కృష్ణను పవన్ కళ్యాణ్ అవమానించాడా? ఏపీని ఊపేస్తున్న వివాదం! ఎవరిది తప్పు?

Published : Apr 22, 2024, 11:27 AM ISTUpdated : Apr 22, 2024, 01:23 PM IST

పవన్ కళ్యాణ్  తన రాజకీయ ప్రసంగంలో భాగంగా చేసిన కామెంట్స్ వివాదాస్పదం అయ్యాయి. కృష్ణను పవన్ కళ్యాణ్ అవమానించాడని ఒక వర్గం ఆరోపణలు చేస్తుండగా, పవన్ కళ్యాణ్ సపోర్టర్స్ మాత్రం వక్రీకరించారని అంటున్నారు.   

PREV
19
కృష్ణను పవన్ కళ్యాణ్ అవమానించాడా? ఏపీని ఊపేస్తున్న వివాదం! ఎవరిది తప్పు?
Pawan Kalyan

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్డీఏ కూటమిలో చేరారు. బీజేపీ+టీడీపీ+జనసేన పొత్తుగా 2024 ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయనున్నాయి. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు చేసే క్రమంలో పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ చర్చకు దారి తీశాయి. 

29
Super Star Krishna

ఓ బహిరంగ సభ్యలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ... ఎన్టీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ఇతర నటులు వేరే పార్టీలలో ఉన్నారు. కృష్ణ కాంగ్రెస్ లో ఉన్నారు. ఎన్టీఆర్ ని కృష్ణ ఎంతగా విమర్శించినా ఆయన ఎలాంటి వేధింపులకు పాల్పడలేదు. ఎన్టీఆర్ అంతటి సంస్కారవంతుడు. సీఎం జగన్ మాత్రం నన్ను వేధింపులకు గురి చేశాడని అన్నారు. 
 

39
Super star krishna

ఈ కామెంట్స్ మహేష్ ఫ్యాన్స్ ని హర్ట్ చేశాయి. తన రాజకీయ ప్రసంగంలోకి చనిపోయిన కృష్ణను లాగాల్సిన అవసరం ఏముంది? ఎన్టీఆర్ కి సంస్కారం ఉందంటే విమర్శించిన కృష్ణకు లేదనా? అని ఓ వర్గం మండిపడుతున్నారు. 

49

అయితే లేని వివాదాన్ని వైసీపీ రాజేస్తోంది. కృష్ణను పవన్ కళ్యాణ్ అవమానించలేదు. కేవలం ఉదహరించారు. పొలిటికల్ గైన్ కోసం వైసీపీ నాయకులు ఈ విషయాన్ని రాద్ధాంతం చేస్తున్నారని పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసేన నాయకులు అంటున్నారు. 

59
Super Star Krishna

ఈ క్రమంలో వైసీపీ, జనసేన నాయకుల మధ్య సోషల్ మీడియా వార్ షురూ అయ్యింది. రెండు వర్గాలు పాత వీడియోలు తెరపైకి తెస్తున్నాయి. ఎన్టీఆర్ తెలుగుదేశం స్థాపించి సీఎం కాగా, కృష్ణ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎన్టీఆర్  విధానాలు నచ్చని కృష్ణ ఆయనకు వ్యతిరేకంగా మండలాధీశుడు, గండిపేట రహస్యం, నా పిలుపే ఓ ప్రభంజనం, సాహసమే నా ఊపిరి వంటి చిత్రాలు తెరకెక్కించాడు. 
 

69
Super Star Krishna

అప్పట్లో ఎన్టీఆర్-కృష్ణ ఫ్యాన్స్ మధ్య గొడవలు చోటు చేసుకున్నాయి. దాడులు కూడా జరిగాయి. ఇదిలా ఉండగా ఎన్టీఆర్ తనని విమర్శించిన వాళ్లపై వేధింపులకు పాల్పడలేదని పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ కి కౌంటర్ గా... అక్కినేని నాగేశ్వరరావు చేసిన ఆరోపణల వీడియో వైరల్ చేస్తున్నారు.

79

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే షోలో పాల్గొన్న ఏఎన్నార్.. ఎన్టీఆర్ సీఎం అయినా నేను కలవలేదు. నాకు కలవాలని అనిపించలేదు. అన్నపూర్ణ స్టూడియో విషయంలో ఇబ్బందులకు గురి చేశాడు. రెండోసారి సీఎం అయ్యాక అందరూ నన్ను ఒకసారి కలవమని అడిగారు. ఎన్టీఆర్ బుద్ధి మంచిది కాదు, నేను కలవనని నేరుగా చెప్పేశాను, అని ఏఎన్నార్ కామెంట్ చేసిన వీడియో పోస్ట్ చేస్తున్నారు .

89
Super Star Krishna

అయితే ఎన్టీఆర్ తో విభేదాలపై కృష్ణ గతంలో స్పందించారు. ఎన్టీఆర్ రెండోసారి సీఎం అయ్యాక ఓ సందర్భంలో ఎదురుపడ్డారు. ఏం బ్రదర్ ఎలా ఉన్నారు?  నా మీద ఇంకా సినిమాలు తీస్తున్నారా? అని అడిగారు. నేను నవ్వుతూ లేదని చెప్పాను. మా మధ్య రాజకీయ పరమైన విబేధాలే కానీ, వ్యక్తిగతమైన వివాదాలు ఏమీ లేవని కృష్ణ అన్నారు. 


 

99

ఇక పవన్ కళ్యాణ్ ఆవేశంలో ఎన్టీఆర్ ని పొగిడే క్రమంలో కృష్ణ పేరు తెరపైకి తేవడం కూడా కరెక్ట్ కాకపోవచ్చు. పవన్ కళ్యాణ్ ఉద్దేశం ఏదైనా కానీ.. వైసీపీ వాళ్లకు ఈ వీడియో ఆయుధంగా మారింది. అయితే ఈ వివాదంలో పవన్ కళ్యాణ్ తప్పు చేశారా? లేదా? అనేది ప్రజలే డిసైడ్ చేయాల్సి ఉంది. 

Read more Photos on
click me!

Recommended Stories