హైకోర్టుకు అల్లు అర్జున్, అసలు కారణం ఏంటంటే

First Published | Oct 21, 2024, 5:16 PM IST

నంద్యాల ఎన్నికల ప్రచారంలో అనుమతి లేకుండా జనసమీకరణ చేసినందుకు అల్లు అర్జున్ పై కేసు నమోదు, హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు.

Allu Arjun


  అల్లు అర్జున్ హై కోర్టును ఆశ్రయించారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో నంద్యాలలో తనపై నమోదైన కేసు విషయంలో ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ కేసును క్వాష్ చేయాలని ఆయన కోరారు. సెక్షన్‌ 144, పోలీస్‌ యాక్ట్‌ 30అమల్లో ఉండగా అనుమతి లేకుండా జనసమీకరణ చేపట్టారంటూ అల్లు అర్జున్‌పై పోలీసులు కేసు ఫైల్ చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను హైకోర్టు విచారణకు స్వీకరించగా నేడు విచారణ జరగనుంది.
 

Allu Arjun, #Pushpa2, sukumar


కేసు వివరాల్లోకి వెళితే...అల్లు అర్జున్‌ గడచిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో తన మిత్రుడు శిల్పా రవి తరపున ప్రచారం నిర్వహించేందుకు నంద్యాలలో ఎన్నిల ప్రచారంలో పాల్గొన్న సంగతి తెలిసిందే. మే 11న నటుడు అల్లు అర్జున్ ఎలాంటి అనుమతులు తీసుకోకుండా నంద్యాలలో భారీ ర్యాలీ నిర్వహించారు.

నంద్యాల మాజీ ఎమ్మెల్యే కూడా ఆ ర్యాలీలో పాల్గొన్నారు. పట్టణంలో సెక్షన్‌ 30, 144 అమల్లో ఉన్నప్పటికీ వేల మందితో ర్యాలీ నిర్వహించడం దుమారమే లేపింది. ఆ రోజు నంద్యాలలో ఎన్నికల కోడ్‌ను అమలు చేయడంలో పోలీసులు ఘోరంగా విఫలమయ్యారనే ఆరోపణలు వచ్చాయి. 


Allu Arjun, Keshava, Pushpa,

పోలీసుల నుండి ఎటువంటి అనుమతులు తీసుకోకుండా ముందస్తు సమాచారం ఇవ్వకుండా భారీ జనసందోహం గుమికూడేలా చేసారని అల్లు అర్జున్ పై కేసు నమోదు చేసారు పోలీసులు. పుష్పా -2 షూటింగ్ కోసం హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్తూ మధ్యలో నంద్యాలకు వెళ్లిన బన్నీని చూసేందుకు వేల సంఖ్యలో ప్రజలు, అభిమానులు తరలి వచ్చారు. ఫ్యాన్స్ కు అభివాదం చేస్తూ  బన్నీ హల్ చల్ చేసారు.

Allu Arjun, Keshava, Pushpa,


అల్లు అర్జున్‌తో పాటు వైసీపీ నాయకుడు శిల్పారవిపై నంద్యాల పోలీసులు 144 సెక్షన్, పోలీస్ యాక్ట్ 30 అమలులో ఉండగా అనుమతి లేకుండా భారీగా జనసమీకరణ చేశారని కేసు పెట్టారు. దీనిపై కొందరు ఫిర్యాదు చేయగా కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది. అధికారులపై కొరడా ఝుళిపించింది. నంద్యాలలో ఎస్పీ కె.రఘువీర్‌ రెడ్డి, డీఎస్పీ ఎన్‌. రవీంద్రనాథ్ రెడ్డి, సీఐ రాజా రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి ఆదేశాలిచ్చింది.

Allu Arjun, Keshava, Pushpa,


 వారిపై 60రోజుల్లో శాఖాపరమైన విచారణ చేయాలని సూచించిందిఈ నేపథ్యంలో నాడు నంద్యాలలో  ఎన్నికల సమయంలో తన మీద నమోదైన కేసు విషయంలో అల్లు అర్జున్‌ ఏపీ హై కోర్టును ఆశ్రయించాడు. తనపై పెట్టిన కేసు లో క్వాష్ పిటిషన్‌ దాఖలు చేశారు. తనపై నమోదైన కేసు విచారణకు ముందే కేసును రద్దు చేయాలని బన్నీ హైకోర్టును కోరారు. 

Latest Videos

click me!