగా అతడు సినిమాని పద్మాలయా బ్యానర్ పైనే సినిమా తీద్దామని వారు భావించారు హీరో కృష్ణ.. కానీ త్రివిక్రమ్ టాలెంట్ ని ముందే గుర్తించిన నటుడు, వ్యాపారవేత్త, నిర్మాత మురళీ మోహన్ తన జయభేరి ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్లో ఓ సినిమా చేయాలని అడ్వాన్స్ ఇవ్వడంతో ఈ సినిమా కృష్ణకి మిస్ అయింది. మహేష్ బాబు పెళ్లి తర్వాత విడుదలైన ఫస్ట్ సినిమా అతడు..
 

913


మొత్తం ఈ సినిమా 205 కేంద్రాల్లో 50 రోజులు, 38 కేంద్రాలలో 100 రోజులు ఆడింది.. ఇక హైదరాబాద్ లోని సుదర్శన్ 35 మిమీలో 175 రోజులు ఆడింది.. * దాదాపుగా ఈ చిత్రం 40 కోట్లను కొల్లగొట్టింది.  ఈ సినిమాకి ఉత్తమ నటుడుగా మహేష్ బాబు, ఉత్తమ మాటల రచయితగా త్రివిక్రమ్ నంది అవార్డులను అందుకున్నారు.

1013


ఇదంతా బాగానే ఉంది...ఇప్పుడీ టాపిక్ ఎందుకంటే...గత కొన్నేళ్లుగా వార్తల్లో వినిపిస్తూ వచ్చిన ప్రాజెక్ట్‌ ‘హిరణ్య కశ్యప’. అది ఎట్టకేలకు దర్శకుడు త్రివిక్రమ్‌ రచనలో పట్టాలెక్కడం ఖాయమైంది. ఈ విషయాన్ని నటుడు రానా శాండియాగో కామిక్‌ కాన్‌లో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ఈ టాపిక్ గుర్తు చేసుకుంటున్నారు.

1113


 నిజానికి ‘హిరణ్య కశ్యప’ప్రాజెక్ట్‌ను గుణశేఖర్‌ తెరకెక్కించనున్నట్లు గతంలో ప్రకటించారు. దీనికోసం ఆయన నాలుగేళ్లుగా ప్రీపొడక్షన్‌ వర్క్‌ కూడా చేశారు. కానీ, అనూహ్యంగా ఈ ప్రాజెక్ట్‌ చేతులు మారింది. ఈ నేపథ్యంలో తాజాగా గుణశేఖర్‌ చేసిన ఓ ట్వీట్‌ చిత్రసీమలో చర్చనీయాంశమైంది. 
 

1213

‘‘దేవుడి కథను తీసుకొని సినిమా చేస్తున్నప్పుడు.. ఆ దేవుడు కూడా మీ చిత్తశుద్ధిని గమనిస్తుంటాడని మీరు గుర్తుంచుకోవాలి. అనైతిక చర్యలకు నైతిక మార్గాల ద్వారానే సమాధానం వస్తుంది’’ అంటూ ట్విటర్‌లో రాసుకొచ్చారు గుణశేఖర్‌. ఈ పోస్ట్‌లో ఏ సినిమా పేరు.. వ్యక్తుల పేర్లు ప్రస్తావించకున్నా.. ‘హిరణ్య కశ్యప’ ప్రాజెక్ట్‌ వర్క్‌లో భాగంగా దిగిన రెండు ఫొటోల్ని అభిమానులతో పంచుకున్నారు. దీంతో ఆయన ఈ ప్రాజెక్ట్‌ వ్యవహారంపైనే పరోక్షంగా ఇలా తన ఆవేదన వెల్లడించినట్లు అర్థమవుతోంది.
 

1313

అయితే ఇప్పుడు మహేష్,త్రివిక్రమ్ కాంబోలో గుంటూరు కారం రూపొందుతోంది.  దాదాపు 11 సంవత్సరాల తరువాత త్రివిక్రమ్ తో సినిమా చేస్తున్నాడు. సూపర్ స్టార్. శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తోన్న ఈమూవీ ఓపెనింగ్ ఆ మధ్య గ్రాండ్ గా జరిగిషూట్ మొదలై ప్రస్తుతం బ్రేక్ లో ఉంది, మహేష్ బాడీ లాంగ్వేజ్ కి సరిపడే సరికొత్త స్టోరీతో త్రివిక్రమ్ ఈ సినిమా కథని ప్లాన్ చేశాడట. పైగా ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా ఒకేసారి రిలీజ్ చేసేందుకు చిత్రబృందం ప్లాన్ చేస్తోంది. 

Recommended Photos