allu arjun, allu aravind
అల్లు అర్జున్ లుక్ పరంగా ఇప్పుడు చాలా బెటర్ అయ్యాడు. ఇంకా చెప్పాలంటే చాలా మంది హీరోలకంటే బెటర్‌గా ఉంటాడు. ఫిజిక్ పరంగానూ చాలా స్ట్రాంగ్‌గా ఉంటాడు. కానీ ప్రారంభంలో ఆయన లుక్‌పై విమర్శలు వచ్చేవి. `గంగోత్రి` సమయంలో చాలా విమర్శలు ఎదుర్కొన్నాడు.
ఇండస్ట్రీ నుంచి, ఆడియెన్స్ నుంచి ఆ విమర్శలు వచ్చాయి. అంతేకాదు ఏకంగా సొంత తండ్రినే సెటైర్లు వేశారట. అల్లు అర్జున్‌పై తండ్రి అల్లు అరవిందే సెటైర్లు వేసేవారని నిర్మాత మల్లిది సత్యనారాయణ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఒక ఇంట్రెస్టింగ్ వెల్లడించారు.
allu arjun, allu aravind
అల్లు అర్జున్ `గంగోత్రి` సినిమా విడుదలైంది. అది యావరేజ్‌గానే ఆడింది. బన్నీ కెరీర్ కి సంబంధించిన అసలు డైలామా అప్పుడే స్టార్ట్ అయ్యింది. నెక్ట్స్ ఎలాంటి సినిమా చేయాలనే కన్‌ఫ్యూజ్ ఏర్పడింది. చాలా కథలు విన్నారు. కానీ ఏది సెట్ కాలేదు.
ఈ క్రమంలో సుకుమార్, దిల్ రాజు కలిసి బన్నీకి కథ చెప్పారు. మొదట్లో ఆ కథ విషయంలోనూ ఇంట్రెస్టింగ్‌గా లేరు అల్లు అరవింద్. ఫస్టాఫ్ కథని సుకుమార్ మూడు గంటలు చెప్పాడట. దీంతో అల్లు అరవింద్ నిద్ర పోయాడట. అందుకే సుకుమార్‌పై ఇంట్రెస్ట్ లేదు.
allu arjun
కానీ ఇదే కథని నిర్మాత మల్లిడి సత్యనారాయణ(`విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ట తండ్రి) విన్నాడు. ఆయనకు బాగా నచ్చింది. దిల్ రాజుతో కూడా చర్చించారు. దిల్ రాజు హీరో ఎవరు అనే డైలామాలో ఉన్నారు.
అప్పుడే అల్లు అర్జున్ ఫోటో చూపించాడట సత్యానారాయణ. ఆల్‌రెడీ వారికి కథ చెప్పాం, వాళ్లు నో అన్నారని చెప్పాడట దిల్ రాజు. తాను ఒప్పిస్తానని బాధ్యత తీసుకున్నాడట మల్లిడి.
allu arjun, allu aravind
ఆ తర్వాత అల్లు అరవింద్‌ని కలిశాడు. ఊరు నుంచి హైదరాబాద్ వస్తుంటే కారులో అల్లు అరవింద్‌తో కలిసి దీనిపై చర్చించారు. కానీ బన్నీ బక్క పలుచగా ఉంటాడు, హీరోగా ఎలా నిలబడతాడో అని బన్నీ రూపంపై సెటైర్లు వేశాడట. తన ముందే కొడుకు గురించి తండ్రిగా అల్లు అరవింద్ మాట్లాడిన మాటలకు ఆ నిర్మాత షాక్ అయ్యాడట.