Sushmita: ఉపాసన చేసే వంటలపై సుస్మిత కొణిదెల కామెంట్‌.. తన పిల్లలు మాత్రం వదిలిపెట్టరట

Published : Jun 27, 2026, 07:40 PM IST

ఉపాసన ఏక కాలంలో విభిన్నమైన విధులు నిర్వర్తిస్తోంది. అలాంటి ఉపాసన కొన్ని వెరైటీ వంటకాలు కూడా చేస్తుందట. వాటికి తన పిల్లలు ఫిదా అవుతారని తెలిపింది సుస్మిత కొణిదెల. 

PREV
14
మల్టీటాలెంటెడ్‌గా రాణిస్తోన్న ఉపాసన

ఉపాసన కొణిదెల మల్టీ టాలెంటెడ్‌. ఆమె వ్యాపారవేత్తగా ఉంది. స్పెషల్‌ వంటకాల రెసిపీ చేస్తూ పాపులర్ అయ్యింది. అదే సమయంలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంటుంది. దీంతోపాటు మెగా ఫ్యామిలీలో కొడలిగా, పిల్లలకు తల్లిగా తాను అన్ని విధులను సక్రమంగా నిర్వర్తిస్తుంది. మంచి ఇల్లాలుగా రాణిస్తోంది. ఉపాసన స్పెషల్‌ వంటకాలకు కేరాఫ్‌ అడ్రస్‌ అట. అత్తమ్మ పేరుతో రెసిపీలు చేసి పాపులర్‌ అయిన విషయం తెలిసిందే.

24
ఉపాసన వంటలపై సుస్మిత కొణిదెల కామెంట్‌

ఉపాసన చేసే వెరైటీ వంటలకు సుస్మిత పిల్లలు ఫిదా అవుతారట. లొట్టలేసుకొని తింటారని తెలిపింది సుస్మిత. చంద్రవ్వతో ఇంటర్వ్యూలో ఆమె ముచ్చటించింది. ఇందులో ఉపాసన ప్రస్తావన వచ్చింది. ఈ సందర్భంగా ఉపాసనకి వంటలు ఏమైనా వస్తాయా? ఆమె చేస్తుందా? అని అడిగింది చంద్రవ్వ. దీనికి సుస్మిత రియాక్ట్ అవుతూ, ఉపాసన ఆమె స్టయిల్‌లో వెరైటీ వంటకాలు చేస్తుందని చెప్పింది. ఆ వంటలు మా పిల్లలకు బాగా ఇష్టం, లొట్టలేసుకొని తింటారు` అని చెప్పింది సుస్మిత. కాకపోతే ఆమె కాస్త విచిత్రంగా స్పందించడం ఆశ్చర్యంగా మారింది. ఇది మన శంకర వరప్రసాద్‌ గారు మూవీ ప్రమోషన్స్ టైమ్‌లో తెలిపింది.

34
విడిగా సుస్మిత, వారి పిల్లలు

ఇందులో మరో ఇంట్రెస్టింగ్‌ విషయాన్ని చెప్పింది సుస్మిత. మీది చాలా పెద్ద ఫ్యామిలీ అందరు కలిసే ఉంటారా? విడిగా ఉంటారా? అని అడిగింది. దీనికి సుస్మిత స్పందిస్తూ, తాము, పిల్లలు వేరుగా ఉంటామని, కానీ సండేగానీ, పండుగలకుగానీ అంతా కలుస్తామని చెప్పింది. తాము తరచూ కలుస్తూనే ఉంటామని, కలిసినప్పుడు సెలబ్రేషన్‌లాగా ఉంటుందని చెప్పింది సుస్మిత. ప్రస్తుతం ఆమె కామెంట్స్ వైరల్ గా మారాయి.

44
మన శంకర వర ప్రసాద్‌ గారుతో బ్లాక్ బస్టర్‌ అందుకున్న సుస్మిత

సుస్మిత కొణిదెల నిర్మాతగా చిరంజీవి హీరోగా `మన శంకర వర ప్రసాద్‌ గారు` మూవీని నిర్మించిన విషయం తెలిసిందే. సాహు గారపాటితో కలిసి ఆమె ఈ మూవీని నిర్మించింది. అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో వెంకటేష్‌ క్లైమాక్స్ లో గెస్ట్ గా మెరిశారు. సినిమాకి హైలైట్ గా నిలిచారు. సంక్రాంతికి విడుదలైన ఈ మూవీ బ్లాక్‌ బస్టర్‌గా నిలిచింది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories