రెమ్యునరేషన్ గొడవతో స్టార్ హీరోకు బై చెప్పిన డివివి దానయ్య?

First Published Apr 11, 2024, 8:32 AM IST

 'ఆర్‌ఆర్‌ఆర్‌' (RRR). ఈ చిత్రం ఆస్కార్‌ అవార్డును అందుకోవడంతో  చిత్ర నిర్మాత డీవీవీ దానయ్యకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ప్రస్తుతం  ఆయన


ఓటిటి బిజినెస్ వచ్చాక హీరోల రెమ్యునరేషన్స్ ఆకాశాన్ని అంటాయి. దానికి తోడు ప్యానిండియా బిల్డప్ తో ఆడినా,ఆడకపోయినా దేశవ్యాప్త రిలీజ్ పేరు చెప్పి హీరోలు బాగా వసూలు చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఓటిటి కాస్త చల్లబడింది. అంతంత రేట్లు పెట్టి సినిమా చేస్తే రేపు బిజినెస్ కాకపోతే ఏంటి పరిస్దితి అనేది నిర్మాతలకు భయం పట్టుకుంది. దాంతో మొదట్లో  క్రేజీ కాంబినేషన్స్ అనుకుని ఆసక్తి చూపించిన ప్రాజెక్టులు డైలమోలో పడిపోతున్నాయి. ఇప్పటికే తెలుగులో నాలుగైదు పెద్ద హీరోల సినిమాలు అలా ఆగిపోయే పరిస్దితికి చేరుకున్నాయి. ఇప్పుడు మరో స్టార్ హీరో సినిమా తెలుగులో ప్రారంభం కావాల్సింది ముగింపుకు వచ్చిందని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. వివరాల్లోకి వెళితే..
 

  సినిమాకు కెప్టెన్ డైరెక్టర్ అయితే.. ఆకెప్టెన్ న్ ను కూడా వెన్నంటి నడించేవాడు నిర్మాత. ట్రిపుల్ ఆర్ విషయంలో దాదాపు 5 వందల కోట్లు బడ్జెట్ పెట్టడమే కాదు.. కరోనాతో సంక్షోబంలో పడ్డప్పుడు., సినిమా రెండు సార్లు వాయిదా పడ్డప్పుడు మొక్క వోని దీక్షతో.. రాజమౌళి మీద నమ్మకంతో.. తాను దైర్యంగా ఉంటూ.. నిర్మాత దానయ్య.. ట్రిపుల్ ఆర్ బ్యాక్ గ్రౌండ్ రియల్  హీరో అనిపించుకున్నారు.  డివీవి దానయ్య   కోలీవుడ్ స్టార్ తలపతి విజయ్ తో సినిమా ప్లాన్ చేసారు.  విజయ్ ...ప్రస్తుతం వెంకట్ ప్రభు దర్శకత్వంలో 'గోట్' సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా టైం ట్రావెలింగ్ కాన్సెప్ట్ తో రాబోతోంది. జూన్ లో ఈ సినిమాని విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ ప్రాజెక్టు తర్వాత తలపతి విజయ్ 'RRR' నిర్మాత DVV దానయ్యతో సినిమా చేస్తున్నట్లు గత కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే.  అయితే ఇప్పుడు ఆ సినిమా ఆగిపోతోందని వినికిడి. అందుకు కారణం రెమ్యునరేషన్ వివాదం అంటున్నారు.

rrr


విజయ్, దానయ్య కాంబినేషన్ ప్రాజెక్టుకు సంబంధించి రోజుకో వార్త ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతుంది.   ఈ ప్రాజెక్టుకు సంబంధించి మరికొన్ని లీక్స్ బయటకు వచ్చాయి.  మొన్నటి వరకు విజయ్ -DVV దానయ్య కాంబినేషన్ సినిమాకి 'జిగర్తాండ' మూవీ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్ట్ చేసే అవకాశం ఉందని న్యూస్ వచ్చింది. కానీ  అతని స్థానంలో మరో కోలీవుడ్ డైరెక్టర్ పేరు వినిపించింది.  ఖాకీ, వలిమై, తెగింపు వంటి సినిమాలను తెరకెక్కించిన H.వినోద్ ని ఈ ప్రాజెక్ట్ కోసం అనుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే ఇక్కడే సమస్య వచ్చినట్లు సమాచారం.


