అయితే షోలో ఒకటి రెండు సార్లు ఆమె తన తల్లిని గుర్తు చేసుకుని కన్నీళ్లు పెట్టుకుంది. తన అమ్మని కాపాడుకోలేకపోయానని, తన సక్సెస్‌ని ఆమె చూడలేకపోయిందని ఆవేదన వ్యక్తం చేసింది. తాజాగా మరోసారి సౌమ్యరావు కన్నీళ్లు పెట్టుకుంది. లేటెస్ట్ షోలో ఆమె మరోసారి తల్లిని గుర్తు చేసుకుంది. అందరి ముందు ఎమోషనల్ అయ్యింది.
అమ్మకాదు నా బిడ్డ అని తెలిపింది. అమ్మతో మంచిగా ఫోటో కూడా తీసుకోలేకపోయానని, అమ్మ బాగున్నప్పుడు తన వద్ద ఫోన్ లేదు, కెమెరా లేదని, కానీ ఆమె ఆసుపత్రి బెడ్‌పై ఉన్నప్పుడు కెమెరా ఉంది, ఫోన్లు ఉన్నాయి, కానీ మంచి ఫోటోలే లేవు అంటూ కన్నీళ్లు పెట్టుకుంది సౌమ్యరావు.