హిందీలో ‘లైగర్’ పరిస్థితి ఇంత దారుణమా? ఒక్క రోజుకే లెక్క మారిందిగా.!

First Published Aug 26, 2022, 12:58 PM IST

టాలీవుడ్ స్టార్ విజయ్ దేవరకొండ - స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో వచ్చిన చిత్రం ‘లైగర్’ (Liger). తొలిరోజు మూవీ ఆడియెన్స్ అంచనాలను రీచ్ కాలేకపోయింది. ముఖ్యంగా హిందీలో సినిమా పరిస్థితి దారుణంగా ఉన్నట్టు తెలుస్తోంది. 
 

స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ - విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో వచ్చిన స్పోర్ట్స్ అండ్ రొమాంటిక్ ఫిల్మ్ ‘లైగర్’. ఇటు పూరీ జగన్నాథ్ ఇప్పటికే ‘ఇస్మార్ట్ శంకర్’తో బ్లాక్ బాస్టర్ హిట్ ను సొంతం చేసుకున్నాడు. విజయ్ కూడా ఇండస్ట్రీలో ఊపులోనే ఉన్నారు. వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా వస్తుండటంతో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. 
 

నిన్న ప్రపంచ వ్యాప్తంగా 3000 థియేటర్లలో రిలీజ్ అయిన  చిత్రం తొలిరోజే డిజాస్టార్ టాక్ ను సొంతం చేసుకుంది. రమ్యక్రిష్ణ, విజయ్ దేవరకొండ పెర్ఫామెన్స్ తప్ప.. సినిమాలో ఎలాంటి ఎగ్జైట్ మెంట్ లేదని, పూరీ మార్క్ అసలే లేదని ఆడియెన్స్ తెలుపుతున్నారు. ఇంతలా డిజపాయింట్ చేస్తారని ఊహించలేదని అటు ఫ్యాన్స్ కూడా అంటున్నారు. 

అయితే ఆగస్టు 25న ‘లైగర్’ హిందీలో మినహా వరల్డ్ వైడ్ రిలీజ్ అయ్యింది. ఒక్క హిందీలో మాత్రం ఒక్కరోజు ఆలస్యంతో ఆగస్టు 26న (నేడు) రిలీజ్ చేశారు. కాగా,  చిత్రంపై తొలిరోజు వచ్చిన నెగెటివ్ టాక్ తో అక్కడ  పరిస్థితి మారింది. భారీ  అంచనాలతో రిలీజ్ అయిన ఈ మూవీకి ప్రేక్షకాదరణ తగ్గుతోంది. 

హిందీలో ఈ రోజు ‘లైగర్’కు ఆడియెన్స్ లేకపోవడంతో 70 శాతం మార్నింగ్ షోలు రద్దు అయినట్టు తెలుస్తోంది. ఇదే విషయాన్ని ఫిల్మ్ క్రిటిక్, ట్రేడ్ ఎనలిస్ట్ కమల్ రషీద్ కుమార్ కూడా స్పష్టం చేశారు. మరో ట్వీట్ లో హిందీలో బెల్డ్ లో విజయ్ దేవరకొండ అడుగుపెట్టడం అసాధ్యమని అభిప్రాయపడ్డారు.
 

ప్రమోషన్స్ లో ‘లైగర్’కు హిందీలో వచ్చిన రెస్పాన్స్ తో ఈ సినిమాపైనే అక్కడ కొద్దిగా ఆశలు ఉండేవి. కానీ సినిమా డిజాస్టార్ టాక్  తెచ్చుకోవడంతో లెక్క మొత్తం మారిపోయింది. మరోవైపు ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. సినిమా నష్టాల్లో కూరుకుపోతుందని వినిపిస్తుంది. తొలిరోజు మాత్రం వసూళ్లు బాగానే కలెక్ట్ చేసినా రెండో రోజు వరకు ఆ లెక్కలు మారిపోయాయి. 

సినిమాను రూ. 165 కోట్ల బడ్జెట్ తో నిర్మించగా.. కనీసం అందులో సగం కూడా వచ్చే పరిస్థితి కనిపించడం లేదంటున్నారు. దీంతో నష్టాలు చూడక తప్పదని భావిస్తున్నారు. తొలిరోజు మాత్రం  ‘లైగర్’ రూ. 24 కోట్లకు పైగా గ్రాస్ వసూల్ చేసింది. ఇదే స్పీడ్ కొనసాగితే సినిమా నష్టాల నుంచి గట్టేక్కే అవకాశం ఉంది.  

click me!