పొట్టి డ్రెస్ లో జాన్వీ కపూర్.. హెవీ వర్కౌట్స్ చేస్తూ జిమ్ లోనూ ఎన్టీఆర్ భామ గ్లామర్ మెరుపులు..

First Published | May 9, 2023, 3:42 PM IST

బాలీవుడ్ యంగ్ హీరోయిన్  జాన్వీ కపూర్ (Janhvi Kapoor) త్వరలో తెలుగు ప్రేక్షకులను అలరించబోతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మరింత నాజుగ్గా కనిపించేందుకు జిమ్ లో హెవీ వర్కౌట్స్ చేస్తోంది.
 

బాలీవుడ్ యంగ్ హీరోయిన్  జాన్వీ కపూర్ లక్కీ ఛాన్స్ దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈ ముద్దుగుమ్మ టాలీవడ్ ఎంట్రీ ఎప్పుడు ఉంటుంది, ఎవరికి జోడీగా నటించబోతుందనే ఆసక్తి అందరిలోనూ ఉండేంది. చివరిగా గ్లోబల్ స్టార్ సరనన ఛాన్స్ దక్కించుకుంది.
 

కొరటాల శివ - ఎన్టీఆర్ (NTR) కాంబినేషన్ లో వస్తున్న చిత్రం NTR30. చాలా మంది స్టార్ హీరోయిన్లను కథనాయికగా తీసుకునే ప్రయత్నం జరిగింది. చివరికి అతిలోక సుందరి, శ్రీదేవి కూతురుకు ఆ అద్రుష్టం వరించింది. దీంతో జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ గ్రాండ్ గానే ఉంటుందని తెలుస్తోంది.
 


‘ఎన్టీఆర్30’లో అవకాశం దక్కించుకున్న జాన్వీ కపూర్ సినిమా కోసం మరింతగా శ్రమిస్తున్నారు. అప్పటికే గ్లామర్ బాంబ్ గా సోషల్ మీడియాలో హీటు పుట్టించిన ఈ ముుద్దుగుమ్మ ఇక తారక్ సరసన నటించబోతుండటంతో మరింత అందంగా కనిపించేందుకు ప్రయత్నం చేస్తోంది. 

ఈ సందర్భంగా తరుచూ జిమ్ లోనే కనిపిస్తూ ఉంది. జీరో ఫ్యాట్ బాడీని మెయిటెయిన్ చేసేందుకు,  నాజూగ్గా తయారయ్యేందుకు జిమ్ లో హెవీ వర్కౌట్స్ చేస్తున్నారు జాన్వీ కపూర్. ఈక్రమంలో అందుకు సంబంధంచిన ఓ వీడియోను అభిమానులతో పంచుకుంది. 
 

లేటెస్ట్ వీడియోలో జాన్వీ వర్కౌట్స్ చేస్తూ కనిపించింది. లేడీ ట్రెయిన్ పర్యవేక్షణలో వెయిట్ లిఫ్ట్ చేస్తూ, కఠిన వ్యాయామాలు  చేస్తూ దర్శనమిచ్చింది. చెమటు కక్కిస్తూ మరింత అందాన్ని, ఆరోగ్యాన్ని పొందుతోంది. ఈ వీడియో చూసిన అభిమానులు ఫిదా అవుతున్నారు. 
 

మరోవైపు పొట్టిగా ఉన్న జిమ్ వేర్ లో జాన్వీ వర్కౌట్ చేయడంతో వీడియో వైరల్ గా మారింది. చెమట ధారగా పారే జిమ్ సెంటర్ లోనూ గ్లామర్ వెలుగులు నింపింది. మేకప్ లేకుండా, స్లిమ్ ఫిట్ అందాలను ప్రదర్శించింది. చూపు తిప్పుకోకుండా చేసింది.

జాన్వీ తన ప్రాజెక్ట్స్ కోసం ఇంతలా శ్రమిస్తుండటంతో ఫ్యాన్స్ ఫిదా  అవుతున్నారు. ఆమె హార్డ్ వర్క్ ను మెచ్చుకుంటున్నారు. జాన్వీ ఇతరులకు ప్రేరణ కలిపిస్తోందంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇక జాన్వీ ఫిట్ నెస్ విషయంలో చాలా జాగ్రత్తలు  తీుకుంటుందని  మరోసారి ఇలా రుజువైంది.

బాలీవుడ్ లో వరుస చిత్రాల్లో నటిస్తున్న ఈ ముద్దుగుమ్మ త్వరలో తెలుగు ప్రేక్షకులను అలరించబోతోంది. ఇప్పటికే ఎన్టీఆర్30 నుంచి విడుదలైన పోస్టర్ కు మంచి రెస్పాన్స్ దక్కింది. తన పెర్ఫామెన్స్ తోనూ ఆకట్టుకోగలిగితే టాలీవుడ్ లో మరిన్ని భారీ ప్రాజెక్ట్స్ ను దక్కించే అవకాశం లేకపోలేదు. హిందీలో ‘బవాల్’, ‘మిస్టర్ అండ్ మిస్ మహి’లోనూ నటిస్తోంది.
 

Latest Videos

click me!