దీపికా పదుకొణె-రణ్ వీర్ సింగ్ ల‌లో ఎవ‌రు బాగా రిచ్.. ? వారి ఆస్తులు ఎన్ని?

First Published | Aug 30, 2024, 10:24 AM IST

Deepika Padukone or Ranveer Singh :సెప్టెంబర్‌లో తమ తొలి బిడ్డకు దీపికా పదుకొణె-రణ్ వీర్ సింగ్ లు స్వాగతం పలకనున్నారు. దానికి ముందు వారు తమ రూ. 100 కోట్ల విలువైన కొత్త ఇంట్లో ప్రవేశం చేయనున్నారు.

భారత సినీ పరిశ్రమలో తమదైన నటతో స్టార్ నటులుగా ఎదిగారు దీపికా పదుకుణె-రణ్‌వీర్ సింగ్. వీరిద్దరూ మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. సినిమా పరిశ్రమలో ఈ జంట తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. ఇప్పటికీ బాలీవుడ్ లో భారీ రెమ్యూనరేషన్ తీసుకునే టాప్ స్టార్లలో వీరిద్దరూ ఉంటారు. వీరిద్దరివి కలిపి నికర విలువ రూ. 744 కోట్లు. అయితే, వీరిలో ఎవరు బాగా రిచ్? 

రణ్‌వీర్ సింగ్ ప్రస్తుతం తన కెరీర్‌లో టాప్ స్టార్ గా వెలుగొందుతున్నాడు. భారీ రెమ్యూనరేషన్ తో పాటు ప్రకటనల ద్వారా భారీగా సంపాదిస్తున్నాడు. అతని నికర విలువ క్రమంగా పెరుగుతూనే ఉంది. ప్రస్తుతం  సినిమాలు, ఎండార్స్‌మెంట్‌ల నుండి రణ్ వీర్ సింగ్  దాదాపు రూ. 245 కోట్లు సంపాదిస్తున్నాడు. 


దీపికా పదుకొణె నికర విలువ రూ. 500 కోట్లు. నటి ప్రతి సినిమా పాత్రకు రూ. 30 కోట్లు తీసుకుంటుంది. ఆమె నెలవారీ జీతం రూ. 3 కోట్లుకు పైనే. వార్షిక ఆదాయం దాదాపు రూ. 40 కోట్లు. ఇటీవల దీపిక పదుకుణె పఠాన్, జవాన్, ఫైటర్, కల్కి 2898 AD వంటి అనేక భారీ బడ్జెట్ సూపర్ హిట్ చిత్రాలలో నటించారు. దీపావళి సందర్భంగా విడుదల కానున్న సింగం ఎగైన్‌లో మరోసారి ఆమె కనిపించనుంది.

ముంబైలో రణ్‌వీర్ ఒక విలాసవంతమైన ఇంటిని కొనుగోలు చేశాడు. ముంబై నగరంలోని అత్యంత ఉన్నత స్థాయి ప్రాంతాలలో ఒకటైన ఇంటి కోసం రూ. 119 కోట్లు ఖర్చు చేశారు. దీపికా పదుకొణె-రణ్‌వీర్ సింగ్ బాంద్రాలోని కొత్త లగ్జరీ అపార్ట్‌మెంట్‌కి మకాం మార్చడానికి సిద్ధంగా ఉన్నారు. ఇది షారూఖ్ ఖాన్ నివాసం మన్నత్‌కు ఆనుకుని ఉంది. భవనం పూర్తయ్యే దశకు చేరుకుంటోందని కొత్తగా ఒక వీడియో వైరల్ అవుతోంది. సెప్టెంబరులో తమ మొదటి బిడ్డ కోసం ఎదురుచూస్తున్న దీపిక-రణవీర్.. త‌మ బిడ్డ‌తో కొత్త ఇంటిలోకి ప్ర‌వేశించ‌నున్నార‌ని స‌మాచారం. 

Latest Videos

click me!