పవన్ టీ తాగిన గ్లాస్ అడిగిన అషు..
షూటింగ్ గ్యాప్‌లో పవన్‌ను కలిసి అషురెడ్డికి అక్కడి మూవీ టీం టీ ఇచ్చారట. టీ తాగుతూ.. పవన్ టీ తాగుతున్న విధానాన్నీ గమనిస్తూ అలా చూస్తూ ఉండిపోయిందట అషు. అసలు ఆయన ఏం మాట్లాడుతున్నారో కూడా వినలేదట. ఖుషి సినిమాలో భూమిక నడుము చూడటం నాకు నచ్చలేదు అని అషు చెప్పడంతో టవల్ అడ్డుపెట్టుకుని పవన్ విరగపడి నవ్వారంట. ఆయన చేతిపై ఉన్న త్రిసూల్ టాటూ పట్టుకుని చేతిని కూడా చాలా సేపు పిసికేసిందట. చివరికి ఇంకా చాలు వెళద్దాం అనే వరకు చేయి వదల్లేదట. చివర్లో పవన్ ఆమెతో ఇలా అన్నాడంట.. మనకు ఇష్టమైన, నచ్చిన వ్యక్తులతో కలిసే అవకాశం వచ్చినప్పుడు ఫోటోలు, వీడియోలు తీసుకోవడం కంటే వారితో గడిపే క్షణాలు, మూమెంట్స్‌ని ఎంజాయ్ చేయాలని అషురెడ్డికి హితబోద చేసి వెళ్లిపోయారంట. ఏదేమైనా తన డ్రీం బాయ్‌ని కలవడం, ఎవరి కోసం పచ్చబొట్టు వేయించుకుందో అతనే టాటూ ద్వారా గుర్తుపట్టడం మర్చిపోలేని అనుభూతులని అషురెడ్డి అంటోంది.