మణికంఠ మరో పల్లవి ప్రశాంత్‌ అయ్యేవాడా? టైటిల్‌ విన్నర్‌ అతనేనా? వామ్మో ఇదేం క్రేజ్‌

First Published | Oct 21, 2024, 5:01 PM IST

మణికంఠ బిగ్‌ బాస్‌ హౌజ్‌ నుంచి స్వచ్ఛందంగా ఎలిమినేట్‌ అయిన విషయం తెలిసిందే. ఆయన్ని మరో పల్లవి ప్రశాంత్‌గా వర్ణిస్తున్నారు అభిమానులు.   
 

బిగ్‌ బాస్‌ తెలుగు 8 షో నుంచి ఈ ఆదివారం నాగ మణికంఠ ఎలిమినేట్‌ అయిన విషయం తెలిసిందే. తనకు తానే స్వయంగా ఎలిమినేట్‌ అవుతానని బిగ్‌ బాస్‌ని, హోస్ట్ నాగార్జునని వేడుకున్నారు. తాను ఫిజికల్‌గా వీక్‌ అయ్యానని చెప్పి ఆయన ఎలిమినేట్‌ అయ్యాడు. తన వల్ల కావడం లేదని, తాను ఆడలేనని చెప్పాడు. తన వల్ల మంచి అర్హత ఉన్న వాళ్లు ఎలిమినేట్‌ అయ్యే ఛాన్స్ ఉంది కదా అని ఆయన ఎలిమినేట్‌ కావాలనుకున్నట్టు తెలిపారు మణికంఠ. 

బిగ్‌ బాస్‌ తెలుగు 8 ఇంట్రెస్టింగ్‌ అప్ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.
 

అయితే తన ఫిజికల్‌ ప్రాబ్లమ్స్ గురించి చెప్పలేదు. బిగ్‌ బాస్‌ హౌజ్‌లో ఆయన అన్ని విధాలుగా బాగానే ఉన్నాడని, ఎలాంటి సమస్యలు లేవని డాక్టర్లు రిపోర్ట్ ఇచ్చారు. కానీ కొన్ని చెప్పుకోలేని సమస్యలు ఉన్నాయని బయటకు వచ్చిన నాగమణికంఠ మీడియాతో మాట్లాడుతూ తెలిపారు.

డాక్టర్‌ని కలిసి ఓ సర్జరీ చేయించుకోవాలని తెలిపారు. మరి అదేంటనేది ఆయన చెప్పలేదు. ఇదిలా ఉంటే బిగ్‌ బాస్‌ నుంచి ఎలిమినేట్‌ అయి బయటకు వచ్చిన నాగమణికంఠకి ఉన్న క్రేజీ మామూలు కాదు. వందల మంది ఫ్యాన్స్ ఆయన్ని కలిసేందుకు వచ్చారు. 
 


మణికంఠతో హగ్‌ కోసం వందల మంది ఫ్యాన్స్ రావడం విశేషం. బిగ్‌ బాస్‌ హౌజ్‌లో మణికంఠ చాలా మందిని హగ్‌ చేసుకున్నాడు. ఎవరినైనా ఓదార్చడానికైనా, సానుభూతి తెలిపే క్రమంలోనూ, తనకు నచ్చిన విషయం చెప్పిన సమయంలోనూ హగ్‌ చేసుకునే వాడు. అయితే ఎక్కువగా అమ్మాయిలనే హగ్‌ చేసుకోవడం విశేషం. దీంతో మణికంఠ హగ్‌లపై ట్రోల్స్ నడించింది. మీమ్స్ కి అంతేలేదు.

ఈ నేపథ్యంలో చాలా మంది ఫ్యాన్స్ మణికంఠని ఇదే డిమాండ్‌ చేయడం విశేషం. అమ్మాయిలనే హగ్‌ చేసుకుంటారా? మమ్మల్ని హగ్‌ చేసుకోరా అంటూ అడగడం విశేషం. అన్నపూర్ణ సెవెన్‌ ఎకర్స్ నుంచి వందల మంది మణికంఠకి స్వాగతం పలుకుతూ, అన్నా మాకు హగ్‌ ఇవ్వాలంటూ సెటైరికల్‌గా చెప్పడం విశేషం. 
 

ఆయన ఇంటి వరకు ఫ్యాన్స్ వచ్చారు. ఆయన్నే ఫాలో అయ్యారు. అభివాదం తెలిపారు. అభినందనలు తెలిపారు. ఆయన ఆట తీరు గురించి మాట్లాడారు. తాను సడెన్‌గా ఎలిమినేట్‌ అయి రావడం పట్ల వాళ్లంతా డిజప్పాయింట్‌ అయ్యారు. తమని మోసం చేశారంటూ వాళ్లు చెప్పడం విశేషం. మణికంఠతో సెల్ఫీలు తీసుకున్నారా? ఆయన ఫ్యామిలీ గురించి ఆరా తీశారు. మొత్తం మణికంఠకి వెన్నంటే ఉన్నారు.

బిగ్‌ బాస్‌ కంటెస్టెంట్‌కి ఈ రేంజ్‌లో ఆదరణ దక్కడం చాలా అరుదు. గత సీజన్‌లో పల్లవి ప్రశాంత్‌కి ఈ రేంజ్‌లో ఆదరణ దక్కింది. ఆయన ఆ స్థాయిలో క్రేజ్, పాపులారిటీని సొంతం చేసుకున్నారు. విన్నర్‌గా నిలిచి కప్‌తో బయటకు వచ్చినప్పుడు వేల మంది అభిమానులు ఆయన కోసం స్వచ్చందంగా రావడం విశేషం. కొన్ని మిస్టేక్స్ ఆయన్ని వివాదాల్లోకి నెట్టాయి, కానీ పల్లవి ప్రశాంత్‌కి వచ్చిన క్రేజ్‌ మామూలు కాదని చెప్పొచ్చు. 
 

అలాంటిది మణికంఠకి ఇంకా దాన్ని మించి క్రేజ్‌ అని చెప్పాలి. ఎందుకంటే మణికంఠ హౌజ్‌లో ఉన్నది ఏడు వారాలే. ఆయన స్వయంగా ఎలిమినేట్‌ అయ్యాడు. అదే ఫైనల్‌ వరకు ఉంటే ఈ క్రేజ్‌ ఇంకా ఏ స్థాయిలో ఉండేదో అర్థం చేసుకోచ్చు. అంతేకాదు ఆయనతో మాట్లాడిన అభిమానులు కూడా మరో పల్లవి ప్రశాంత్‌ అంటూ కొనియాడారు. యూట్యూబ్‌ ఛాన్సెల్స్, సోషల్‌ మీడియా టీమ్‌లు కూడా మరో పల్లవి ప్రశాంత్‌గా వర్ణించారు. ఇలా మధ్యలోనే రావడం తాము బాగా హర్ట్ అయినట్టు తెలిపారు.

ఫైనల్‌ వరకు ఉంటే కప్‌ మీదే అని, మీరు కచ్చితంగా విన్నర్‌ అయ్యేవాళ్లని తెలిపారు. మణికంఠపై అనూహ్యమైన ప్రేమని చూపించారు. ఇది నిజంగానే పల్లవి ప్రశాంత్‌ని తలపిస్తుంది. అయితే ఇతర కంటెస్టెంట్లు సెలబ్రిటీలు అయి ఉంటారు. వాళ్లకు ఎలాగూ ఫాలోయింగ్‌ ఉంటుంది. కొన్ని ప్రమోషనల్‌ టీమ్‌లు పనిచేస్తాయి.

కానీ మణికంఠకి స్వచ్ఛంధంగా ఇంత మంది రావడం, ఇంతటి ప్రేమని చూపించడం నిజంగానే మణికంఠ ఏడు వారాలకే ఎంతో మంది హృదయాలను గెలుచుకున్నాడు. తాను ఎలిమినేట్‌ అయి వస్తే పరిస్థితి వేరేలా ఉండేది, కానీ తానే ఎలిమినేట్‌ కావడమే అతన్ని ప్రత్యేకంగా మార్చేసింది. ఓ రకంగా మణికంఠ నిజంగానే విన్నర్‌ అయ్యాడనేది ఆయన అభిమానులు చెబుతున్న మాట. మరి ఈ క్రేజ్‌ని ఆయన ఎలా వాడుకుంటారు? భవిష్యత్‌లో ఏం చేయనున్నారనేది చూడాలి. 

Read more: రామ్‌ చరణ్‌ హీరోయిన్‌ కూతురికి పేరు పెట్టిన ఎన్టీఆర్‌, డెలివరీ కాకముందే పేరు డిసైడ్‌ చేసిన తారక్‌

Latest Videos

click me!