పొలిటికల్ గేమ్‌లో అల్లు అర్జున్‌ బలిపశువా? వాటిని డైవర్ట్ చేయడం కోసమే రేవంత్‌ రెడ్డి గేమ్‌ ? తెరవెనుక నిజాలు

First Published | Dec 26, 2024, 12:53 PM IST

అల్లు అర్జున్‌ వివాదంలో కొత్త కోణాలు బయటకు వస్తున్నాయి. పొలిటికల్‌ గేమ్‌లో ఆయన్ని, సంధ్య థియేటర్‌ ఘటనని వాడుకోబోతున్నారని, బన్నీ బలిపశువుగా మారబోతున్నట్టు తెలుస్తుంది. 
 

తెలంగాణ రాష్ట్రంలో, అటు టాలీవుడ్‌లో ఇప్పుడు పెద్ద హాట్‌ టాపిక్‌ అల్లు అర్జున్‌ వివాదం. సంధ్య థియేటర్‌ వద్ద తొక్కిసలాట ఘటన అల్లు అర్జున్‌ వర్సెస్‌ సీఎం రేవంత్‌ రెడ్డి అనేలా మారింది. ఇది కాస్త ముందుకెళ్లి టాలీవుడ్‌ చిత్ర పరిశ్రమ వర్సెస్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వంలా మారుతున్నట్టుగా అనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు సీఎంతో ఇండస్ట్రీ భేటి ఉత్కంఠకు దారితీస్తుంది. ఇందులో ఏఏ అంశాలు చర్చకు రాబోతున్నాయనేది ఆసక్తికరంగా మారింది. 
 

ఇదిలా ఉంటే అల్లు అర్జున్‌ ని ఈ కేసులో టార్గెట్‌ చేయడం, సంధ్య థియేటర్‌ ఘటనని ఇంత సీరియస్‌ గా తీసుకోవడానికి కారణమేంటనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. దీని వెనుక అసలు నిజాలు, ప్రభుత్వం అసలు గేమ్‌, సీఎం రేవంత్‌ రెడ్డి అసలు ఉద్దేశ్యం వేరే ఉందనే చర్చ మొదలైంది. ఇదొక పొలిటికల్‌ గేమ్‌ గా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ గేమ్‌లో అల్లు అర్జున్‌ ఒక బలిపశువు అని, ఆయన్ని ఓ కీలుబొమ్మగా వాడుకోబోతున్నారనే వాదన తెరపైకి వస్తుంది. ఈ క్రమంలో అనేక షాకింగ్‌ విషయాలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ వ్యతిరేకతని డైవర్ట్ చేసే ప్లాన్‌ కూడా ఉందని తెలుస్తుంది. 


ప్రస్తుతం రాష్ట్రంలో పలు మేజర్‌ సమస్యలున్నాయి. లగచర్ల ఘటన, ఫుడ్‌ పాయిజన్‌తో గురుకుల విద్యార్థుల మరణాలు మేజర్‌గా నడుస్తున్నాయి. ఈ విషయంలో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వినిపిస్తుంది. ముఖ్యంగా గురుకులాల్లో కలుషిత ఆహారం తిని 50 మందికి పైగా విద్యార్థులు చనిపోయారు. ఈ ఘటనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.

దీనిపై విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతుంది. ఓ వైపు ఈ ఇష్యూని డైవర్ట్ చేసే ప్రక్రియ ప్రభుత్వం నుంచి జరుగుతుంది. అందుకు అల్లు అర్జున్‌ని, సంధ్య థియేటర్‌ ఘటనని వాడుకుంటున్నారని తెలుస్తుంది. డైవర్ట్ పాలిటిక్స్ లో భాగంగా ఇదంతా చేస్తున్నారని సమాచారం. 

మరోవైపు ఆ మధ్య వికారాబాద్‌ జిల్లా లగచర్లలో ఫార్మా కంపెనీల కోసం ల్యాండ్‌ సేకరణ చేపట్టింది ప్రభుత్వం. దీన్ని రైతులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో అధికారులపై రైతులు దాడి చేశారు. అయితే ఇదంతా కుట్రపూరితంగా జరిగిందని, బీఆర్‌ఎస్‌ నాయకులు ఉన్నారని అంటున్నారు. ఈ ఘటనలో 19 మంది రైతులను అరెస్ట్ చేశారు.

మాజీఎమ్మెల్యే పట్నం నరేందర్‌ రెడ్డి కూడా అరెస్ట్ అయ్యారు. ప్రస్తుతం వాళ్లు జైల్లో ఉన్నారు. అయితే రైతులకు బేడీలు, గొలుసులు వేసి తీసుకెళ్లడం పెద్ద వివాదంగా మారింది. కొందరు రైతులు దీనిపై హ్యూమన్‌రైట్స్ కమీషన్‌కి ఫిర్యాదు చేశారు. ఇందులో అమాయకమైన రైతులను బలి చేస్తున్నారి ఫిర్యాదు చేయగా, ఈ ఘటనలు అసలు కుట్రదారులు ఎవరు తేల్చేపనిలో ఉన్నారు హ్యూమన్‌ రైట్స్ అధికారులు.

ఓ వైపు ఈ విచారణ జరుగుతుంది. ఇది క్రమంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారింది. దీంతో ఈ ఇష్యూని కూడా డైవర్ట్ చేసే ప్రయత్నం జరుగుతుందని తెలుస్తుంది. అందుకు బన్నీ వివాదాన్ని వాడుకుంటున్నారనేది రాజకీయంగా జరుగుతున్న చర్చ. 
 

అలాగే హైదరాబాద్‌ నగర ప్రజలను షేక్‌ చేసిన `హైడ్రా` పై వ్యతిరేకత వచ్చింది. అక్రమ కట్టడాల పేరుతో అమాయకుల ఇళ్లని కూల్చిన ఘటనలు ఉన్నాయి. ఇది ప్రభుత్వంపై వ్యతిరేకతని పెంచింది. దీన్ని ప్రతిపక్షాలు క్యాష్‌ చేసుకుంటున్నాయి. వీటిని కూడా డైవర్ట్ చేసే ప్రక్రియ జరుగుతుంది. మరోవైపు మేజర్‌గా రైతులకు రుణమాఫీ పెద్ద సమస్యగా మారింది. రెండు లక్షల రుణమాఫీ పూర్తి స్తాయిలో జరగలేదు.

చాలా మందికి మాఫీ కాలేదు. రైతు బంధు ప్రస్తావనే లేదు. ఇది కూడా ప్రభుత్వంపై రైతుల నుంచి వ్యతిరేకత వినిపిస్తుంది. ప్రధానంగా ఇవి ప్రభుత్వాన్ని, రేవంత్‌ రెడ్డి సర్కార్‌ని ఇరకాటంలో పెట్టాయి. వీటి నుంచి డైవర్ట్ చేసే ప్రక్రియలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం అల్లు అర్జున్‌ని, సంధ్య థియేటర్‌ ఘటనని వాడుకుంటున్నట్టు తెలుస్తుంది. 
 

ఇక అల్లు అర్జున్‌.. `పుష్ప 2` సక్సెస్‌ మీట్‌లో సీఎం రేవంత్‌ రెడ్డి పేరు మర్చిపోయారు. ఇది బాగా ట్రోల్‌ అయ్యింది. దీన్ని బీఆర్‌ఎస్‌ నాయకుడు కేటీఆర్‌ క్యాష్‌ చేసుకుని పదే పదే ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ, జనాలకు మీ పేరు కూడా గుర్తు లేదు, సీఎంగానే చూడటం లేదంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. పేరు మర్చిపోతే అరెస్ట్ చేస్తారా? అని రెచ్చగొట్టాడు. ఇది సీఎంకి బాగా కోపం తెప్పించింది. 
 

మరోవైపు తెలంగాణ సినిమా అవార్డులు, సమస్యలు, పరిష్కారానికి సంబంధించి సీఎం రేవంత్‌ రెడ్డి ఆ మధ్య సినిమా పెద్దలను ఆలోచన చేయాలని, మంచి ఆలోచనలతో ప్రభుత్వం ముందుకు రావాలని, చర్చిద్దామని తెలిపారు. తెలంగాణలో నంది అవార్డుల స్థానంలో గద్దర్‌ పేరుతో అవార్డులు పెట్టాలని సీఎం సూచించారు.

దీనిపై నిర్ణయాన్ని కూడా తెలిపాలని చెప్పగా, ఇండస్ట్రీ నుంచి స్పందన లేదు. ఇది కూడా ఇండస్ట్రీని టార్గెట్‌ చేయడానికి కారణమయ్యిందని, అందుకు అల్లు అర్జున్‌ దొరికాడని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సంధ్య థియేటర్‌ వద్ద తొక్కిసలాట ఘటన బలంగా వాడుకుంటున్నారని తెలుస్తుంది. మరి ఇది మున్ముందు ఎటు వైపు వెళ్తుందో చూడాలి. 
read more: సీఎం రేవంత్ రెడ్డి వర్సెస్ టాలీవుడ్, భేటీలో మేటర్ తేలేనా?

also read: రేవంత్ రెడ్డితో మీటింగ్ :దిల్ రాజు ఆహ్వానించినా హాజరుకాని చిరంజీవి, ఎందుకంటే.. షాకింగ్ ట్విస్ట్

Latest Videos

click me!