రజనీకాంత్ భార్య లత నటించిన ఏకైక సినిమా ఏదో తెలుసా?
సూపర్ స్టార్ రజనీకాంత్ భార్య లతా రజనీకాంత్ ఒక్కే ఒక సినిమాలో నటించారు. ఆ సినిమా ఏంటి? ఆ సినిమాను డైరెక్ట్ చేసింది ఎవరు?
సూపర్ స్టార్ రజనీకాంత్ భార్య లతా రజనీకాంత్ ఒక్కే ఒక సినిమాలో నటించారు. ఆ సినిమా ఏంటి? ఆ సినిమాను డైరెక్ట్ చేసింది ఎవరు?
Latha Rajinikanth Movie With Superstar: రజనీకాంత్ సూపర్ స్టార్ గా వెలుగొందుతున్నారు. ఆయనకు ఇప్పుడు 74 ఏళ్లు అయినప్పటికీ ఈ వయసులో కూడా కుర్రహీరోలకు పోటీ ఇస్తూ దూసుకుపోతున్నారు. వరుస సినిమాలతో చాలా బిజీగా ఉన్నారు. ఆయన నటిస్తున్న కూలీ, జైలర్ 2 సినిమాలు రూపొందుతున్నాయి. ఇందులో కూలీ సినిమా ఆగస్టు 14న విడుదల కానుంది. అలాగే జైలర్ 2 సినిమా షూటింగ్ సూపర్ ఫాస్ట్ గా జరుగుతోంది. ఈ రెండు సినిమాలను సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది.
రజనీకాంత్ 1981లో వివాహం చేసుకున్నారు. ఆయన లతా రజనీకాంత్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. సూపర్ స్టార్ నటుడిగా బిజీగా ఉన్నప్పుడు ఆయన్ని ఇంటర్వ్యూ చేయడానికి వచ్చిన ఒక కాలేజీ అమ్మాయి లత. అప్పుడు ఇద్దరి మధ్య స్నేహం మొదలయ్యింది. అది ప్రేమగా మారింది. పెళ్లయి 44 ఏళ్లు అయినా ఇద్దరు ఎంతో అన్యోన్యంగా ఉంటారు. వీరికి ఇద్దరు కూతుళ్లు కూడా ఉన్నారు.
పాటలు పాడిన లతా రజనీకాంత్
రజనీకాంత్ షూటింగులో బిజీగా ఉన్న సమయంలో ఆయన కుటుంబంతో గడపలేకపోయారట. అప్పుడు తన కూతుళ్లను, కుటుంబాన్ని చూసుకున్నారట లతా రజనీకాంత్. అయితే లతా రజినీకాంత్ పాటలు పాడటం అంటే చాలా ఇష్టం. రజనీ నటించిన కోచ్చడయ్యాన్ సినిమాలో లతా రజనీకాంత్ పాట పాడారు. ఆమె పాడిన పాట విన్నాం. కానీ లతా రజినీకాంత్ ఒక సినిమాలో కూడా నటించారని మీకు తెలుసా? ఆమె ఒక సినిమాలో రజనీకి జోడీగా నటించారు. ఇది చాలా మందికి తెలియదు.
రజనీకి జోడీగా లతా రజనీకాంత్ నటించిన సినిమా అగ్ని సాక్షి. 1982లో విడుదలైన ఈ సినిమాను కె.బాలచందర్ డైరెక్ట్ చేశారు. ఇందులో శివకుమార్, సరిత ప్రధాన పాత్రల్లో నటించారు. ఇందులో రజనీకాంత్, రజనీకాంత్ గానే ఒక చిన్న పాత్రలో కనిపిస్తారు. అందులో రజనీ భార్యగా లత ఒక సీన్ లో మాత్రమే గెస్ట్ రోల్ లో నటించారు. లతా రజనీకాంత్ నటించిన ఒకే ఒక్క తమిళ సినిమా ఇది. ఇందులో కమల్ హాసన్ కూడా గెస్ట్ రోల్ లో నటించారు.