Published : Mar 06, 2021, 10:51 AM ISTUpdated : Mar 06, 2021, 10:55 AM IST
సాయిపల్లవి.. ఇప్పుడు డాన్స్ సునామీలా కనిపిస్తుంది. వరుసగా ఆమె నటించిన పాటలు సంచలనం సృష్టిస్తున్నాయి. `ఫిదా` సాంగ్స్, `రౌడీ బేబీ`, `కోలు కోలు.. `, `సారంగ దరియా` యూట్యూబ్‌లో, సోషల్ మీడియాలో దుమ్మురేపుతున్నాయి. మరి ఇంతగా పాపులర్ అయిన సాయిపల్లవి గురించి ఈ విషయాలు మీకు తెలుసా? చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు వైరల్ అవుతున్నాయి.
తమిళనాడుకి చెందిన సాయిపల్లవి మలయాళ సినిమా `ప్రేమమ్`తో పాపులర్ అయిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆమె నటించిన `సారంగ దరియా`,`కోలు కోలు కోలమ్మ.. `పాటలు తెలుగులో దుమ్మురేపుతున్నాయి.

215
దీంతో ఈ సందర్భంగా సాయిపల్లవి పర్సనల్ లైఫ్ సెర్చ్ చేయగా, అనేక కొత్త విషయాలు, ఇంట్రెస్టింగ్ విషయాలు బయటకొచ్చాయి. ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. అవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

315
సాయిపల్లవి చిన్నప్పటి నుంచి చాలా చురుకైన అమ్మాయి. ఆమెకి డాన్స్ అంటే ఇష్టం. ప్రాణం. ఆమె డాన్స్ లకు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులున్నారు. అయితే మొదట ఆమె తెలుగులో ఈటీవీలో వచ్చే `ఢీ` షోలో పాల్గొనేందుకు ప్రయత్నించారట. కానీ పేరెంట్స్ ఒప్పుకోలేదని, స్టడీ దెబ్బతింటుందని నో చెప్పారట.

415
కానీ ఆ తర్వాత `ఢీ` జోడి ఆడిషన్స్ కి వెళ్లినప్పుడు తన డాన్స్ చూసి అందరు ఫిదా అయ్యారు. అలా ఎంపికైన సాయిపల్లవి `ఢీ` నాల్గో సీజన్‌లో దుమ్మురేపారు. అప్పటి నుంచి డాన్సుల్లో తన ప్రత్యేకత చాటుకున్నారు.

515
నిజానికి సాయిపల్లవి డ్యాన్స్ లో ఎక్కడా ట్రైనింగ్ తీసుకోలేదట. చిన్నప్పుడు మాధురి దీక్షిత్, ఐశ్వర్య రాయ్ డ్యాన్స్ వీడియోలను చూస్తూ నేర్చుకుందట. ఇప్పుడామె డాన్స్ లకు ఎంత క్రేజ్ ఉందో తెలిసిందే.

615
సాయిపల్లవికి డాక్టర్ కావాలని ఉంది. అందుకే ఆమె కార్డియాలజిస్ట్ గా పట్టా పొందారు. జార్జియాలోని టీబీలీసీ నుంచి ఆమె మెడిసిన్ పూర్తి చేశారు. ఓ వైపు నటిగా, మరోవైపు డాక్టర్‌గా కొనసాగుతానని సాయిపల్లవి గతంలో చెప్పిన విషయం తెలిసిందే.

715
ఈ `ఫిదా` బ్యూటీకి చాలా బిడియం ఉంటుందట. కెమెరా ముందు నటించాలంటే మొదట్లో చాలా భయపడేదట. క్రమంగా దాన్నుంచి బయటపడింది. ఇప్పుడు చాలా సన్నివేశాలను ఒకే టేక్‌లో ఓకే చేయించుకుంటున్నారని టాక్.

815
సాయిపల్లవి మొట్ట మొదటి సారిగా బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ తమిళంలో నటించిన `ధామ్ ధూమ్` సినిమాలో ఆమె స్నేహితురాలిగా నటించింది. కానీ ఆ విషయం బయటకు రాలేదు. దీంతోపాటు `కస్తూరిమాన్` అనే చిత్రంలోనూ గుర్తింపు లేని పాత్ర చేసింది.

915
మలయాళంలో నటించిన `ప్రేమమ్` చిత్రంతో పాపులర్ అయ్యింది సాయిపల్లవి. ఇందులో కాలేజ్ దశలో టీచర్‌గా ఆడియెన్స్ ని ఫిదా చేసింది. మలయాళంలోనే కాదు సౌత్‌లోనూ పాపులర్ అయ్యింది. అయితే `ప్రేమమ్` సినిమా కోసం ఆల్ఫోన్స్ ఆమెను సంప్రదించినప్పుడు... ఆమె తీవ్ర ఒత్తిడికి గురైందట.

1015
ఓ ఇంటర్వ్యూలో సాయిపల్లవి తన చర్మం గురించి చెప్పుకోచ్చింది. మొదట్లో పింపుల్స్ వల్ల చాలా ఇబ్బందులు పడ్డానని.. తీవ్ర ఒత్తిడికి గురయ్యానని చెప్పుకోచ్చింది. అయితే ఇప్పుడు సాయిపల్లవి ముఖంపై ఉన్న పింపుల్సే చాలా వరకు స్పెషల్ ఎట్రాక్షన్ అవుతున్నాయి.

1115
`మలారే` అనే సాయిపల్లవి నటించిన సాంగ్ అప్పట్లో చాలా పాపులర్ అయ్యింది. ఆ హిట్ సాంగ్ తనపై చిత్రీకరించబడిందని మొదట్లో తనకు కూడా తెలియదట. విషయం తెలిశాక ఎగిరి గంతేసిందట.

1215
సాయిపల్లవి తమిళనాడులోని ఊటీకి సమీపంలో ఉన్న కోత్తగిరి అనే చిన్న గ్రామంలొ జన్మించింది. సెంతామరై కన్నన్, రాధామణి తల్లిదండ్రులు. నటి పూజాకి సాయిపల్లవి చెల్లెలు అవుతుంది.

1315
తెలుగులో `ఫిదా` చిత్రంతో టాలీవుడ్ మొత్తాన్ని ఫిదా చేసిన ఈ బ్యూటీ `ఎంసీఏ`లోనూ అదరగొట్టింది. ఇప్పుడు `విరాటపర్వం`, `లవ్‌స్టోరి`, `శ్యామ్‌సింగరాయ్` చిత్రాల్లో నటిస్తుంది. `విరాటపర్వం`లో ఆమె నక్సల్ సానుభూతి పరురాలుగా, కామ్రేడ్ రవన్న పాత్రలో నటిస్తున్న రానాకి లవ్ ఇంట్రెస్ట్ గా నటిస్తుంది. ఈ చిత్రంలోని `కోలు కోలు కోలమ్మ.. `అంటూ సాగే జానపద గేయ పాట ఇటీవల విడుదలై వైరల్ అవుతుంది.

1415
దీంతోపాటు `లవ్‌స్టోరి` చిత్రంలో ఆమె నటించిన `సారంగదరియా` పాట తాజాగా విడుదలై దుమ్మురేపుతుంది. ఇది కూడా జానపద గేయం నుంచి తీసుకున్న పాట కావడం విశేషం. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో, యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతుంది.