విదేశాల్లో ఎంజాయ్ చేస్తున్న మెహ్రీన్.. పొట్టి డ్రెస్ లో థైస్ ట్రీట్ అందించిన ’ఎఫ్3‘ బ్యూటీ

First Published | Jul 24, 2023, 1:37 PM IST

యంగ్ హీరోయిన్ మెహ్రీన్ పిర్జాదా ప్రస్తుతం వెకేషన్ లో ఎంజాయ్ చేస్తోంది. ఈ సందర్భంగా కొన్ని బ్యూటీఫుల్ ఫొటోలను అభిమానులతో పంచుకుంది. నయా లుక్ తో హనీ బేబీ కట్టిపడేసింది. లేటెస్ట్ పిక్స్  తో అట్రాక్ట్ చేసింది.
 

టాలీవుడ్ యంగ్ హీరోయిన్ మెహ్రీన్ పిర్జాదా మొదటి నుంచి తెలుగు సినిమాలపైనే ఫోకస్ పెట్టిన విషయం తెలిసిందే. ఆమె కెరీర్ కూడా టాలీవుడ్ తోనే ప్రారంభమైన విషయం తెలిసిందే. నేచురల్ స్టార్ నాని సరసన ‘కృష్ణగాడి వీర ప్రేమ కథ’తో హీరోయిన్ గా పరిచయం అయ్యింది. 
 

తొలిచిత్రంతోనే నటన పరంగా, గ్లామర్ పరంగా మంచి గుర్తింపు దక్కించుకుంది. తన పెర్ఫామెన్స్ తో అదరగొట్టింది. దాంతో వరుస ఆఫర్లు అందుకుంది. ముఖ్యంగా డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్వకత్వంలో వచ్చిన చిత్రాలతో ఈ ముద్దుగుమ్మకు మరింత క్రేజ్ దక్కింది. 
 


‘రాజా ది గ్రేట్’, ‘ఎఫ్2’, ‘ఎఫ్3’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల్లో స్పెషల్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకుంది. ముఖ్యంగా ‘హనీ బేబీ’గా ముద్రవేసుకుంది. ఈ చిత్రాల్లో మెహ్రీన్ పెర్ఫామెన్స్  ప్రేక్షకులకు గుర్తుండిపోయేలా చేసింది. చివరిగా ఈ ముద్దుగుమ్మ ‘ఎఫ్3’తోనే సందడి చేసింది. 
 

అటు తమిళం, కన్నడ, హిందీ చిత్రాల్లోనూ మెరుస్తూ వస్తోంది. ఇటీవల ఈ ముద్దుగుమ్మ జోరు పెద్దగా లేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం తరుచుగా పోస్టులు పెడుతూ వస్తోంది. ఎప్పటికప్పుడు తన గురించిన అప్డేట్స్ మాత్రం అభిమానులకు అందిస్తోంది. 
 

ఇక ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ గ్రీస్ లో ఎంజాయ్ చేస్తోంది. వెకేషన్ కోసం వెళ్లినట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా అక్కడి నుంచి కొన్ని ఫొటోలను పంచుకుంది. లేటెస్ట్ ఫొటోస్ లో మెహ్రీన్ స్టన్నింగ్ లుక్ ను సొంతం చేసుకుంది. మినీ డ్రెస్ లో గ్లామర్ మెరుపులు కూడా మెరిపించింది.

ఎత్తైన ప్రదేశం నుంచి సిటీ వ్యూను చూస్తూ సంతోషించింది. ఆ ప్రదేశం తనకెంతో ఇష్టమని కూడా తెలిపింది. అలాగే మినీ డ్రెస్ లో బ్యూటీఫుల్ లుక్ ను సొంతం చేసుకుంది. థైస్ షోతో మెరుపులు మెరిపించింది. ఫ్యాన్స్, నెటిజన్లను ఖుషీ చేసింది. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ‘స్పార్క్’ అనే చిత్రంతో పాటు కన్నడలో Nee Sigoovaregu లో నటిస్తోంది. 

Latest Videos

click me!