బాడీల గురించి వాయిస్ రైజ్ చేసిన విష్ణుప్రియ, సీత..మధ్యలో అతడు ఇరుక్కుపోయాడుగా, మణికంఠ పూర్తిగా సైడ్ కి..

First Published Sep 6, 2024, 1:00 PM IST

యాష్మి గ్రూపు, నైనికా గ్రూపు మధ్య ఎవరు బలమైన వారు అనే విషయంలో టాక్స్ జరిగింది.

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 షో తొలి వారంలోనే గొడవలు, పెద్ద హంగామాతో మొదలైంది. కొంతమంది కంటెస్టెంట్స్ లో తమ మాట నెగ్గించుకునేందుకు ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. సోనియా ఆకుల, మణికంఠ, ప్రేరణ, యాష్మి బలంగా తమ వాయిస్ వినిపిస్తున్నారు. అదే విధంగా నిఖిల్, విష్ణుప్రియ కూడా తమ గళం వినిపించడం మొదలు పెట్టారు. 

హైయెస్ట్ రెమ్యునరేషన్ తో ఎంట్రీ ఇచ్చిన హీరో ఆదిత్య ఓం మాత్రం ఇంత వరకు తన మార్క్ స్ట్రాటజీ కానీ, ఇన్వాల్వ్మెంట్ కానీ ప్రదర్శించలేదు. శేఖర్ భాషా నిద్ర పోతున్నాడనే విమర్శ ఉన్నప్పటికీ నామినేషన్స్ లో బాగా ఆర్గుమెంట్ చేశాడు. తాజాగా శుక్రవారం ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో విడుదలయింది. ప్రస్తుతం హౌస్ లో నైనికా, నిఖిల్, యాష్మి చీఫ్ లుగా ఉన్నారు. 

బిగ్ బాస్ తెలుగు 8 - ఏసియానెట్ పోల్

Latest Videos


కంటెస్టెంట్స్ అంతా ఈ చీఫ్ లతో కలసి మూడు గ్రూపులుగా విడిపోయారు. యాష్మి గ్రూపు, నైనికా గ్రూపు మధ్య ఎవరు బలమైన వారు అనే విషయంలో టాక్స్ జరిగింది. శుక్రవారం ఎపిసోడ్ లో ఈ టాస్క్ చూపించబోతున్నారు. ప్రోమోలో ఆసక్తికర విషయాలు రివీల్ చేశారు. నైనికా, యాష్మి గ్రూపు మధ్య టాస్క్ జరిగింది. దీనికి నిఖిల్ సంచాలకుడిగా వ్యవహరించారు. 

ప్రోమోలో చూపిన దాని ప్రకారం ఈ టాస్క్ లో నైనికా గ్రూపు విజయం సాధించారు. కొన్ని రింగ్స్ ని గ్రూపు సభ్యులు చైన్ లాగా నిలబడి తమ బాడీ మీదుగా అవతలి వైపుకు పాస్ చేయాలి. అయితే నైనికా గ్రూపు వాళ్ళు రూల్స్ ఫాలో కాలేదని.. బాడీల మీదుగా రింగ్స్ పాస్ చేయలేదని వాదించారు. దీనితో యాష్మి గ్రూపుకి వ్యతిరేకంగా విష్ణుప్రియ, సీత, నైనికా గట్టిగా వాయిస్ రైజ్ చేశారు. తాము రూల్స్ ప్రకారమే టాస్క్ ఆడినట్లు తెలిపారు. 

Vishnupriya Bhimeneni

అయితే సంచాలక్ గా ఉన్న నిఖిల్ వీరిద్దరి గొడవలో ఇరుక్కుపోయారు. గేమ్ ఆడే రూల్ విషయంలో ఎవరికీ క్లారిటీ లేదు. తమ బాడీల మీదే రింగ్స్ తీసుకెళ్ళాం అని సీత వాదించింది. ఈ పంచాయతీ ఎలా తేలింది అనేది ఎపిసోడ్ చూస్తే అర్థం అవుతుంది. ఇదిలా ఉండగా ఇప్పటివరకు ఎమోషనల్ గానో, కోపంగానో హైలైట్ అవుతూ వచ్చిన మణికంఠని.. ఈ ప్రోమోలో దాదాపుగా పక్కన పెట్టేశాడు. మణికంఠ కూడా నామినేషన్స్ లో ఉన్న నేపథ్యంలో తాజాగా ఇలా చేయడం ఆసక్తిగా మారింది. 

click me!