విజయ్ ఈ సినిమా నిమిత్తం 200 కోట్లు రెమ్యునరేషన్ కోట్ చేసారు. డివివి దానయ్య ఓకే చేసారు. అయితే ఒకసారి విజయ్ ఈ ప్రాజెక్టు ఓకే అనుకున్నాక చాలా మంది డైరక్టర్స్ సీన్ లోకి వచ్చారు. అనేక స్క్రిప్టులు వినిపించారు. దానయ్య ఆలోచన ఏంటంటే తెలుగు స్టార్ డైరక్టర్ ఈ ప్రాజెక్టు ని టేకప్ చేస్తే ...తెలుగు మార్కెట్ సమస్య ఉండదు. తమిళ మార్కెట్ ఎలాగో విజయ్ కు ఉండనే ఉంది. కాబట్టి ఫెరఫెక్ట్ అనుకున్నారు. 

అయితే డైరక్టర్ గా  H.వినోద్ ని ఎప్పుడైతే సీన్ లోకి తెచ్చారో అప్పుడే సమస్య మొదలైందని తెలుస్తోంది. ఆ దర్శకుడుతో దాదాపు 400 కోట్లు తాను పెట్టలేనని ,వినోద్ కు తెలుగులో మార్కెట్ లేదు కాబట్టి బిజినెస్ కాదని దానయ్య తేల్చి చెప్పారట. విజయ్ మాత్రం వినోద్ కథకే లాక్ అయ్యారట. దాంతో తను వినోద్ తో చేయాలనుకుంటున్నాని తేల్చి చెప్పారట. ఈ క్రమంలో దాయన్య ఇక ఈ ప్రాజెక్టుని తాను డీల్ చేయలేనని చెప్పేసారట. ఈ క్రమంలో విజయ్ తనకు అడ్వాన్స్ గా ఇచ్చిన ఎమౌంట్ వెనక్కి ఇచ్చేస్తున్నారని తెలుస్తోంది. వేరే నిర్మాతను విజయ్ వెతుకుతున్నారట. 


వాస్తవానికి విజయ్​ పొలిటికల్ ఎంట్రీ ముందు ఇదే చివరి సినిమా అయ్యే ఛాన్స్​ ఉంది. దీంతో తమిళ ఆడియెన్స్ తప్పకుండా భారీ సంఖ్యలో దీన్ని చూస్తారు. అసలే విజయ్ సినిమా అంటేనే రికార్డులు గ్యారంటీ. ఇక బాగుంటే మాత్రం వెరే లెవల్​లో ఉంటది. దానయ్యకు కూడా మంచి లాభాలు తెచ్చిపెడుతుంది. కానీ తెలుగు వెర్షన్ కు వచ్చేసరికి అవేమీ వర్కవుట్ కావు. ఇక్కడ కంటెంట్ బాగుండేనే విజయ్ సినిమా చూస్తారు. లేదా మన తెలుగు డైరక్టర్ అయ్యింటే ఆ క్రేజ్ పనిచేస్తుంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.


 రాజమౌళి దర్వకత్వంలో జూనియర్‌ ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌ హీరోలుగా అత్యంత భారీ బడ్జెట్‌లో నిర్మించిన చిత్రం 'ఆర్‌ఆర్‌ఆర్‌' (RRR). ఈ చిత్రం ఆస్కార్‌ అవార్డును అందుకోవడంతో పాటు చిత్ర నిర్మాత డీవీవీ దానయ్యకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ప్రస్తుతం  ఆయన పవర్ స్టార్​ పవన్ కల్యాణ్​తో 'ఓజీ (Original Gangster)', నేచురల్ స్టార్ నానితో 'సరిపోదా శనివారం' సినిమాలు చేస్తున్నారు. ఈ రెండు సినిమాలకు ఉన్న క్రేజ్​తో థియేట్రికల్ ప్లస్ డిజిటల్ రైట్స్​కు భారీ డిమాండ్ ఉంటుంది. ఇప్పటికే డీల్స్ ముగించేస్తున్నారు.  ఈ రెండు సినిమాలపై ఆయనకు భారీగా బిజినెస్ జరుగుతుంది.

click me!