శ్రీలీల ఆ సినిమాకు నో చెప్పటమే మంచిదైందా, ఇప్పుడు ఇదే చర్చ

First Published | Sep 6, 2024, 12:57 PM IST

సినిమా సక్సెస్ ,ఫెయిల్యూర్  అనే సంగతి పక్కన పెడితే   శ్రీలీల వేసే స్టెప్పులు మాత్రం సూపర్ హిట్ అవుతూనే ఉన్నాయి.  

Sreeleela

టాలీవుడ్ యంగ్ బ్యూటీ శ్రీలీలకి  గత కొంత కాలంగా టైమ్ సరిగ్గా నడవటం లేదు. ఆమె వరుసగా సినిమాలు చేస్తోంది కానీ అవేమీ వర్కవుట్ కావటం లేదు.  అలాగని ఆమె డిమాండ్ తగ్గటం లేదు. తన అందంతో పాటు అద్భుతమైన డ్యాన్స్‌ తో అదరగొట్టడమే అందుకు కారణం.

ముఖ్యంగా ఆమె డాన్స్ కు ఫిదా అయిన హీరోలు తమ సినిమాల్లో స్పెషల్ డాన్స్ లకు ఆమెను ఆహ్వానిస్తున్నారు. అయితే కెరీర్ లో ఒక్కసారి అటు వైపు వెళ్తే డిస్ట్రబెన్స్ గా ఉంటుందని శ్రీలీల వెనకడగు వేస్తోంది.
 

Sreeleela


ఇదే క్రమంలో  ఈ బ్యూటీకు విజయ్ హీరోగా చేసిన తాజా చిత్రం గోట్ లో స్పెషల్ సాంగ్ కోసం ఆఫర్ వచ్చింది.  విజయ్ సినిమా అంటే మొదట ఆసక్తి చూపినా తర్వాత ఆమె వద్దనుకుంది.

శ్రీలీలతో అనుకున్న పాటను త్రిష తో చేసారు. అయితే సినిమాలో త్రిష, విజయ్ సాంగ్ చూసాక..శ్రీలీల చేయకపోవటమే బెస్ట్ అంటున్నారు.
 


Sreeleela

శ్రీలీల విజయ్ సినిమా కదా అని టెమ్ట్ అవకుండా రిజెస్ట్ చేయటం మంచి పని అయ్యిందని సోషల్ మీడియాలో వినపడుతోంది. విజయ్ తో శ్రీలీల అదిరిపోయే స్టెప్ లు వేస్తుంది. అయితే ఉపయోగం ఏముంది. శ్రీలీల తమిళంలో ఓ స్టార్ హీరోయిన్ గా ఎదగాల్సిన టైమ్ ఎదర ఉంది.

ఆమెకు అక్కడ పెద్ద హీరోల సరసన ఆఫర్స్ వస్తాయి. ఒక్కసారి శ్రీలీల చేసిన మ్యాజిక్ జరగలేదని అంటే ఇంక అక్కడ నుంచి ఆఫర్స్ రావనేది నిజం. త్రిషకు ఆ సమస్య లేదు. త్రిష ఆల్రెడీ విజయ్ తో సినిమాలు చేసింది. తమిళంలో ఎస్టాబ్లిష్ నటి.

Sreeleela


అయితే ఒక్కటి మాత్రం నిజం. విజయ్ తో చేస్తే శ్రీలీలకు మంచి మైలైజి వస్తుంది. అలాగే మరిన్ని డాన్స్ నెంబర్ ఆఫర్స్ వస్తాయి తమిళం నుంచి. గుంటూరు కారం, ధమాకా చిత్రాలతో శ్రీలీల తన డాన్స్ పవర్ ఏంటో ప్రూవ్ చేసుకుంది.

ఇక ఇప్పటికే శ్రీలలకు వరుస మూవీ ఆఫర్లు వచ్చి పడుతున్నాయి.కొన్ని నెలలుగా శ్రీలీల రోజులో మూడు షిఫ్ట్‌ లలో షూటింగ్ చేసిన రోజులు కూడా చాలానే ఉన్నాయి.

Sreeleela


శ్రీలీల కెరీర్ విషయానికి వస్తే.. గతేడాది శ్రీలీల నటించిన స్కంద, ఆదికేశవ మరియు ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ చిత్రాలు తీవ్రంగా నిరాశపరిచాయి. ఇటీవల వచ్చిన గుంటూరు కారం మూవీకి కూడా ముందు నెగటివ్ రివ్యూలు వచ్చాయి.

కానీ సినిమాకు కలెక్షన్స్ బాగానే వస్తున్నాయి. రౌడీ హీరో విజయ్ దేవరకొండ తో ఓ సినిమా చేసేందుకు శ్రీలీల అంగీకరించారు. ప్రస్తుతం ఆ మూవీ ఇంకా మొదలుకాలేదు. 
 

Sreeleela


అలాగే, పవన్ కల్యాణ్ హీరోగా చేస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్‍లోనూ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది.. అయితే, పవన్ కల్యాణ్ ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉండటంతో ఈ మూవీ షూటింగ్ కూడా నిలిచిపోయింది. 
 

Latest Videos

click me!