యాంకర్‌ రష్మి స్వయంవరం.. పెళ్లైన వ్యక్తి రావడంతో ఒక్కసారిగా..

Published : Mar 20, 2023, 12:27 PM ISTUpdated : Mar 20, 2023, 01:15 PM IST

జబర్దస్త్ యాంకర్‌ రష్మి ఇన్నాళ్లు సింగిల్‌గానే ఉంది. సుడిగాలి సుధీర్‌ వదిలేయడం(షో ని)తో ఒంటరిగా ఉన్న ఈ హాట్‌ యాంకర్‌ ఇప్పుడు పెళ్లికి సిద్ధమైంది. ఏకంగా స్వయంవరం ప్రకటించడం సంచలనంగా మారింది.   

PREV
15
యాంకర్‌ రష్మి స్వయంవరం.. పెళ్లైన వ్యక్తి రావడంతో ఒక్కసారిగా..

యాంకర్‌ రష్మి నాలుగు పదులకు దగ్గరపడుతుంది. అయినా పెళ్లి చేసుకోలేదు. ఎప్పుడు చేసుకుంటుందో అనే క్లారిటీ లేదు. మొన్నటి వరకు ఈ బ్యూటీ సుడిగాలి సుధీర్‌తో ప్రేమలో ఉన్నట్టు ప్రచారంజరిగింది. జబర్దస్త్ షో కోసం చేసిన స్కిట్లే గానీ, టీఆర్‌పీ రేటింగ్‌ కోసం చేసిన ప్రయత్నమే గానీ, నిజంగా వీరిద్దరి మధ్య ప్రేమ లేదని, మంచి స్నేహితులు మాత్రమే అని వారిద్దరు తరచూ చెబుతున్నారు. కానీ ఫ్యాన్స్ మాత్రం ఈ ఇద్దరిని విడిగా చూడటం లేదు. ఓ లవర్స్ గా, ఓ జంటగానే చూస్తున్నారు. పెళ్లి చేసుకోవాలనే డిమాండ్‌ కూడా చేస్తున్నారు. 

25

అయితే సుడిగాలి సుధీర్‌ గతేడాది మిడ్‌లో `జబర్దస్త్` షోని వదిలేశాడు. డబ్బుల కోసం షోని మానేస్తున్నట్టు చెప్పారు. ఆ తర్వాత స్టార్‌ మాలో ఓ షో, అలాగే ఆహా ఓటీటీలో స్టాండప్‌ కామెడీ షో కి యాంకర్‌గా చేశాడు. దీంతో ఇప్పుడు రష్మి, సుధీర్‌ దూరమైపోయారు. ఈ జంటని అభిమానులు మిస్‌ అవుతున్నారు. సుధీర్‌ మళ్లీ షోకి రావాలని కోరుకుంటున్నారు. ఇద్దరు పెళ్లి చేసుకోవాలని కూడా కొందరు నెటిజన్లు తరచూ కోరుకుంటున్నారు. కానీ ఈ ఇద్దరు ఇక కలిసే పరిస్థితి కనిపించడం లేదు. 
 

35

ఈ నేపథ్యంలో ఇప్పుడు స్వయంవరం ప్రకటించింది రష్మి. నటి ఇంద్రజ.. రష్మి కోసం స్వయం వరం ఏర్పాటు చేసింది. ఈ విషయం తెలిసి ఎగిరి గంతులేసింది రష్మి. తనకు స్వయంవరం అంటే ఆనందంలో మునిగిపోయింది. డాన్సులతో స్టేజ్‌ని షేక్‌ చేసింది. ఇక స్వయం వరం కోసం అబ్బాయిలు వస్తుంటే సిగ్గులొలికిస్తూ ఆకట్టుకుంది. యాంకర్‌ రష్మి గౌతమ్‌ స్వయం వరం అనేసరికి ఎక్కడెక్కడివాళ్లో వచ్చి క్యూ కట్టారు. రష్మిని తన వశం చేసుకోవాలని చాలా మంది ప్రయత్నిస్తున్నారు. 
 

45

ఇక రష్మి కోసం స్వయంవరంలో పాల్గొన్న వారిలో రామ్‌ ప్రసాద్‌, ఇతర కమెడియన్లు, డాన్సర్లు, అలాగే టీవీ ఆర్టిస్టులు కూడా ఉన్నారు. వారిలో పెళ్లైన నటుడు అమర్‌ దీప్‌ కూడా విశేషం. `రష్మి ఇది నీ కోసం` అంటూ ఓ గిఫ్ట్ తీసుకొచ్చాడు అమర్‌ దీప్‌. అయితే అతన్ని చూసి నీకు పెళ్లైందిగా, ఎందుకొచ్చావ్‌ అని ప్రశ్నించాడు రాం ప్రసాద్‌. దీంతో ఆయన స్పందిస్తూ, ఎవరైనా రావచ్చు అన్నారుగా, అందుకే వచ్చా నని చెప్పడం హైలైట్‌గా నిలిచింది. నిజానికి `మా నాన్న కూడా వచ్చేవాడు. కానీ అమ్మ ఫీలవుతుందని వద్దని చెప్పా` అని అమర్‌ దీప్‌ చెప్పడం నవ్వులు పూయించింది. 
 

55

ఇదంతా శ్రీదేవి డ్రామా కంపెనీ లేటెస్ట్ ప్రోమోలోని సన్నివేశాలు. తాజాగా విడుదలైన ప్రోమో ఆద్యంతం ఆకట్టుకుంటుంది. దీనికి రష్మి యాంకర్‌గా చేస్తుండగా, ఇంద్రజ జడ్జ్ గా ఉన్నారు. జబర్దస్త్ కమెడియన్లు, టీవీ ఆర్టిస్టులు సైతం ఇందులో పాల్గొంటూ నవ్వులు పూయిస్తుంటారు. లేటెస్ట్ ఎపిసోడ్‌లో మేల్స్ డాన్సర్ల ఐటెమ్‌ సాంగ్ వీర లెవల్‌లో ఉంది. హీటు పుట్టించేలా ఉండటం విశేషం. మరోవైపు `శ్రీరామదాసు` స్కిట్‌ని కూడా ప్రదర్శించారు. ఇందులో అమర్‌దీప్‌ నటన వాహ్‌ అనిపించింది. అందరి హృదయాలను హత్తుకుంది. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories