Jaat Movie
Jaat Movie : సన్నీ డియోల్ ప్రస్తుతం `జాట్` సినిమాతో బాక్సాఫీసు వద్ద స్ట్రగుల్ అవుతున్నాడు. ఆయన తెలుగు డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో తీసిన `జాట్` మూవీ థియేటర్లలో సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతుంది. అయితే ఇది నెమ్మదిగా పుంజుకోవడం విశేషం.
ఇప్పుడు ఏ సినిమా అయినా మొదటి వారానికే క్లోజ్ అవుతుంది. కానీ రెండో వారం కూడా నిలబడిందంటే అది హిట్ గ్యారంటీ. ఈ నేపథ్యంలో `జాట్` సక్సెస్ దిశగా వెళ్తుందని చెప్పొచ్చు.
Jaat Movie
ఇక తాజాగా `జాట్` కలెక్షన్లు బయటకు వచ్చాయి. చిత్ర నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. 11 రోజుల్లో ఈ చిత్రం వంద కోట్లు దాటినట్టుగా వెల్లడించింది. 102.13 కోట్లు వసూలు చేసినట్టుగా వెల్లడించింది.
మాస్ కమర్షియల్ మూవీ సింగిల్ స్క్రీన్స్ లో విజయవంతంగా రన్ అవుతుందని, మాస్ ఆడియెన్స్ సెలబ్రేట్ చేస్తున్నట్టుగా వెల్లడించారు. అయితే ట్రేడ్ వర్గాల నుంచి వినిపిస్తున్న టాక్ ప్రకారం ఈ మూవీ సుమారు ఎనబై కోట్లు రాబట్టిందని అంటున్నారు.
Jaat Movie
మాస్ యాక్షన్ కమర్షియల్ మూవీగా తెరకెక్కింది `జాట్`. గోపీచంద్ తన మార్క్ భారీ యాక్షన్ సీన్లతో సినిమాని డిజైన్ చేశారు. సన్నీ డియోల్ ని మరో బాలకృష్ణలా చూపించారు.
అయితే కథ పరంగా ఇది రెగ్యూలర్ కమర్షియల్ ఫార్మాట్‌లో ఉండటం గమనార్హం. ఇదే సినిమాకి మైనస్. కొత్త పాయింట్ ఉండి ఉంటే సినిమా వేరే లెవల్‌లో ఉండేది. మాస్, యాక్షన్ మూవీస్‌ని ఇష్టపడేవారు ఈ చిత్రాన్ని ఆదరిస్తున్నారు.
Jaat Movie
`జాట్` ప్రారంభంలో కాస్త డల్‌గానే ప్రదర్శించబడింది. కానీ తర్వాత నెమ్మదిగా పుంజుకుంది. రెండో వారంలో మంచి కలెక్షన్లు రావడంతో ఇది వంద కోట్ల వరకు వెళ్లిందని చెప్పొచ్చు. అయితే ఇప్పుడు ఈ మూవీకి అక్షయ్ కుమార్ `కేసరి 2` వల్ల దెబ్బ పడే ఛాన్స్ ఉంది. దానికి పాజిటివ్ టాక్ రావడంతో ఈ మూవీపై ప్రభావం పడుతుంది. మూడో వారంలో నిలబడేదాన్ని బట్టి ఈ మూవీ విజయం ఆధారపడి ఉంది.