2022 ప్రారంభంలో నరేష్-పవిత్ర లోకేష్ పెళ్లి వార్తలు గుప్పుమన్నాయి. వీరిద్దరూ మహాబలేశ్వర్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఫోటోలు బయటకు రాగా నరేష్ నాలుగో వివాహం చేసుకున్నాడంటూ... పుకార్లు రేగాయి. పవిత్రను వివాహం చేసుకోలేదు, కలిసి జీవిస్తున్న మాట వాస్తవం అని నరేష్ వివరణ ఇచ్చారు. దీంతో మూడో భార్య రమ్య రఘుపతి రంగంలోకి దిగింది. ఈ ముగ్గురు కేంద్రంగా పెద్ద హైడ్రామా నడిచింది.