కృష్ణంరాజు సినిమా కథని మక్కీకి మక్కీ దించేశారు..చిరంజీవి మూవీ బ్లాక్ బస్టర్ హిట్, అదేంటో తెలుసా ?

First Published | Oct 21, 2024, 5:07 PM IST

మెగాస్టార్ చిరంజీవి నటించిన ఒక సూపర్ హిట్ చిత్ర కథ మొత్తం కృష్ణంరాజు ఆల్రెడీ నటించిన సినిమా కథని పోలినట్లు ఉంటుంది. రెండు చిత్రాల కథలు దాదాపు గా ఒకేలా ఉంటాయి. 

మెగాస్టార్ చిరంజీవి, రెబల్ స్టార్ కృష్ణంరాజు ఇద్దరూ మొగల్తూరు నుంచి వచ్చిన దిగ్గజ నటులు. చిరంజీవి కంటే కృష్ణంరాజు సీనియర్. కానీ చిరంజీవి కెరీర్ ఆరంభంలో కృష్ణంరాజు ప్రోత్సహించారు. ఇద్దరు కలసి నటించిన చిత్రాలు కూడా ఉన్నాయి. మనవూరి పాండవులు చిత్రంలో చిరంజీవి, కృష్ణంరాజు కలసి నటించారు. 

కొన్నిసార్లు హీరోలు నటించే చిత్రాలు ఇతర హీరోల చిత్రాల కథలని పోలినట్లు ఉంటాయి. కొంతవరకు పోలికలు ఉండొచ్చు కానీ పూర్తిస్థాయిలో రెండు చిత్రాల కథ ఒకేలా ఉంటే ఇబ్బంది వస్తుంది. కాపీ రైట్ సమస్యలు వస్తాయి. అయితే గతంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన ఒక సూపర్ హిట్ చిత్ర కథ మొత్తం కృష్ణంరాజు ఆల్రెడీ నటించిన సినిమా కథని పోలినట్లు ఉంటుంది. రెండు చిత్రాల కథలు దాదాపు గా ఒకేలా ఉంటాయి. ఆ మూవీ మరేదో కాదు చిరంజీవి కెరీర్ లో మైలురాయిగా నిలిచిన ఘరానా మొగుడు. 


ఘరానా మొగుడు చిత్రం 1992లో విడుదలై అత్యధిక వసూళ్లతో ఇండస్ట్రీ హిట్ గా సంచలనం సృష్టించింది. అంతకు ముందు వచ్చిన గ్యాంగ్ లీడర్ చిత్రం ఓవరాల్ గా వసూళ్లతో 10 కోట్లు దాటింది. కానీ ఘరానా మొగుడు చిత్రం కేవలం షేర్ మాత్రమే 10 కోట్లకు పైగా రాబట్టి ప్రభంజనం సృష్టించింది. చిరంజీవి నగ్మా ఈ చిత్రంలో జంటగా నటించారు. 

1982లో కృష్ణం రాజు, జయప్రద జంటగా నటించిన సీతారాములు చిత్ర కథ కూడా ఘరానామొగుడు తరహాలోనే ఉంటుంది. ఇదే కథని ఘరానామొగుడులో చిన్న చిన్న మార్పులు చేసి రూపొందించారా అనే సందేహం కూడా రావచ్చు. కానీ అది వాస్తవం కాదు. ఘరానామొగుడు చిత్ర కథని రజనీకాంత్ మన్నన్ చిత్ర కథ నుంచి తీసుకున్నారు. ఈ కథకి మార్పులు చేసి రీమేక్ చేయాలని రాఘవేంద్ర రావు అనుకున్నారు. పరుచూరి బ్రదర్స్ కథ వినగానే ఇది కృష్ణంరాజు సీతారాములు కథలా ఉందే అని అన్నారట. వెంటనే కథలో మార్పులు చేసి చిరంజీవి మ్యానరిజమ్స్ యాడ్ చేశారు. 

సీతారాములు చిత్రంలో ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికుడిగా కృష్ణంరాజు ఉంటారు. అదే ఫ్యాక్టరీకి ఓనర్ జయప్రద. కార్మికుల సమస్యలని పట్టించుకోను పొగరుబోతు ఓనర్ గా ఉంటుంది. వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవడం.. కార్మిల వల్ల ఇద్దరి మధ్య గొడవలు జరగడం చూడొచ్చు. ఘరానామొగుడు చిత్రంలో కూడా నగ్మా ఫ్యాక్టరీ ఓనర్ గా.. చిరంజీవి కార్మికుడిగా ఉంటారు. నగ్మా పాత్రని ఇంకాస్త ఎక్కువ పొగరుబోతుగా చూపించారు. 

Latest Videos

click me!