సినిమాకి అయిన బడ్జెట్ రూ.40కోట్లు, థియేట్రికల్ బిజినెస్ రూ.21కోట్లుగా లెక్క కట్టారు. ఇప్పటికే ఇది సుమారు రూ.65కోట్లపైగా షేర్‌ని సాధించింది. అంటే రూ.45కోట్లకుపైగా లాభాలు వచ్చాయి. ఓవరాల్‌గా ఇది వంద కోట్ల షేర్ దిశగా వెళ్తుంది. మైత్రీ మూవీస్‌కి చాలా రోజులుగా హిట్ లేదు. ఇప్పుడు `ఇరుముడి` మూవీ వారిని సేవ్ చేసిందని, గట్టెక్కిందని చెప్పొచ్చు. మళ్లీ వారిని పుంజుకునేలా చేసింది. అంతేకాదు ఈ సినిమా రవితేజ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలవబోతుందని చెప్పొచ్చు. ఈ సినిమాకి శివ నిర్వాణ దర్శకత్వం వహించగా, ప్రియా భవానీ శంకర్ హీరోయిన్‌గా చేసింది. సాయికుమార్, బేబీ నక్షత్ర, అజయ్ ఘోష్, రమేష్ ఇందిరా, స్వసిక విజయ్, లక్ష్మణ్ కీలక పాత్రలు పోషించారు.