బిగ్ బాస్ బాగోతం బయటపెట్టిన యాంకర్ రవి... ప్రేక్షకులకు చూపించని, తెలియని దారుణాలు ఎన్నో!

First Published | Aug 11, 2024, 12:03 PM IST

బిగ్ బాస్ షోలో నాలుగు గోడల మధ్య జరిగేది వేరు చూపించేది వేరు అంటున్నాడు యాంకర్ రవి. బిగ్ బాస్ సీజన్ 5లో పాల్గొన్న రవి బిగ్ బాస్ షోలో జరిగే దారుణాలు బయటపెట్టాడు. 
 

Bigg Boss Telugu


బిగ్ బాస్ షోకి వెళ్లాలని చాలా మంది తాపత్రయ పడతారు. తక్కువ సమయంలో సెలెబ్రిటీలు కావచ్చని ఆశపడతారు. అయితే బిగ్ బాస్ షోకి వెళితే సరదా తీరిపోతుంది అంటున్నాడు యాంకర్ రవి. సీజన్ 5లో కంటెస్టెంట్ చేసిన యాంకర్ రవి ఉన్న ఇమేజ్ డ్యామేజ్ చేసుకుని వచ్చాడు. నటి లహరి  బ్యాచ్ లర్స్ ఉండగా పెళ్ళైన నా వెనకాల పడుతుందని నటి ప్రియతో రవి అన్న విషయం హైలెట్ చేశారు. వీడియోలు ప్రదర్శించడంతో యాంకర్ రవికి చాలా మైనస్ అయ్యింది. 

Bigg Boss Telugu

తాజాగా రవి బిగ్ బాస్ షో బాగోతం బయటపెట్టాడు. ఆయన మాట్లాడుతూ... బిగ్ బాస్ షో ప్రధాన పాలసీ ఒకడిని మరొకడు క్రిందకు లాగడం. ఒకడు పెర్ఫార్మన్స్ తో ఎదగాలని చూస్తాడు. మరొకడు ఎదిగే వాడిని క్రిందకు లాగి పైకి వెళ్లాలని చూస్తాడు. 20 మందిలో జరిగేది ఇదే. శనివారం ఎవరిది బ్యాడ్ పెర్ఫార్మన్స్ అని చెప్పాలి. ఆదివారం వచ్చి నాగార్జున ఏదో ఒక ఫిట్టింగ్ పెడతారు. 


Bigg Boss Telugu

సోమవారం నామినేషన్స్.. మూడు రోజులు కొట్టుకు చస్తారు. మిగతా రోజులు కూడా ఎవరిని నామినేట్ చేయాలి. ఏం కారణాలు చెప్పాలని ఆలోచిస్తూ ఒత్తిడి అనుభవించాలి. అందరికీ కలిపి ఒక పచ్చడి బాటిల్ ఇస్తారు. దాని వద్ద కూడా కొట్లాటలు. ఆకలికి చావాలి. నేను హౌస్లో 85 రోజులు ఉంటే 10 కేజీల బరువు తగ్గాను. శ్రీరామ్ చంద్ర 12 కేజీలు, షణ్ముఖ్ జస్వంత్ 15 కేజీలు బరువు తగ్గారు. 

Bigg Boss Telugu


కేవలం గంట ఫుటేజ్ వాళ్ళకు ఇష్టం వచ్చినట్లు ఎడిట్ చేసి చూపిస్తారు. మిగతాది అన్ సీన్ అని టెలికాస్ట్ చేస్తారు. కుటుంబ సభ్యుల గురించి ఎంత అడిగినా చెప్పరు. వాళ్లతో మనకు సంబంధాలు ఉండవు. చాలా మంది కెమెరాల వద్దకు వెళ్లి రిక్వెస్ట్ చేస్తూ ఉంటారు. కానీ నేను చేసిందే చూపించారు. 

Bigg Boss Telugu

నేను శ్రీరామ్ చంద్ర, సన్నీతో సన్నిహితంగా ఉండేవాడిని. అదేమీ చూపించలేదు అని.. కీలక కామెంట్స్ చేశాడు. టైటిల్ విన్నర్ గా బరిలో దిగిన యాంకర్ రవి 12వ వారం ఎలిమినేట్ అయ్యాడు. సీజన్ 5 విన్నర్ గా సన్నీ నిలిచాడు. యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్ రన్నర్ స్థానంతో సరిపెట్టుకున్నాడు. 
 

Latest Videos

click me!