జబ్బలు జాకెట్ లో సూపర్ హాట్ గా ఢీ పూర్ణ... కట్టింది శారీ అయితేనేమీ ఆ సిట్టింగ్ యాంగిల్ చూస్తే మైండ్ బ్లాకే!

First Published | Oct 18, 2021, 4:54 PM IST

హీరోయిన్ గా కంటే కూడా ఢీ షో జడ్జి గానే పాప్యులర్ అయ్యారు నటి పూర్ణ. తెలుగు సక్సెస్ ఫుల్ రియాలిటీ షోలలో ఒకటైన Dhee show ఆమెకు మరింత క్రేజ్ తెచ్చిపెట్టింది. 

దానికి కారణం ఓ ప్రక్క జడ్జి బాధ్యతలు నిర్వర్తిస్తూనే పూర్ణ.. గ్లామర్, రొమాన్స్ యాంగిల్ కూడా చూపిస్తారు. కంటెస్టెంట్స్, మేల్ యాంకర్స్ తో ఆమె చేసే రొమాన్స్ షోలో హైలెట్ గా నిలుస్తూ ఉంటాయి. ఆ మధ్య అదిరిపోయే పెర్ఫార్మన్స్ ఇచ్చాడని... ఏకంగా కంటెస్టెంట్స్ బుగ్గ కోరికేసింది Poorna.

ఇలాంటి సాహసాలు, బోల్డ్ అట్టెంప్ట్స్ చేయాలంటే కొంచెం గట్స్ ఉండాలి. పూర్ణ ఈ విషయంలో ఓ అడుగు ముందే ఉన్నారు. అందుకే గత కొన్ని సీజన్స్ నుండి ఆమెను వదలకుండా కొనసాగిస్తున్నారు ఢీ నిర్వాహకులు. 


మరోవైపు సోషల్ మీడియా వేదికగా తన గ్లామర్ పవర్ చూపిస్తూ... ఫ్యాన్ బేస్ మరింతగా పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. తరచుగా ఈ హాట్ బాంబ్ పంచుకునే ఫోటోలు, చేసే ఫోటో షూట్స్ పిచ్చ వైరల్ అవుతూ ఉంటాయి. 

తాజాగా స్లీవ్ లెస్ జాకెట్.. మల్టీ కలర్ డిజైనర్ శారీలో అద్భుతంగా మెరిసింది అమ్మడు. ధరించింది శారీ అయినప్పటికీ అమ్మడు ఇచ్చిన పోజులు మాత్రం సూపర్ హాట్ గా ఉన్నాయి. దానికి తోడు కసిగా ఉన్న కిల్లింగ్ లుక్స్ ఆమె అందాన్ని మరింత పెంచేశాయి. దీనితో ఫ్యాన్స్ హాట్ హాట్ కామెంట్స్ చేస్తున్నారు. 

ఇక పూర్ణ వెండితెర కెరీర్ విషయానికి వస్తే...  ఆమె ఇమేజ్ కి తగ్గ ఆఫర్స్ తో బిజీగా గడుపుతున్నారు. పూర్ణ స్టార్ హీరోయిన్ అయ్యే అవకాశాలు దాదాపు కనుమరుగు అయ్యాయి. అందుకే ఆమె తెలివిగా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. ఆమె లేటెస్ట్ సినిమాల ఎంపిక చూస్తే ఈ విషయం స్పష్టంగా అర్థం అవుతుంది. మలయాళ హిట్ మూవీ దృశ్యం 2 తెలుగు రీమేక్ లో పూర్ణ కీలక రోల్ చేస్తున్నారు. ఆమె లేడీ పోలీస్ అధికారిగా కనిపించనున్నారని సమాచారం.

అలాగే Balakrishna-బోయపాటి శ్రీను కాంబినేషన్ వస్తున్న హ్యాట్రిక్ చిత్రం అఖండ లో పూర్ణ అవకాశం దక్కించుకోవడం పెద్ద విశేషమే అని చెప్పాలి.  ప్రగ్యా జైస్వాల్ ప్రధాన హీరోయిన్ గా నటిస్తున్న Akhanda మూవీలో పూర్ణ రోల్ ఏమిటనేది తెలియాల్సి ఉంది. 

మరోవైపు వెబ్ సిరీస్ లు, లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు చేస్తున్నారు. ఆమె ప్రధాన పాత్రలో సుందరి చిత్రం తెరకెక్కింది. తమిళంలో పిశాచి 2లో పూర్ణ నటిస్తున్నారు. డిజిటల్ రంగం అత్యంత వేగంగా మార్కెట్ విస్తరించుకుంటూ పోతుండగా, అక్కడ మంచి అవకాశాలు పూర్ణ ఖాతాలో వచ్చి చేరుతున్నాయి. 

కన్నమూచి అనే సిరీస్ తో పాటు నవరస తమిళ్ వెబ్ సిరీస్ లలో పూర్ణ నటించారు. నవరస ఆంథాలజీ సిరీస్ లో సూర్య, ప్రకాష్ రాజ్, రేవతి, యోగిబాబు, సిద్దార్థ్, విజయ్ సేతుపతి వంటి స్టార్స్ నటించిన విషయం తెలిసిందే.

Also read లంగా ఓణీలో నడుమందాలు చూపిస్తూ ఊరిస్తున్న ఈషారెబ్బా.. కిల్లింగ్‌ లేడీ అంటూ నెటిజన్ల కామెంట్‌

Also read థైస్ అందాలతో రెచ్చగొడుతూ గుడ్ న్యూస్ చెప్పిన ప్రగ్యా జైస్వాల్.. హాట్ ఫోటోస్ వైరల్

Latest Videos

click me!