సాయి ధరమ్ తేజ్ పెళ్లి... పరోక్షంగా హింట్ ఇచ్చిన మెగా హీరో!

Published : Oct 17, 2021, 05:40 PM ISTUpdated : Oct 17, 2021, 05:42 PM IST

మెగా హీరో సాయి ధరమ్ ఫ్యాన్స్ ఫుల్  ఖుషీగా ఉన్నారు. ఘోర రోడ్డు ప్రమాదానికి గురైన Sai dharam tej 35 రోజుల సుదీర్ఘ చికిత్స తరువాత, కోలుకొని ఇంటికి చేరారు. త్వరలోనే ఆయన షూటింగ్స్ కూడా హాజరుకానున్నారు.

PREV
15
సాయి ధరమ్ తేజ్ పెళ్లి... పరోక్షంగా హింట్ ఇచ్చిన మెగా హీరో!

కాగా సాయి ధరమ్ పుట్టినరోజు అక్టోబర్ 15న విజయదశమి రోజు డిశ్చార్జ్ అయ్యారు. ప్రాణాపాయం నుండి తప్పించుకొన్న సాయి ధరమ్ కి ఈ పుట్టినరోజు ప్రత్యేకంగా మారింది. దీనితో సోషల్ మీడియా వేదికగా అభిమానులు, చిత్ర ప్రముఖులు ఆయనకు బర్త్ డే విషెష్ తెలియజేశారు.
 

25

నాగబాబు కూతురు నిహారిక మెగా ఫ్యామిలీ సభ్యులందరూ కలిసి బర్త్ డే విషెస్ చెప్పిన ఓ వీడియో ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశారు. Niharika, ఉపాసన,  స్నేహారెడ్డి, అల్లు శిరీష్, కళ్యాణ్ దేవ్, శ్రీజ, వరుణ్ ఇలా అనేకమంది సదరు వీడియో ద్వారా సాయి ధరమ్ కి పుట్టినరోజు  శుభాకాంక్షలు తెలిపారు. 

35


ఈ వీడియో ద్వారా అల్లు  శిరీష్ ఓ హింట్ ఇచ్చారు. త్వరలో సాయి ధరమ్ పెళ్లి జరుగుతుందని పరోక్షంగా తెలియజేశారు.  సింగిల్ గా నీకు ఇది చివరి బర్త్ డే... అవుతుందని  భావిస్తున్న అంటూ Sirish కామెంట్ చేశారు. శిరీష్ మాటల్ని బట్టి చూస్తే... ధరమ్ పెళ్ళికి సర్వం సిద్ధమని, ప్రకటనే తరువాయి అన్న సందేహాలు కలుగుతున్నాయి. 

45

ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో సాయి ధరమ్ పెళ్లి వార్తలను ఖండించారు. పెళ్లికి ఇంకా సమయం ఉందని తెలియజేశారు. సాయి ధరమ్ కజిన్ శిరీష్ మాత్రం ఆయన పెళ్లిపై హింట్స్ ఇస్తున్నారు. ఒక వేళ సాయి ధరమ్ ప్రమాదానికి గురికాకపోతే దీనిపై ఇప్పటికే ప్రకటన జరిగి ఉండేదేమో.

55

ఇక కోలుకుంటున్న సాయి ధరమ్ నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. బైక్ ప్రమాద సమయంలో ఆయనకు కాలర్ బోన్ ఫ్రాక్చర్ అయ్యింది. మరోవైపు ఆయన నటించిన రిపబ్లిక్ మూవీ రెండు వారాల క్రితం విడుదల కావడం జరిగింది. త్వరలోనే సాయి ధరమ్ షూటింగ్ సెట్స్ లో జాయిన్ అవుతారట. 

 

Also read హాలీవుడ్ హీరోల రేంజ్ లో ఛార్జ్ చేస్తున్న ప్రభాస్... స్పిరిట్ కోసం అన్ని కోట్లా!

Also read EMK: ఎన్టీఆర్ షోకి అతిథులుగా దేవిశ్రీ, తమన్

Read more Photos on
click me!

Recommended Stories