తెల్ల చీర కట్టి పూలతోటలో తిరుగుతున్న చందమామ... లయ ఇన్నాళ్లు ఈ గ్లామర్ ఎక్కడ దాచిందిరా బాబు!

Published : May 09, 2023, 04:23 PM IST

హీరోయిన్ లయ సోషల్ మీడియాలో వరుస ఫోటో షూట్స్ చేస్తున్నారు. గ్లామర్ విందు చేస్తూ తనలోని కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నారు.

PREV
19
తెల్ల చీర కట్టి పూలతోటలో తిరుగుతున్న చందమామ... లయ ఇన్నాళ్లు ఈ గ్లామర్ ఎక్కడ దాచిందిరా బాబు!
Laya Gorty

లయ లేటెస్ట్ ఫోటో షూట్ వైరల్ అవుతుంది. తెల్లచీర కట్టిన లయ పూలతోటలో చందమామలా వెన్నెల కురిపించింది. వయసు పెరిగేకుంది ఆమెలోని గ్లామర్ రెట్టింపు అవుతుండగా, ఇన్నాళ్లు ఈ అందం ఎక్కడ దాచిందని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. 
 

29
Laya Gorty

నాలుగు పదుల వయసు దాటిన లయ సౌందర్యం అబ్బుపరుస్తుంది. విజయవాడకు చెందిన లయ చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ స్టార్ట్ చేశారు. 1992లో విడుదలైన భద్రం కొడుకో మూవీలో లయ లీడ్ రోల్ చేశారు. ఆ మూవీ స్ట్రీట్ చైల్డ్స్ పై తీసిన చిత్రం. 
 

39
Laya Gorty


హీరోయిన్ గా లయ మొదటి చిత్రం స్వయంవరం. హీరో వేణు తొట్టెంపూడి కూడా హీరోగా పరిచయమయ్యాడు. రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ స్వయం వరం మంచి విజయాన్ని సాధించించింది. ఫస్ట్ హిట్ ఖాతాలో వేసుకుంది. 


 

49
Laya Gorty

తెలుగులో లయకు ఆఫర్స్ క్యూ కట్టాయి. ముఖ్యంగా టైర్ టూ హీరోల ఛాయిస్ గా మారారు. మంచి నటిగా పేరు తెచ్చుకున్న లయకు పెర్ఫార్మన్స్ ఓరియెంటెడ్ పాత్రలు దక్కాయి. ప్రేమించు ఈ తరహా చిత్రమే. ప్రేమించు మూవీలో లయదే ప్రధాన పాత్ర. సాయి కిరణ్ హీరో. 

59
Laya Gorty


సురేష్ ప్రొడక్షన్ బ్యానర్ లో తెరకెక్కిన ప్రేమించు హిట్ టాక్ తెచ్చుకుంది. ప్రేమించు లో లయ అంధురాలు పాత్ర చేశారు. హనుమాన్ జంక్షన్, నువ్వులేక నేనులేను వంటి కమర్షియల్ హిట్స్ ఆమె ఖాతాలో ఉన్నాయి. ఇండస్ట్రీలో ఉంది కొద్ది రోజులే అయినా 50 కి పైగా చిత్రాల్లో లయ నటించారు. 
 

69
Laya Gorty

విజయేంద్రవర్మ మూవీలో లయ బాలకృష్ణకు జంటగా నటించారు. తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో కూడా ఆమెకు ఆఫర్స్ వచ్చాయి. 2006 వరకు లయ కెరీర్ సక్సెస్ ఫుల్ గా సాగింది. చిన్నదో పెద్దదో ఆఫర్స్ మాత్రం ఆగలేదు. 

79
Laya Gorty


2006లో కాలిఫోర్నియాలో డాక్టర్ గా సెటిల్ అయిన గణేష్ గోర్తి అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారు. ఆయనతో పాటు కాలిఫోర్నియా వెళ్లిపోయారు. లయ ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చారు. అమ్మాయి పేరు శ్లోక కాగా అబ్బాయి పేరు వచన్. 
 

89
Laya Gorty

హీరోయిన్ గా 2010లో విడుదలైన బ్రహ్మలోకం టు యమలోకం వయా భూలోకం చివరి చిత్రం. 2018లో శ్రీను వైట్ల-రవితేజ కాంబోలో తెరకెక్కిన అమర్ అక్బర్ ఆంటోని మూవీలో లయ నటించారు. 
 

99
Laya Gorty

ప్రస్తుతం లయ అమెరికాలో జాబ్ చేస్తున్నారు. లయ పని చేస్తున్న సంస్థ పేరు జోబి ఏవియేషన్. ఈ ఎయిర్ బస్ సంస్థలో లయ కీలక బాధ్యతలు నెరవేరుస్తున్నారట. అయితే లయ భర్తకు కోట్ల ఆస్తులు ఉన్నాయి. అయినా తిని కూర్చోవడం ఇష్టం లేని లయ తన అభిరుచి మేరకు జాబ్ చేస్తుంది.
 

click me!

Recommended Stories