యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ అంతా కల్కి బ్లాక్ బస్టర్ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నారు. ఆల్రెడీ ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా 900 కోట్ల పైగా వసూళ్లు సాధించి విధ్వంసం సృష్టిస్తోంది. ప్రభాస్ ఈ చిత్రంలో భైరవ పాత్రలో అదరగొట్టేశాడు. క్లైమాక్స్ లో ప్రభాస్ మహాభారతంలోని ఒక వీరుడిగా కనిపించిన విధానం ఆడియన్స్ కి గూస్ బంప్స్ తెప్పించింది.