ఆ వ్యక్తి కారును పార్క్ చేసి వెళ్ళిన తర్వాత, జీప్ కాంపస్ కారులో వచ్చిన ఇద్దరు వ్యక్తులు బేస్‌మెంట్‌లోకి ప్రవేశించడాన్ని కెమెరాలో చూడవచ్చు. ఆ తర్వాత అధునాతన హ్యాకింగ్ పద్ధతులను ఉపయోగించి తెల్లవారుజామున 2 గంటలకు కారును దొంగిలించారు.
పోలీసుల నివేదిక ప్రకారం, దొంగలు కారును అక్రమంగా తెరిచి, ఆపై ఒక అనుమానితుడు ఖాన్ కారును బయటకు తీసుకెళ్లాడు. తెల్లవారుజామున 4 గంటలకు రెస్టారెంట్ మూసివేసినప్పుడు, ఖాన్ "వాలెట్" (హోటల్‌లోని కారు డ్రైవర్) తన కారును తీసుకురావాలని చెప్పాడు. కానీ కారు డ్రైవర్ నుండి వచ్చిన సమాధానం కారు కనిపించడం లేదని.