ఒత్తైన జుట్టు అద్దంలో చూసుకుంటుంటే వచ్చే మజా వేరు. పబ్లిక్ లో వేళ్ళతో సరి చేసుకుంటూ ఫోజు కొట్టడాన్ని కిక్ గా ఫీల్ అవుతారు యూత్. ఇక జుట్టు రాలిపోతుంటే ఎక్కడలేని దిగులు మొదలవుతుంది. అమ్మో బట్టతల వచ్చేస్తుందేమో అని కంగారు పడిపోతారు. హెయిర్ ఫాల్ ఆపాలని... ఎవడేం చెప్పినా నమ్మేస్తారు, ఆకులు అలములు, ఆయిల్స్, షాంపూస్ వాడేస్తాం. ఒక సామాన్యుడే ఇంతలా జుట్టు గురించి ఆలోచిస్తే సెలెబ్రిటీలకు జుట్టు అంటే ఎంత ప్రేమ, ఊడిపోతే ఎంత బాధ కలుగుతుందో చెప్పండి. అందమే పెట్టుబడైన హీరోలకు జుట్టు చాలా అవసరం.