పవన్ కల్యాణ్ అప్పట్లో ఎస్ జే సూర్యను కొట్టారా? నిజమెంత

Published : Sep 06, 2024, 01:10 PM IST

పవన్ కళ్యాణ్ కెరీర్ మొదలుపెట్టిన ఐదేళ్లకే ‘ఖుషి‘తో ఆల్ టైమ్ ఇండస్ట్రీ ఇచ్చిన ఘనత ఎస్.జె.సూర్య ది.

PREV
17
 పవన్ కల్యాణ్ అప్పట్లో ఎస్ జే సూర్యను కొట్టారా? నిజమెంత
Pawan Kalyan , nani, khushi, sj suryah, komaram puli


కొన్ని పాత విషయాలు సమయం, సందర్బం లేకుండా వార్తల్లోకి వచ్చి వైరల్ అవుతూంటాయి. అలా గత కొద్ది రోజులోగా సోషల్ మీడియాలోని ఎస్ జే సూర్యకు చెందిన పాత విషయాలు మీడియాలో హాట్ టాపిక్ గా మారుతున్నాయి.

సరిపోదా శనివారం చిత్రం సూపర్ హిట్ అయ్యి ఎస్ జే సూర్య కు పేరు రావటంతో ఇప్పుడు ఆయన  విషయాలు ని బయిటకు తీస్తున్నారు. ముఖ్యంగా పవన్ గురించి ఎస్ జే సూర్య ఈ మధ్యన తన స్నేహితుడు అని కామెంట్ చేయటం జరిగింది.

27
pawan Kalyan, chiranjeevi, gabbar singh, nagabau



ప్రస్తుతం సౌత్ సినిమా ఇండస్ట్రీలో అత్యధికంగా మాట్లాడుకుంటున్న పేరు ఎస్ జె సూర్య. దర్శకుడిగా కెరియర్ స్టార్ట్ చేసిన ఎస్ జె సూర్య పవన్ కళ్యాణ్ కి ఖుషి లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చారు. తెలుగు, తమిళ్ భాషలలో దర్శకుడిగా సూపర్ హిట్ సినిమాలు చేసిన ఎస్ జె సూర్య న్యూ అనే మూవీతో హీరోగా కెరియర్ స్టార్ట్ చేశాడు.

అక్కడి నుంచి రెగ్యులర్ గా మూవీస్ చేస్తూ వస్తున్నాడు. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు స్పైడర్ సినిమాతో విలన్ గా యూ టర్న్ తీసుకున్నారు. ఇప్పుడు నాని చిత్రం సరిపోదా శనివారం తో నెక్ట్స్ లెవిల్ కు వెళ్లారు. 

37
pawan Kalyan, chiranjeevi, gabbar singh, nagabau

 
పవన్ కళ్యాణ్ కెరీర్ మొదలుపెట్టిన ఐదేళ్లకే ‘ఖుషి‘తో ఆల్ టైమ్ ఇండస్ట్రీ ఇచ్చిన ఘనత ఎస్.జె.సూర్య ది. పేరుకు రీమేక్ అయినా.. ఒరిజినల్ మూవీతో పాటుగా మొదలైంది ‘ఖుషి‘ చిత్రం.

విడుదల తర్వాత తెలుగులో సెన్సేషనల్ హిట్ సాధించింది. ఆ తర్వాత కొన్నాళ్లకు వీరి కలయికలో ‘కొమరం పులి‘ సినిమా వచ్చింది. అయితే.. సినిమాలకు అతీతంగా పవన్ కళ్యాణ్ అంటే ఎస్.జె. సూర్య కి ఎంతో అభిమానం.

47
Happy Birthday Pawan Kalyan


ఆ అభిమానాన్ని ‘భారతీయుడు 2‘ ప్రీ రిలీజ్ వేడుక వేదికగా మరోసారి బయటపెట్టాడు ఎస్.జె.సూర్య.‘భారతీయుడు-2’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురించి తమిళ దర్శకుడు, నటుడు ఎస్.జె.సూర్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

‘దేశం కోసం గొప్ప పనులు చేసే ప్రతి ఒక్కరూ ‘భారతీయుడే’ అని తెలుపుతూ.. అలాంటి ఒక భారతీయుడు నా స్నేహితుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‘ అన్నాడు.

57

ఇక అప్పట్లో కొమురం పులి షూటింగ్ సమయంలో పవన్ కళ్యాణ్ ...ఎస్ జే సూర్యని కొట్టారని వార్తలు వచ్చాయి. తనతో కొమురం పులి చిత్రం డైరక్ట్ చేస్తున్న దర్శకుడు ఎస్.జె.సూర్యని పవన్ కళ్యాణ్ కొట్టాడంటూ ఓ రూమర్ ఫిల్మ్ సర్కిల్స్ లో ప్రయాణం చేసింది.

 దాని ప్రకారం తలకోన అడవిలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఓ రోజు ఉదయం పవన్ కళ్యాణ్ షూటింగ్ స్పాట్ కి చేరుకునేసరికి సూర్య యూనిట్ మెంబర్స్ లో ఒకరిని బండబూతులు తిడుతూ కనిపించారు. 

67


అతని పచ్చి బూతులు విన్న పవన్ కళ్యాణ్ పట్టరాని కోపంతో దర్శకుడుని చెంప చెళ్ళు మనిపించాడని..దాంతో ఆ రోజు షూటింగ్ కాన్సిల్ అయిందని చెప్పుకున్నారు. ఇద్దరూ ఎడమొహం పెడమొహంగా ఉండేవారని, విషయమేమిటని పవన్...అడక్కుండా ఈ పనిచేయటం సూర్యని నొప్పించిందని, అలాగే యూనిట్ ముందు తనని అవమానపరిస్తే ..తర్వాత తాను వారితో ఎలా పనిచేయించుకోగలనని వాపోయాడని చెప్పుకున్నారు. 

77

అయితే పవన్ చాలా సెన్సిటివ్ గా ఉంటాడని, పొరపాటున కూడా డిసిప్లెన్ ఎవరు తప్పినా సీరియస్ అవతాడని, అంతేగాని వ్యక్తిగత కక్షతో కాదు కదా అని తర్వాత సూర్య అర్దం చేసుకుని పవన్ కు సారి చెప్పారని చెప్పుకున్నారు. అందులో ఎంతవరకూ నిజం ఉందో కానీ ఇప్పుడు మరోసారి ఆ విషయం వైరల్ అవుతోంది. 

Read more Photos on
click me!

Recommended Stories