#Prabhas: రాజమౌళి కొడుకు.. ప్రభాస్ ని వాడేస్తాడా? ఈవెంట్ కు పిలుస్తున్నాడా?

Published : Feb 29, 2024, 10:07 AM IST

రాజమౌళికి, ప్రభాస్ కు ఉన్న సాన్నిహిత్యం అంతా ఇంతాకాదు. వారి కుటుంబ సభ్యులతో  కూడా ప్రభాస్ కు చక్కటి అనుబంధం ఉంది. 

PREV
18
 #Prabhas: రాజమౌళి కొడుకు.. ప్రభాస్ ని వాడేస్తాడా? ఈవెంట్ కు పిలుస్తున్నాడా?

ఈ రోజున సినిమా ప్రమోషన్స్ అంటే కోట్లలో ఉన్నాయి. ఎంత తక్కువలో చేస్తాము..ఎంత ఎక్కువ క్రేజ్ క్రియేట్ చేస్తాము అనేది ఇప్పుడు ప్రొడక్షన్ హౌస్ లకు సమస్యగా మారింది. పబ్లిసిటీ కోసం ప్రత్యేకమైన టీమ్ లు, పీఆర్ లు ఉన్నా ఫలితం కనపడటం లేదు. మినిమం ఓపినింగ్ పడాలి అంటే జనాలకు ఫలానా సినిమా రాబోతోందనే విషయం తెలియాలి.  సోషల్ మీడియా ఇన్ఫూలియెన్సర్స్ తో  ఆ పనిచేయగలిగినా పెద్దగా ఒరిగిందేమీ కనపడటం లేదు. అలాంటప్పుడు ఏం చేయాలి..స్టార్స్ ని సీన్ లోకి తేవాలి. అది అందరికీ సాధ్యమయ్యే పనేనా

28
Premalu Telugu First Look

కానీ రాజమౌళి వంటివారికి సాధ్యమే. ఆయన కుమారుడు ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ లోకి దిగి మలయాళంలో ఇటీవల సూపర్ హిట్ అయిన ‘ప్రేమలు’ సినిమాని తెలుగులోకి తీసుకురాబోతున్నారు. నస్లెన్, మమిత బైజు.. పలువురు ముఖ్య పాత్రలతో గిరీష్ దర్శకత్వంలో, నటుడు ఫహద్ ఫాజిల్ నిర్మాణంలో తెరకెక్కిన ప్రేమలు సినిమా ఇప్పుడు తెలుగులోకి తీసుకువస్తున్నారు. ఆ సినిమా ప్రీ రిలీజ్ పంక్షన్ చేసి హైప్ తేవాలనే ప్లాన్ లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

38
Naslens Premalu

అయితే అందరి అటెన్షన్ గ్రాబ్ చేయాలంటే ఏం చేయాలి. ప్రభాస్ వంటి స్టార్ సీన్ లోకి రావాలి. రాజమౌళికి, ప్రభాస్ కు ఉన్న సాన్నిహిత్యం అంతా ఇంతాకాదు. వారి కుటుంబ సబ్యులతో కూడా ప్రభాస్ కు అనుబంధం ఉంది. అలాంటప్పుడు ఖచ్చితంగా ప్రభాస్ ని ఈ ప్రేమలు ఈవెంట్ కు పిలిస్తే ఎలా ఉంటుందనే ఆలోచన చేస్తున్నట్లు ఫిల్మ్ సర్కిల్ లలో వినిపిస్తోంది. అయితే అందులో ఎంతవరకూ నిజముంది అనేది తెలియాల్సి ఉంది.

