నాలుగేండ్లు ఆ దేశంలోనే సాయిపల్లవి.. బర్త్ డే గర్ల్ గురించి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్..

First Published | May 9, 2023, 4:51 PM IST

స్టార్ హీరోయిన్ సాయిపల్లవి (Sai Pallavi) పుట్టిన రోజు ఇవ్వాళే.  ఈ  సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.  ఇదే సమయంలో తమిళ బ్యూటీకి సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ వైరల్ గా మారాయి.  
 

తమిళనాడులోని కోయంబత్తురూలో 1992 మే 9న జన్మించింది. నేటితో ఈ ముద్దుగుమ్మ 31వ ఏటా అడుగుపెట్టింది. ఈ సందర్భంగా సాయి పల్లవికి ఫ్యాన్స్, సెలబ్రెటీలు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ సందర్భంగా ఆమెకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు నెట్టింట వైరల్ గా మారాయి. 
 

లీడ్ యాక్ట్రెస్ లలో సాయిపల్లవిది  ప్రత్యేకమైన శైలి. సినిమాల పరంగా ఆమె తీసుకునే నిర్ణయాలు రోటీన్ కు భిన్నంగా ఉంటాయి. గ్లామర్ పాత్రల కంటే.. ప్రాధాన్యత ఉండే పాత్రల్లోనే ఎక్కువగా నటిస్తుంటారు. ఏ విషయాన్నైనా ముక్కుసూటిగా మాట్లాడుతుంటారు. నిర్భయంగా తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తుంది.
 


సాయి పల్లవి కోయంబత్తూరులో చదువుపూర్తి చేసింది. ఆమె తండ్రి కస్టమ్స్ ఆఫీసర్. తల్లి డాన్సర్. తనకు చెల్లి పూజా కూడా ఉంది. ఇద్దరూ ట్విన్స్ కావడం విశేషం. తల్లిద్వారానే సాయి పల్లవికి డాన్స్ పై ఆసక్తి పెరిగింది. స్కూల్ స్థాయిలోనే డాన్స్ తో అదరగొట్టింది. అదే క్రమంలో సినిమాలపైనా ఆసక్తి పెరిగింది. 

తొలుత ‘ధామ్ ధూమ్’ తమిళ చిత్రంలో చిన్న పాత్రలో మెరిసింది. ఆ తర్వాత డాన్స్ పై ఫోకస్ పెట్టి రాణించింది. పలు డాన్స్ షోలలో పాల్గొని గుర్తింపు దక్కించుకుంది. దాంతో హీరోయిన్ గానూ అవకాశాలు అందాయి. కానీ తల్లిదండ్రులు నో చెప్పడం వెనక్కి తగ్గింది. ఆ సమయంలోనే జార్జియా వెళ్లి మెడిసిన్ చదివింది.

మెడిసిన్ కారణంగా నాలుగేండ్లు సినిమాలకు దూరంగా ఉంది. ఆ నాలుగేండ్లు జార్జియాలోనే ఉండింది. తిరిగి వచ్చాక ఎలాగైనా నటి అవ్వాలనే ఆలోచనతో ప్రయత్నాలు చేసింది. దాంతో దర్శకుడు అల్ఫోన్ తెరకెక్కించిన మలయాళ ఫిల్మ్ ‘ప్రేమమ్’తో హీరోయిన్ గా మారింది. హిట్ కూడా అందుకుంది. నేరుగా తెలుగులో ‘ఫిదా’ సినిమాతో అందరినీ ఫిదా చేసింది.  

అయితే ప్రేమమ్ చిత్రంలో హీరోయిన్ గా చేయడంతో ప్రేక్షకులు తనను నటిగా స్వీకరిస్తారా? లేదా? అనేవిషయంలో చాలా భయపడిందంట. మొహంపై మొటిమలు ఉండటంతో నచ్చుతానో లేదోనని బాధపడినట్టు ఆయా సందర్భాల్లో తెలిపింది. అలా భయపడుతూ కెరీర్ ప్రారంభించిన సాయి పల్లవి ప్రస్తుతం స్టార్ హీరోయిన్ గా రాణిస్తోంది.
 

సాయి పల్లవి నటి, డ్యాన్సర్ మాత్రమే కాకుండా.. హర్డిల్స్ ప్లేయర్ కూడానూ. తమిళస్టార్ సూర్యకు వీరాభిమాని. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ డాన్స్ ను బాగా ఇస్టపడుతుంది. ఇక రన్నింగ్ అంటే కూడా సాయి పల్లవికి ఇష్టమే. అలాంటి పాత్రల్లో నటించేందుకు కూడా సిద్ధమేనని గతంలో చెప్పుకొచ్చింది. హారర్ చిత్రాలు అంటే భయం. ఖాళీ సమయాల్లో సీతాకోక చిలుకల్ని పట్టుకొని వదిలేస్తుంటుంది.

చివరిగా సాయి పల్లవి ‘విరాట పర్వం’ చిత్రంలో అలరించింది. నేచురల్ యాక్టింగ్ తో అదరగొట్టింది. ఆ తర్వాత వచ్చిన ‘గార్గి’తోనూ ఆకట్టుకట్టుకుంది. ప్రస్తుతం ఎలాంటి చిత్రాలను ప్రకటించలేదు. మున్ముందు ఎలాంటి ప్రాజెక్ట్స్ తో రానుందనేది ఆసక్తికరంగా మారింది.
 

Latest Videos

click me!