విజయ్ దేవరకొండ VD 12 నుంచి ఎక్సైటింగ్ అప్డేట్, మామూలుగా లేదు

First Published | Oct 21, 2024, 5:23 PM IST

విజయ్ దేవరకొండ మరియు గౌతమ్ తిన్ననూరి కలయికలో వస్తున్న VD12 సినిమా గురించి ఆసక్తికర విశేషాలు వెల్లడయ్యాయి. కేరళలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలోని యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను థ్రిల్ చేస్తాయని చిత్ర బృందం తెలిపింది.

Vijay Devarakonda, VD 12, gowtham tinnanuri

రౌడీ   విజయ్ దేవరకొండ (Vijay devarakonda)ప్లాఫ్ లకు సంభందం లేకుండా కెరీర్ లో దూసుకుపోతున్నారు. , తన నటనతో స్టార్‌గా ఎదగడమే కాకుండా, దేశవ్యాప్తంగా అన్ని భాషల ప్రేక్షకులకు చేరువ అవుతున్నాకు. విజయ్ దేవరకొండ (Vijay devarakonda) సినిమా వస్తుందంటే అభిమానుల్లోనే కాకుండా సిని ప్రేమికుల్లోనూ ఓ రేంజి బజ్ క్రియేట్ అవుతోంది.  దానికి తోడు విజయ్ దేవరొండ క్రేజీ ప్రాజెక్టు లు చేస్తున్నారు. 

బిగ్‌ బాస్‌ తెలుగు 8 అప్‌ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

Vijay Devarakonda, VD 12, gowtham tinnanuri


తాజాగా  విజయ్, 'మళ్ళీరావా', 'జెర్సీ' చిత్రాలతో ఆకట్టుకున్న దర్శకుడు, జాతీయ అవార్డు విజేత గౌతమ్ తిన్ననూరి (gowtham tinnanuri) తో సినిమా చేస్తున్నారు. ఇంటెన్స్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోన్న ఈ చిత్రంతో అందరినీ థ్రిల్ చేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ నేపధ్యంలో ఈ చిత్రానికి సంభందించిన విశేషాలు ఇప్పుడు అంతటా వైరల్ అవుతున్నాయి. 


vijay devarakonda movie VD12 in Cinemas Worldwide from 28th March 2025


స్టంట్ డైరక్టర్ ఛేతన్ రష్మి డిసౌజా  మాట్లాడుతూ...ఇంటర్వెల్ ఫైట్ సీక్వెన్స్ కేరళలో షూట్ చేసామని చెప్పారు. ఆ ఫైట్ సీక్వెన్స్ బ్రిలియెంట్ గా వచ్చిందని చెప్పుకొచ్చారు. ఈ సీక్వెన్స్ ని రెండు డిఫరెంట్ లొకేషన్స్ షూట్ చేసామని చెప్పారు. ఊహించని వెదర్ కండీషన్స్ లో ఈ సీన్స్ చేసామని, అందరూ ఛాలెంజ్ గా తీసుకుని సపోర్ట్ చేసారని అన్నారు. ఈ యాక్షన్ సీక్వెన్స్ తెరపై చూస్తే అద్బుతంగా ఉంటుందని , చాలా ఇంటెన్స్ తో కూడి ఉంటుందని అన్నారు. 

Vijay Devarakonda


విజయ్‌ దేవరకొండ హీరోగా గౌతమ్‌ తిన్ననూరి తెరకెక్కిస్తున్న చిత్రం ‘వీడీ 12’ (వర్కింగ్‌ టైటిల్‌) (VD 12). ప్రస్తుతం దీని షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. రీసెంట్ గా  కేరళలో ఓ షెడ్యూల్‌ పూర్తయింది. దీనిని ఉద్దేశించి విజయ్‌ ఫ్యాన్స్‌ మీట్‌లో మాట్లాడారు. ప్రకృతి అందాల మధ్య షూట్‌లో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. కేరళలో యాక్షన్‌ సన్నివేశాలు చిత్రీకరించినట్లు తెలిపారు. ఈ చిత్రం తనకెంతో (Vijay Devarakonda) ప్రత్యేకమన్నారు. ఇది అందరి మనసులకు దగ్గరవుతుందని.. మంచి జ్ఞాపకాల్నిస్తుందన్నారు.

Vijay Devarakonda


‘వీడీ 12’ షూటింగ్‌ చివరి దశకు చేరుకుంది. ఇటీవల దీనికి సంబంధించిన కొన్ని ఫొటోలు లీక్‌ కాగా.. నిర్మాణ సంస్థ స్పందించింది. ‘‘డియర్‌ రౌడీ ఫ్యాన్స్‌.. మీకు మంచి థియేట్రికల్‌ ఎక్స్‌పీరియన్స్‌ అందించేందుకు టీమ్‌ ఎంతో కష్టపడుతోంది. 60 శాతం చిత్రీకరణ పూర్తయింది. లీక్‌ అయిన ఫొటోను షేర్‌ చేయొద్దు’’ అని విజ్ఞప్తి చేసింది. 
 

Actor Vijay Devarakonda


ఇందులో విజయ్‌ ఓ స్పై పాత్రలో కనిపించనున్నారు. మళ్లీ రౌడీ హీరో విజయ్‌ దేవరకొండను పవర్‌ఫుల్‌గా చూడనున్నారని నిర్మాత ఓ సందర్భంలో అన్నారు. వచ్చే ఏడాది మార్చి28న ఈ సినిమా విడుదల కానుంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై రానున్న ఈ చిత్రానికి అనిరుధ్‌ సంగీతం అందిస్తున్నారు. ‘విధి పిలిచింది.. రక్తపాతం ఎదురుచూస్తోంది.. కొత్త రాజు ఉద్భవిస్తాడు’ అంటూ టైటిల్ పోస్టర్‌తోనే ఆసక్తి పెంచిన ఈ చిత్రం కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం కేరళలో విజయ్‌ ఫ్యాన్స్‌ మీట్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Read more: హైకోర్టుకు అల్లు అర్జున్, అసలు కారణం ఏంటంటే

Also read: మణికంఠ మరో పల్లవి ప్రశాంత్‌ అయ్యేవాడా? టైటిల్‌ విన్నర్‌ అతనేనా? వామ్మో ఇదేం క్రేజ్‌

Latest Videos

click me!