నాని-సుజీత్ సినిమా , తెర వెనక ఏం జరుగుతోంది? ఇంట్రస్టింగ్ మేటర్

సాహో ఫేమ్ డైరెక్టర్ సుజీత్‍తో నాని ఓ మూవీ చేయాల్సి ఉంది. అయితే, నాని - సుజీత్ (Nani 32) సినిమా ప్రారంభం కాకముందే సందిగ్ధంలో పడింది.

Sailesh Kolanu to direct film actor Nani

నేచురల్ స్టార్ నాని వరుస సినిమాలతో బిజీబిజీగా ఉన్న సంగతి తెలసిందే. తాజాగా ఆయన నటించిన సరిపోదా శనివారం రిలీజ్ అయ్యింది. అలాగే  ఆయన చేయాల్సిన లైనప్ కూడా భారీగానే ఉంది. గతేడాది హాయ్ నాన్న సినిమాతో నాని సూపర్ హిట్ కొట్టారు. ఇప్పుడు సరిపోదా శనివారం సినిమా కూడా మంచి టాక్ తెచ్చుకుంది. ఇలా డిఫరెంట్ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఈ క్రమంలో , సాహో ఫేమ్ డైరెక్టర్ సుజీత్‍తో నాని ఓ మూవీ చేయాల్సి ఉంది. అయితే, నాని - సుజీత్ (Nani 32) సినిమా ప్రారంభం కాకముందే సందిగ్ధంలో పడింది.

Nani

 వాస్తవానికి నానితో సుజీత్ చాలా కాలంగా జర్నీ చేస్తున్నారు. నానితో  భారీ రేంజ్‍లో యాక్షన్ మూవీ చేయాలని దర్శకుడు సుజీత్ కథను  రెడీ చేసుకున్నారు. కథ, స్క్రీన్ ప్లే, స్క్రిప్ట్ నచ్చటంతో నాని కూడా ఓకే చెప్పారు. డీవీవీ ఎంటర్‌టైన్‍మెంట్స్ బ్యానర్‌ కింద ఈ డీవీవీ దానయ్య ఈ మూవీని నిర్మించేందుకు రెడీ అవుతున్నారు. అయితే, బడ్జెట్ అంచనాలు భారీగా పెరగడడంతో ఈ సినిమా మొదట్లోనే డైలమోలో పడిందని తెలుస్తోంది.


Nani starrer film update out

సుజీత్‌ ఈ సినిమాను గ్యాంగ్‌స్టర్‌ మాఫియా కథాంశంతో తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. అయితే సినిమా బడ్జెట్‌ దాదాపు ఎనభై కోట్లు దాటుతుందని  అంటున్నారు. అంత బడ్జెట్ తనకు వర్కౌట్ అవ్వదని సదరు నిర్మాత హోల్డ్ లో పెట్టారని తెలుస్తోంది. దీంతో సినిమా ఆగిపోయిందని వార్తలు వచ్చాయి.

ప్రస్తుతం మార్కెట్ డల్ గా ఉండటం, హిందీ డబ్బింగ్, ఓటిటి రైట్స్  రేట్లు పడిపోవటం, ఆడియన్స్ థియేటర్ కు రావటం తగ్గిపోవటం వలన పెట్టుబడి రికవరీ కష్టం  అవుతోంది. అయితే యాక్షన్ సినిమా కాబట్టి వర్కవుట్ అయ్యే అవకాసం ఉందని ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారట. సరిపోదా శనివారం బిజినెస్, థియేటర్ రెవిన్యూ, నాన్ థియేటర్ రెవిన్యూ చూసి ఓ నిర్ణయానికి వద్దామని నిర్మాత అన్నట్లు చెప్పుకుంటున్నారు.  దాంతో  వేరే ప్రొడక్షన్ హౌస్ కు ఈ ప్రాజెక్టు ని షిప్ట్ చేసే పనిలో ఉన్నారట.

actor Nani

నానికి ఈ కథ బాగా నచ్చిందని,   ఈ సినిమాని ఎలాగైనా తీయాలనే ఉద్దేశంతో సుజీత్,నాని ఉన్నట్లు తెలుస్తుంది దీంతో మరో రెండు ప్రముఖ బ్యానర్స్ అయిన సితార ఎంటర్టైన్‌మెంట్‌, నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్‌తో చర్చలు జరుగుతున్నట్టు సమాచారం. ఈ రెండు బ్యానర్స్ తో నాని గతంలో సినిమాలు చేయడంతో ఈ సినిమాపై వారు చర్చిస్తున్నట్లు సమాచారం. 

Actor Nani

 ఇలా బడ్జెట్ అంచనాలు భారీగా ఉండటంతో నాని - సుజీత్ సినిమా ఆరంభంలోనే డైలమోలో పడిపోయింది. అయితే, బడ్జెట్ విషయంపై డైరెక్టర్, మేకర్స్ మధ్య మరిన్ని చర్చలు జరిగే అవకాశం ఉందని అంటున్నారు .

వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నాని చేస్తున్న ‘సరిపోదా శనివారం’ సినిమా నిన్న గురువారం రిలీజ్ అయ్యింది. ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ  కలెక్షన్స్ పైనే ఇప్పుడు నిర్మాతల దృష్టి ఉంది. అయితే, ఈ మూవీని నిర్మించింది నిర్మాత డీవీవీ దానయ్యే. ‘అంటే సుందరానికి’ తర్వాత నాని - వివేక్ కాంబో రిపీట్ అవుతుండటంతో ఈ మూవీకి మంచి క్రేజ్ ఉంది. అలాగే సరిపోదా శనివారం కూడా పాన్ ఇండియా రేంజ్‍లో రిలీజ్ చేసారు.  సరిపోదా శనివారం మంచి కలెక్షన్లు రాబట్టుకుంటే.. నాని - సుజీత్ మూవీకి బడ్జెట్ ఆటంకాలు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి.

ఇక వీటితో పాటు సరిపోదా శనివారం తర్వాత నాని చేతిలో వరుస సినిమాలు ఉన్నాయి. తనకు దసరా లాంటి బ్లాక్‍బస్టర్ ఇచ్చిన శ్రీకాంత్ ఓదెలతో మరో సినిమా (Nani 33)కు నాని ఓకే చెప్పారు. ఈ మూవీపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇప్పటికే వచ్చింది. బలగం ఫేమ్ వేణు ఎల్డండితో ఎల్లమ్మ సినిమా కూడా నాని చేయనున్నారు. ఒకవేళ సుజీత్‍తో సినిమాకు బడ్జెట్ చర్చలు సఫలమైతే ముందుగా ఆ దాన్నే పూర్తి చేసే అవకాశం ఉంటుంది.
 

Latest Videos

click me!