48

ఇక  మలయాళంలో ప్రేమలు సినిమాని కేవలం 3 కోట్లతో తెరకెక్కించగా ఫిబ్రవరి 9న రిలీజయి ఏకంగా 50 కోట్ల వరకు కలెక్షన్స్ తెచ్చుకుంది. ఈ సినిమాని రాజమౌళి తనయుడు కార్తికేయ తెలుగులో డబ్బింగ్ చేసి తీసుకువస్తున్నారు. శివరాత్రి సందర్భంగా మార్చ్ 8న ఈ సినిమా తెలుగులోకి రాబోతున్నట్టు తెలుస్తుంది. అయితే తాజాగా దీనికి సంబంధించిన పోస్టర్ ని కార్తికేయ రిలీజ్ చేశారు. అందులోను బాహుబలి ఇమేజెస్ ని వాడుతున్నారు. 
 

58

ఈ పోస్టర్ లో హీరో హీరోయిన్స్ ని బాహుబలి పోజులో నిల్చోబెట్టి బాణాలు వదులుతున్నట్టు చూపించారు. ఆ బాణాల చివర్లో లవ్ సింబల్స్ పెట్టి ప్రేమ బాణాలుగా చూపించారు. ఈ పోస్టర్ కొత్తగా ఉండటంతో వైరల్ గా మారింది. మరి మలయాళంలో యూత్ ని మెప్పించిన ఈ రొమాంటిక్ కామెడీ సినిమా తెలుగు ప్రేక్షకులని ఎంతవరకు లభిస్తుందో చూడాలి.

68
premalu brahmayugam

ఇప్పుడు ఎక్కడ చూసినా మలయాళ సినిమాలదే హవా. ఓ ప్రక్కన భ్రమయుగం మరో ప్రక్క  'ప్రేమలు' దుమ్ము దులిపేస్తున్నాయి. ప్రేమలు మూవీ సూపర్ హిట్​ టాక్​తో దూసుకుపోతోంది. ఫీల్ గుడ్ లవ్​ జానర్​లో తెరకెక్కిన ఈ సినిమా ఫిబ్రవరి 9న రిలీజై కేరళలో సక్సెస్​ఫుల్​గా నడుస్తోంది. రూ.3 కోట్ల బడ్జెట్​తో రూపొందిన ఈ సినిమా ఇప్పటివరకు రూ.50+ కోట్లు వసూల్ చేసినట్లు ట్రేడ్ వర్గాలు లెక్కలు  వేస్తున్నాయి.   

78

ఈ సినిమాకు సంభందించి మరో ఇంట్రస్టింగ్  విషయం ఏంటంటే ఈ మలయాళ సినిమా అంతా హైదరాబాద్ బ్యాక్ డ్రాప్ లోనే నడవటం. దాంతో మనవాళ్లు ఈ సినిమా చూడటానికి థియేటర్స్ దగ్గర క్యూలు కడుతున్నారు. హైదరాబాద్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన ప్రేమలు చూసిన వాళ్ళందరూ సోషల్ మీడియాలో ఈ సినిమా గురించి రాస్తున్నారు. మాట్లాడుతున్నారు. 

88
Naslen starrer Premalu

చాలా సింపుల్ క్యూట్ స్టోరీ గా తెరకెక్కిన ఈ చిత్రానికి హైదరాబాద్ లో కంటిన్యూ షోలు పడుతున్నాయి. ఓ ప్రక్కన  మమ్ముట్టి భ్రమ యుగం ,మరో ప్రక్క ప్రేమలు చూడటమే వీకెండ్ లో పనిగా పెట్టుకున్నారు కుర్రకారు.  ఈ సినిమాలో నల్సేన్ కె. గఫూర్, మమిత బైజు హీరో హీరోయిన్లుగా నటించారు. క్లీన్ కామెడీ,  యూత్ ఫుల్ కంటెంట్ తో ఉన్న ఈ సినిమా తెలుగులోనూ వర్కవుట్ అవుతుందని భావిస్తున్నారు. ప్రభాస్ కనుక ఈ ఈవెంట్ కు వస్తే క్రేజ్ మామూలుగా ఉండదు. 

Read more Photos on
click me!

Recommended Stories