హైపర్ ఆది చెంప పగలగొడతానన్న రష్మీ, మరో యాంకర్ కి కూడా వార్నింగ్... ఇంతకీ ఏం జరిగింది?

First Published | Aug 17, 2024, 10:41 AM IST

స్టార్ యాంకర్ రష్మీ గౌతమ్ లేటెస్ట్ కామెంట్స్ సంచలనం రేపుతున్నాయి. ఆమె హైపర్ ఆది చెంపపగలగొడతాని పబ్లిక్ గా చెప్పింది. మరో యాంకర్ కి కూడా వార్నింగ్ ఇచ్చింది. 
 


తెలుగు రాష్ట్రాల్లో రష్మీ గౌతమ్ కి భారీ ఫేమ్ ఉంది. జబర్దస్త్ వేదికగా అమ్మడు క్రేజ్ రాబట్టింది. 2013లో జబర్దస్త్ ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. నాగబాబు, రోజా జడ్జెస్ట్ గా వ్యవహరించారు. అనసూయ యాంకర్ గా ఎంట్రీ ఇచ్చింది. జబర్దస్త్ ఊహకు మించిన సక్సెస్ అందుకుంది. దాంతో ఎక్స్ట్రా జబర్దస్త్ పేరుతో మరొక షో సైతం ప్రారంభించారు. ఎక్స్ట్రా జబర్దస్త్ యాంకర్ గా రష్మీ గౌతమ్ ఛాన్స్ దక్కించుకుంది. 

Rashmi Gautam

జబర్దస్త్ వేదికగా పలువురు సామాన్యులు స్టార్స్ అయ్యారు. వారిలో రష్మీ గౌతమ్ కూడా ఒకరు. జబర్దస్త్ తెచ్చిపెట్టిన ఫేమ్ హీరోయిన్ కావాలన్న రష్మీ గౌతమ్ కల నెరవేర్చింది. జయాపజయాలతో సంబంధం లేకుండా పదికి పైగా చిత్రాల్లో రష్మీ గౌతమ్ హీరోయిన్ గా నటించింది. ప్రారంభంలో ఆమె కేవలం సపోర్టింగ్ రోల్స్ చేసింది. 


రష్మీ గౌతమ్ కి పాపులారిటీ తెచ్చిన అంశాల్లో సుడిగాలి సుధీర్ తో లవ్ ట్రాక్ కూడా ఒకటి. బుల్లితెర లవ్లీ ఫెయిర్ గా సుధీర్-రష్మీ పేరు తెచ్చుకున్నారు. ఒకటి రెండు సందర్భాల్లో వీరికి ఉత్తుత్తి పెళ్లి చేశారు. సాంగ్స్, స్కిట్స్ లో నాన్ స్టాప్ రొమాన్స్ పంచారు. సుధీర్-రష్మీ నిజమైన ప్రేమికులు అని నమ్మేవారు లేకపోలేదు. సుధీర్ తో మీ పెళ్లి ఎప్పుడని రష్మీ గౌతమ్ ని తరచుగా అడుగుతూ ఉంటారు. 

కొన్నాళ్లుగా రష్మీ-సుధీర్ లను బుల్లితెర ఆడియన్స్ మిస్ అవుతున్నారు. సుడిగాలి సుధీర్ జబర్దస్త్, ఢీ, శ్రీదేవి డ్రామా కంపెనీ షోల నుండి తప్పుకున్నాడు. దాంతో సుధీర్-రష్మీ బుల్లితెరపై కనిపించి చాలా కాలం అవుతుంది. వారి ఫ్యాన్స్ ని ఇది నిరాశపరిచి అంశమే. ఆఫ్ స్క్రీన్ లో సుధీర్-రష్మీ తాము మిత్రులం మాత్రమే అంటారు. 

తాజాగా ఓ ఆన్లైన్ ఛాట్ లో పాల్గొన్న రష్మీ గౌతమ్ ఆసక్తికర కామెంట్స్ చేసింది. ఓ అభిమాని... చెంపదెబ్బ, వార్నింగ్, ముద్దు... ఇవ్వాల్సి వస్తే హైపర్ ఆది, సుడిగాలి సుధీర్, యాంకర్ ప్రదీప్ లలో ఎవరికి ఏమిస్తావని అడిగారు. ఈ ప్రశ్నకు సమాధానంగా... హైపర్ ఆదికి చెంప దెబ్బ ఇస్తాను. ఎందుకంటే టీజ్ చేస్తూ ఉంటాడని చెప్పింది. 

rashmi Instagram

ఇక సుడిగాలి సుధీర్ కి వార్నింగ్ ఇస్తుందట. ముద్దు మాత్రం యాంకర్ ప్రదీప్ కి ఇస్తుందట. సుడిగాలి సుధీర్ కి షాక్ ఇస్తూ ప్రదీప్ కి ముద్దు ఇస్తానన్న రష్మీ... సుధీర్ కి మాత్రం వార్నింగ్ ఇస్తానని చెప్పింది. రష్మీ గౌతమ్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. 36 ఏళ్ల రష్మీ గౌతమ్ ఇంకా పెళ్లి చేసుకోలేదు. ఎప్పుడు వివాహం చేసుకుంటారని అడిగితే దానికి ఇంకా సమయం ఉందని అంటుంది. ప్రస్తుతం జబర్దస్త్ తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ షోలలో రష్మీ గౌతమ్ యాంకర్ గా కొనసాగుతుంది. ఎక్స్ట్రా జబర్దస్త్ రద్దు చేసిన మేకర్స్... వారంలో రెండు ఎపిసోడ్స్ జబర్దస్త్ పేరిట ప్రసారం చేస్తున్నారు. అనసూయ తర్వాత యాంకర్స్ గా వచ్చిన సౌమ్యరావు, సిరి హన్మంత్ లను తప్పించారు. రష్మీ ఒక్కరే జబర్దస్త్ యాంకర్ గా కొనసాగుతుంది. 

Latest Videos

click me!