`జబర్దస్త్` షోలో వల్గారిటీపై ఆమె స్పందిస్తూ, అది ఎవరికీ వల్గారిటీ అనిపించడం లేదని, అందరు దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నారని, దాని వల్లే మంచి టీఆర్‌పీ రేటింగ్ వస్తుందని చెప్పింది. మొదట విమర్శలు వచ్చినా, వాటికి అందరు అలవాటు పడ్డారని తెలిపింది. `జబర్దస్త్` షో కేవలం అడల్ట్ కే అని, చిన్నపిల్లలకు కాదని తెలిపింది. అందుకే రాత్రి టైమ్‌లో ఇది ప్రసారం అవుతుందని చెప్పింది. ఇంటిళ్లిపాది ఈ షోని ఎంజాయ్ చేస్తున్నారని, అందులో తప్పులు వెతకడం మానేసి, ఎంజాయ్ చేస్తున్నారని తెలిపింది రష్మి.