వేణు ఊడుగుల దర్శకత్వంలో 'విరాటపర్వం' చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. 'నీది నాది ఒకే కథ' చిత్రంతో వేణు ఊడుగుల విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్నాడు.
వేణు ఊడుగుల దర్శకత్వంలో 'విరాటపర్వం' చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. 'నీది నాది ఒకే కథ' చిత్రంతో వేణు ఊడుగుల విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్నాడు. దీనితో విరాటపర్వం కథని చాలా బలంగా రాసుకున్నారు. ఈ చిత్రంలో రానా దగ్గుబాటి, సాయి పల్లవి జంటగా నటిస్తున్న సంగతి తెలిసిందే. నక్సలిజం బ్యాక్ డ్రాప్ లో రానా ఎంచుకున్న మరో ప్రయోగాత్మక చిత్రం ఇది.
26
జూన్ 17న ఈ చిత్రం రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో ప్రచార కార్యక్రమాలు షురూ అయ్యాయి. రీసెంట్ గా కర్నూలులో విరాట పర్వం చిత్ర ట్రైలర్ ని లాంచ్ చేశారు. ట్రైలర్ లాంచ్ కార్యక్రమానికి ప్రేక్షకులు జనసందోహంలా తరలివచ్చారు. అయితే ట్రైలర్ లాంచ్ అంత సవ్యంగా జరగలేదు. జోరుగా గాలి వాన ఆటంకం కలిగించాయి. అయినప్పటికీ ఈవెంట్ ని విజయవంతంగా ముగించారు.
36
అయితే ఈ కార్యక్రమంలో సాయి పల్లవి ప్రసంగిస్తున్న సమయంలో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. సాయి పల్లవి ప్రసంగిస్తుండగా అభిమానులు కేరింతలు కొడుతూ ఆమె పై అభిమానాన్ని చాటుకున్నారు. అభిమానుల కేరింతల, గోల మధ్య సాయి పల్లవి ఏం మాట్లాడుతోందో కూడా సరిగా అర్థం కాలేదు.
46
అయితే సాయి పల్లవి మాట్లాడుతున్న సమయంలో ఒక్కరిగా గాలి వాన మొదలయింది. అయినా సాయి పల్లవి వెనకడుగు వేయకుండా ప్రసంగం కొనసాగించింది. వాన ఎక్కువగా కావడంతో రానా సాయి పల్లవికి సాయం చేశాడు. రానా స్వయంగా గొడుగు పట్టుకుని సాయి పల్లవి పక్కన నిల్చున్నాడు. దీనితో సాయి పల్లవి తన ప్రసంగాన్ని కొనసాగించింది.
56
రానా ఆమె పక్కన కొడుగుతో నిలబడినప్పుడు అభిమానుల కేరింతలు రెట్టింపు అయ్యాయి. సోషల్ మీడియాలో కూడా ఈ దృశ్యాలు వైరల్ ఆ మారాయి. ప్రతి ఒక్కరూ రానాని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. రానా స్వతహాగా మంచి హృదయం ఉన్న వ్యక్తి. ఈ సంఘటనతో అది మరోసారి ప్రూవ్ అయిందని నెటిజన్లు అంటున్నారు.
66
ఏది ఏమైనా విరాట పర్వం ట్రైలర్ విశేషంగా ఆకట్టుకుంటోంది. రానా, సాయి పల్లవి ఇద్దరూ పోటీ పడి నటించారు. నక్సలైట్ పాత్రలో రానా పవర్ ఫుల్ గా కనిపిస్తున్నాడు. రానా, సాయి పల్లవి మధ్య లవ్ ట్రాక్ ఈ చిత్రంలో హైలైట్ కాబోతున్నట్లు తెలుస్తోంది.