ప్రభాస్‌, హనురాఘవపూడి మూవీ స్టోరీ లైన్‌ ఇదే ? .. `రాధేశ్యామ్‌` ని గుర్తుచేసుకుంటూ ఫ్యాన్స్ గగ్గోలు

Published : Feb 29, 2024, 08:24 AM IST

ప్రభాస్‌ నెక్ట్స్ సినిమాల లైనప్‌ భారీగా ఉంది. అందులో హను రాఘవపూడి మూవీ కూడా ఉంది. ఈ సినిమాకి సంబంధించిన ఒక లీకేజీ వార్త వైరల్‌ అవుతుంది. ఫ్యాన్స్ ని కలవరపెడుతుంది.   

PREV
15
ప్రభాస్‌, హనురాఘవపూడి మూవీ స్టోరీ లైన్‌ ఇదే ? .. `రాధేశ్యామ్‌` ని గుర్తుచేసుకుంటూ ఫ్యాన్స్ గగ్గోలు

ప్రభాస్‌ టాలీవుడ్‌లోనే అత్యంత బిజీ లైనప్‌ ఉన్న హీరో. అంతేకాదు ఎక్కువ సినిమాల లైనప్‌ ఉన్న హీరో కూడా. ఆయన పేరుతో వేల కోట్ల బిజినెస్‌ జరుగుతుంది. ప్రస్తుతం ఆయన నటిస్తున్న, చేయాల్సి సినిమాలన్నీ కలిస్తే సుమారు ఐదారు వేల కోట్ల వ్యాల్యూ ఉంటుందని చెప్పొచ్చు. ఆయన ఒక్క సినిమాపైనే వెయ్యి కోట్లకుపైగా వ్యాపారం జరుగుతుంది. ఇక పెద్ద రేంజ్‌ సినిమాల స్థాయి రెండు వేల కోట్లకుపైమాటే. ఇలా బడ్జెట్‌, బిజినెస్‌, వసూళ్ల పరంగా చూస్తే ప్రభాస్‌ సినిమాల లెక్క ఏడెనిమిది వేల కోట్లు ఉంటుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. 
 

25

ఇక ప్రస్తుతం ఆయన `కల్కి2898ఏడీ`లో నటిస్తున్నారు. నాగ్‌ అశ్విన్‌ రూపొందిస్తున్న ఈ భారీ కాస్టింగ్‌ సైన్స్ ఫిక్షన్‌ మూవీ మేలో విడుదల కాబోతుంది. దీంతోపాటు మారుతి దర్శకత్వంలో `ది రాజాసాబ్‌` చేస్తున్నారు. ఇది ఈ ఏడాది చివర్లోగానీ, వచ్చే ఏడాది ప్రారంభంలోగానీ రానుంది. అలాగే సందీప్‌ రెడ్డి వంగాతో `స్పిరిట్‌` చేయబోతున్నారు. ఇది త్వరలోనే ప్రారంభం కాబోతుంది. ఆ తర్వాత హను రాఘవపూడి మూవీ ఉంది. అయితే ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్‌ విషయం బయటకు వచ్చింది. స్టోరీ లైన్ లీక్‌ అయ్యింది. సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది. 
 

35

ప్రభాస్‌తో హను రాఘవపూడి ఓ వార్‌ బేస్డ్ మూవీ చేయబోతున్నారని గతంలో ప్రచారం జరిగింది. కానీ దానికి కొనసాగింపుగా మరో క్రేజీ వార్త నెట్టింట వైరల్‌ అవుతుంది. ఇది వార్‌ ప్రధానంగా సాగే లవ్‌ స్టోరీ అట. ఇందులో ప్రభాస్‌ సైనికుడిగా కనిపించే అవకాశం ఉందట. ఓ వైపు యుద్ధం, మరోవైపు లవ్‌ స్టోరీ ఇదే ఈ సినిమా మెయిన్‌ లైన్‌ అని తెలుస్తుంది. మరి ఆ రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేశారనేది కథగా ఉంటుందట. 
 

45

ఇదే ఇప్పుడు డార్లింగ్‌ ఫ్యాన్స్ ని కలవరానికి గురి చేస్తుంది. టెన్షన్‌ పెడుతుంది. యుద్ధం వరకు ఓకే, మళ్లీ ఆ లవ్‌ స్టోరీ ఏంటనేది వాళ్ల భయానికి కారణం. ప్రభాస్‌తో లవ్‌ స్టోరీ ఏంట్రా అంటున్నారు. ఇప్పటికే `రాధేశ్యామ్‌` పెద్ద డిజాస్టర్‌ అయ్యారు. ప్రభాస్‌ని అలాంటి పాత్రలో చూడలేకపోయారు. మళ్లీ `రాధేశ్యామ్‌` చేస్తారా ఏంటీ అంటూ ఆందోళన చెందుతున్నారు అభిమానులు. మాకు ఆ లవ్‌ స్టోరీలు వద్దంటూ గగ్గోలు పెడుతున్నారు. 
 

55

హను రాఘవపూడి గత చిత్రం `సీతారామం`లో ఆర్మీ బేస్డ్ లవ్‌ స్టోరీ. ఇందులో హీరో దుల్కర్‌ని సైనికుడిగా చూపించారు. అతని ప్రేమ కథని ఆవిష్కరించారు. యుద్ధం సన్నివేశాలను చివర్లో చూపించి క్లోజ్‌ చేశారు. మెయిన్‌ పాయింట్‌ అది కాదు, లవ్‌ స్టోరీ హైలైట్‌గా ఉంటుంది. మరి ప్రభాస్‌ సినిమాని ఎలా చూపిస్తారనేది చూడాలి. పాన్‌ ఇండియా లెవల్‌లో సినిమా అంటే ఆమాత్రం జాగ్రత్త ఆయన తీసుకుంటారని చెప్పొచ్చు. మరి సినిమా ఎలా తీస్తారనేది ఆసక్తికరంగా మారింది. మూవీని ఈ ఏడాది చివర్లో ప్రారంభించబోతున్నారట. ఇందులో ఓ హాలీవుడ్‌ హీరోయిన్‌ని తీసుకునే ఆలోచనలో ఉన్నారట. ప్రస్తుతం ఆ చర్చలు జరుగుతున్నట్టు సమాచారం. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories