ఏదైమైనా రవితేజ ఖాతాలో మరో డిజాస్టర్ పడింది. హరీశ్ శంకర్ దర్శకత్వంలో మాస్ మహారాజ రవితేజ హీరోగా నటించిన ‘మిస్టర్ బచ్చన్’ సినిమా విడుదలకు ముందు మంచి బజ్ తెచ్చుకుంది. ప్రమోషన్లతో పాటు హరీశ్ శంకర్ కామెంట్లతో బాగా హైప్ వచ్చేసింది. దానికి తోడు పాటలు ఆకట్టుకోవడం, ట్రైలర్ బాగుండటంతో ఎక్సపెక్టేషన్స్ పెరిగాయి. అయితే, మిస్టర్ బచ్చన్ సినిమా అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఈ బుధవారం (ఆగస్టు 14) సాయంత్రమే ప్రీమియర్ల షోలతో ఈ చిత్రం రాగా.. గురువారం పూర్తిస్థాయిలో రిలీజ్ అయింది. ఈ మూవీకి ప్రీమియర్ల నుంచే నెగెటివ్ టాక్ వచ్చింది. చివరకి వీకెండ్స్ కూడా వర్కవుట్ అయ్యేట్లు కనపడటం లేదు.