సౌత్ నార్త్ అనే తేడా లేకుండా కుమ్మేస్తుంది స్టార్ లేడీ రష్మిక మందాన. 26 ఏళ్లకే నేషనల్ వైడ్ పాపులారిటీ తెచ్చుకుంది. సినిమాలతో వస్తున్న గుర్తింపు చాలదన్నట్లు ప్రముఖ మ్యాగజైన్స్ కోసం హద్దులు మీరు స్కిన్ షో చేస్తుంది.
ప్రస్తుతం రష్మిక (Rashmika Mandanna)చేతినిండా పెద్ద సినిమాలే. పుష్ప మూవీతో పాన్ ఇండియా హిట్ కొట్టిన ఈ కన్నడ బ్యూటీ... పుష్ప 2కి సిద్ధం అవుతున్నారు. ఇప్పటికే పుష్ప పార్ట్ 2 (Pushpa 2) సెట్స్ పైకి వెళ్లాల్సి ఉంది. మొదటి భాగం సక్సెస్ నేపథ్యంలో మరింత భారీగా పుష్ప 2 ప్లాన్ చేస్తున్నారు.
28
Rashmika Mandanna
అలాగే రష్మిక చేతిలో మరో రెండు బడా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. వాటిలో దళపతి విజయ్ 66వ (Thalapathy 66)చిత్రం ఒకటి. దర్శకుడు వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తున్న ఈ చిత్రం షూటింగ్ జరుపుకుంటుంది. దిల్ రాజు బ్యానర్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది.
38
Rashmika Mandanna
ఇక సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ యానిమల్. రన్బీర్ కపూర్ హీరోగా అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. షూటింగ్ దశలో ఉన్న ఈ మూవీపై బాలీవుడ్ లో భారీ అంచనాలున్నాయి. ఇది కూడా పాన్ ఇండియా మూవీగా విడుదలయ్యే సూచనలు కలవు.
48
Rashmika Mandanna
వీటితో పాటు సిద్ధార్థ్ మల్హోత్రా మిషన్ మజ్ను, గుడ్ బై అనే రెండు హిందీ చిత్రాలు చేస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ ప్రాజెక్ట్స్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్నాయి. త్వరలో ఈ రెండు మూవీస్ విడుదల కానున్నాయి. ఇక మల్టీ లింగ్వల్ మూవీ సీతారామం చేస్తున్నారు.
58
Rashmika Mandanna
చేతినిండా చిత్రాలతో బిజీగా ఉన్న రష్మిక ఎక్కువగా ముంబైలోనే ఉంటున్నారు. అక్కడే ఓ ఖరీదైన ఇల్లు కొన్నట్లు వార్తలు వస్తున్నాయి. అతి తక్కువ కాలంలో స్టార్ గా ఎదిగిన ఘనత రష్మిక సొంతం చేసుకున్నారు.
68
Rashmika Mandanna
ఇక ఈమె తరచుగా హీరో విజయ్ దేవరకొండతో లేట్ నైట్ డిన్నర్స్ కి వెళుతూ ఉంటారు. పలుమార్లు ముంబైలో విజయ్ దేవరకొండ-రష్మిక జంటగా కనిపించారు. ఈ నేపథ్యంలో వారి మధ్య ఎఫైర్ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. విజయ్ ఫ్యామిలీ ఫంక్షన్స్ కి కేవలం రష్మికకు మాత్రం ఆహ్వానం ఉంటుంది. ఇది కూడా రూమర్స్ కి కారణం.
78
Rashmika Mandanna
ఆమధ్య ఓ బాలీవుడ్ మీడియా ఇదే విషయాన్ని ప్రచురించగా... విజయ్ దేవరకొండ దారుణంగా ఖండించారు. రష్మిక, విజయ్ గీత గోవిందం, డియర్ కామ్రేడ్ చిత్రాల్లో కలిసి నటించారు. డియర్ కామ్రేడ్ మూవీలో అయితే లిప్ కిస్సులతో హాట్ హాట్ రొమాన్స్ పంచారు.
88
Rashmika Mandanna
సౌత్ నార్త్ అనే తేడా లేకుండా కుమ్మేస్తుంది స్టార్ లేడీ రష్మిక మందాన. 26 ఏళ్లకే నేషనల్ వైడ్ పాపులారిటీ తెచ్చుకుంది. సినిమాలతో వస్తున్న గుర్తింపు చాలదన్నట్లు ప్రముఖ మ్యాగజైన్స్ కోసం హద్దులు మీరు స్కిన్ షో చేస్తుంది.