గతంలో హోస్టింగ్ అంటే సాధారణ యాంకర్లే ఉండేవారు. కాని ఆతరువాత కాలంలో సినిమా స్టార్స్ బుల్లితెరలపై మెరవడం మొదలు పెట్టారు. మొదట బాలీవుడ్ కే పరిమితం అయిన ఈ ఆచారం.. ఆతరువాత టాలీవుడ్ లో కూడా స్టార్ట్ అయ్యింది. ఎన్టీర్ బిగ్ బాస్, మీలో ఎవరు కోటీశ్వరులు, నాగార్జున మీలో ఎవరు కోటీశ్వరులు, బిగ్ బాస్, చింరంజీవి, రానా, సమంత, బాలయ్య అన్ స్టాపబుల్.. ఇలా సూపర్ స్టార్లు.. సూపర్ హిట్ షోలను హోస్ట్ చేస్తూ వచ్చాయి. ఆ ప్రోగ్రామ్స్ కూడా సూపర్ సక్సెస్ తో సూపర్ రేటింగ్స్ ను సాధించాయి.