OTT Movie: పోర్ట్ పై అధికారం కోసం సొంత తండ్రి కిందనే కుంపటి పెట్టిన కూతురు.. `ఇసకపట్నం` ఓటీటీ డేట్‌ ఇదే

Published : Jun 28, 2026, 06:44 AM IST

OTT Movie: తండ్రి కూతుళ్ల మధ్య ఆధిపత్య పోరు సాగుతుంది. పోర్ట్ కోసం తండ్రి కూతురు సాగించే పోరాటం, ఎత్తులకు పై ఎత్తుల నేపథ్యంలో సాగే `ఇసకపట్నం` సిరీస్‌ రిలీజ్‌ డేట్‌ లాక్ అయ్యింది. 

PREV
14
ఇసకపట్నం వెబ్‌ సిరీస్‌

మంచి కాన్సెప్ట్ ఉన్న చిత్రాలు ఓటీటీలో విశేష ఆదరణ పొందుతున్నాయి. ఇటీవల ఓటీటీల్లో అదిరిపోయే కంటెంట్‌ కనిపిస్తోంది. అందులో భాగంగా ఇప్పుడు సరికొత్త సిరీస్‌ ఓటీటీలోకి రాబోతుంది. అదిరిపోయే పొలిటికల్‌ థ్రిల్లర్‌ ఓటీటీ ఆడియెన్స్ ని అలరించేందుకు వస్తోంది. అదే `ఇసకపట్నం`. ఐశ్వర్యా రాజేష్‌, సముద్రఖని ప్రధాన పాత్రలో నటించిన ఈ సిరీస్‌లో సునీల్‌, నరేష్‌ అగస్త్య, సుధాకర్‌ కోమాకుల వంటి వారు ఇతర పాత్రలు పోషిస్తున్నారు.

24
ఇసకపట్నం వెబ్‌ సిరీస్‌ ట్రైలర్

ఇటీవల ఈ వెబ్‌ సిరీస్‌ ట్రైలర్‌ విడుదలైంది. ఇసకపట్నం పోర్ట్ చుట్టూ ఈ మూవీ కథ తిరుగుతుంది. ఆ పోర్ట్ పై అధికారం కోసం అటు తండ్రి, ఇటు కూతురు కన్నేస్తారు. తండ్రి అనేక అఘాయిత్యాలకు పాల్పడి, దౌర్జన్యాలకు, అక్రమాలకు పాల్పడి పోర్ట్ పై పట్టు సాధిస్తాడు. తనకు అడ్డువచ్చిన వారి అంతు చూడటం తండ్రి నైజాం. ఆ స్థానంలో సొంత కూతురు ఉన్నా వదిలిపెట్టడు. కూతురుకి కూడా అలాంటిదే. తండ్రిని ఎదుర్కునేందుకు ఎత్తులకు పై ఎత్తు వేస్తుంది. మరి ఈ ఆధిపత్య పోరులో విజయం ఎవరి అనేది సిరీస్‌.

34
తండ్రి కూతురు మధ్య ఆధిపత్య పోరు

కల్పిత పోర్ట్ టౌన్ నేపథ్యంలో సాగే ఈ కథలో అధికారం, రాజకీయాలు, గ్యాంగ్ వార్స్, కుటుంబ విభేదాలు ప్రధానాంశాలుగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా తండ్రి-కూతురు మధ్య జరిగే పోరు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. పట్టణంలో రాజకీయాలు, నేరాలు, వ్యాపారాలపై పూర్తి ఆధిపత్యం చెలాయించే నాయుడికి, తన సొంత కూతురే పెద్ద సవాలుగా మారుతుంది. తన జీవితాన్ని తన నిర్ణయాలతో ముందుకు తీసుకెళ్లాలనుకునే భారతి, తండ్రికి ఎదురు నిలబడటంతో కథ ఉత్కంఠభరితంగా సాగుతుంది. ట్రైలర్‌ ఆద్యంతం ఆకట్టుకుంది. యాక్షన్‌ డ్రామా ప్రధానంగా ఈ మూవీ సాగబోతుందని తెలుస్తోంది.

44
ఇసకపట్నం ఓటీటీ స్ట్రీమింగ్‌ డేట్‌

ఇది ప్రైమ్‌ వీడియోలో స్ట్రీమింగ్‌ కానుంది. జులై 2 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానున్నట్టు తాజాగా టీమ్‌ ప్రకటించింది. గ్యారీ బీహెచ్ దర్శకత్వం వహించిన ఈ 7 ఎపిసోడ్‌ల సిరీస్‌కు ప్రశాంత్ రాఘతి కథ అందించగా, తాజుద్దీన్ సయ్యద్ సంభాషణలు రాశారు. రాహుల్ తమడా, సైదీప్ రెడ్డి బొర్రా తమడా మీడియా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మించారు. ఈ సిరీస్‌లో సునీల్, నరేష్ అగస్త్య, మెరిన్ ఫిలిప్, సుధాకర్ కోమాకుల, రాజీవ్ కనకాల, మైమ్ గోపీ, రోహిణి, బెనర్జీ, జ్వాల కోటి, రవి వర్మ, రాజా చెంబోలు తదితరులు కీలక పాత్రల్లో నటించారు. జులై 2 నుంచి ప్రైమ్ వీడియోలో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. అలాగే 15 భాషల్లో సబ్‌టైటిల్స్‌తో భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా 240కు పైగా దేశాలు, ప్రాంతాల్లో అందుబాటులోకి రానుంది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories