Rashmi Gautam: బ్లూ ఆఫ్‌ శారీలో కుందనపు బొమ్మలా రష్మి గౌతమ్‌.. `వదిన బంగారం` అంటూ ఫ్యాన్స్ కామెంట్స్

Published : Apr 05, 2025, 07:44 PM IST

Rashmi Gautam: జబర్దస్త్ యాంకర్‌గా పాపులర్‌ అయ్యింది రష్మి గౌతమ్‌. తనదైన యాంకరింగ్‌తో ఆడియెన్స్ ని అలరిస్తుంది. అదే సమయంలో గ్లామరస్‌గా ముస్తాబై ఫ్యాన్స్ ని ఆకట్టుకుంటుంది. 

PREV
18
Rashmi Gautam: బ్లూ ఆఫ్‌ శారీలో కుందనపు బొమ్మలా రష్మి గౌతమ్‌.. `వదిన బంగారం` అంటూ ఫ్యాన్స్ కామెంట్స్
rashmi gautam

Rashmi Gautam:రష్మి గౌతమ్‌ ఇప్పుడు సోషల్‌ మీడియా అటెన్షన్‌ తనవైపు తిప్పుకుంది. ఆమె బ్లూ కలర్‌ హాఫ్‌ శారీలో మెరిసిపోతుంది. డిఫరెంట్‌ లుక్స్ లో పోజులు ఇస్తూ దిగిన ఫోటోలను సోషల్‌ మీడియా ద్వారా పంచుకోగా అవి ఆకట్టుకుంటున్నాయి. వైరల్‌ అవుతున్నాయి. 

28
rashmi gautam instagram

దీనిపై నెటిజన్లు స్పందిస్తూ ఆమెకి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. తమ ప్రేమని వ్యక్తం చేస్తున్నారు. ఇంత మంచి ఫోటోలు పంచుకున్నందుకు ధన్యవాదాలు వదినమ్మ అని, మా వదిన బంగారం అంటూ కామెంట్లు పెడుతున్నారు.

38
rashmi gautam instagram

సీరియల్స్ ద్వారా కెరీర్‌ని ప్రారంభించింది రష్మి గౌతమ్‌. ఒకటి రెండు సీరియల్స్ లో చేసింది. కానీ అవి పెద్దగా గుర్తింపు తీసుకురాలేకపోయాయి. ఒకటి అర సినిమాల్లోనూ నటించింది. 

48
rashmi gautam instagram

కానీ ఇవేవీ రష్మికి సినిమా ఆఫర్లనిగానీ, పెద్ద అవకాశాలని గానీ తీసుకురాలేకపోయాయి. దీంతో కొంత గ్యాప్‌ తీసుకుంది. ఈ క్రమంలోనే ఆమెకి జబర్దస్త్ కామెడీ షోకి యాంకర్‌గా చేసే అవకాశం వరించింది. 

58
rashmi gautam instagram

జబర్దస్త్ కామెడీ షోకి యాంకర్‌గా పరిచయం కావడం ఆమె జీవితాన్నే మార్చేసింది. రష్మిని బుల్లితెర ఆడియెన్స్ కి దగ్గర చేసింది. అదే సమయంలోనే సోషల్‌ మీడియాలోనూ ఫాలోయింగ్‌ పెరిగింది. 

68
rashmi gautam instagram

యూత్‌లో రష్మి గౌతమ్ కి మంచి క్రేజ్‌ ఉండటం విశేషం. దాన్ని కంటిన్యూ చేస్తూ రష్మి కూడా ఆ తరహా కంటెంట్‌ ఇస్తుంది. గ్లామరస్‌ ఫోటోలను పంచుకుంటూ తన ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది. నెటిజన్లని ఎంగేజ్‌ చేస్తుంది.

78
rashmi gautam instagram

అప్పట్లో జబర్దస్త్ కమెడియన్‌ సుడిగాలి సుధీర్‌తో లవ్‌ ట్రాక్‌ నడిపించింది రష్మి. ఇదే ఆమెని మరింతగా పాపులర్‌  చేసింది. వీరిద్దరి జోడీకి సెపరేట్‌ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ కూడా ఏర్పడింది. 

88
rashmi gautam instagram

రష్మి, సుధీర్‌ పెళ్లి చేసుకుంటారని అంతా అనుకున్నారు. కానీ ఆ విషయాన్ని ఊరిస్తూనే ఉన్నారు. గత కొంత కాలంగా వీరిద్దరు విడిగానే షోస్‌ చేస్తున్నారు. దీంతో ఈ పెయిర్‌కి క్రేజ్‌ తగ్గిపోయింది. 

read  more: దివ్య భారతి డెత్‌ మిస్టరీ, ఆ రోజు ఏం జరిగింది? సాక్షులు ఏం చెప్పారంటే?

also read: ఏఎన్నార్‌లోని ఆ క్వాలిటీ తనకు లేదే అని బాధపడిన జూ ఎన్టీఆర్‌.. ఆ లక్షణం ఏంటో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories