బిగుతైన ఫ్రాక్ లో ప్రణీత సుభాష్ స్టన్నింగ్ ఫోజులు.. సైడ్ యాంగిల్లో అదరగొట్టిన బుట్టబొమ్మ

First Published | May 27, 2023, 1:22 PM IST

కన్నడ బ్యూటీ ప్రణీతా సుభాష్ (Pranitha Subhash)  నయా లుక్స్ లో దర్శనమిస్తూ ఫ్యాన్స్ ను ఫిదా చేస్తోంది. టైట్ ఫిట్లలో అదరగొడుతోంది. తాజాగా ఈ బ్యూటీ పంచుకున్న పిక్స్ స్టన్నింగ్ గా ఉన్నాయి. 
 

బ్యూటీఫుల్ హీరోయిన్ ప్రణీతా సుభాష్ తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో పరిచయం. తెలుగులో కొన్ని చిత్రాల్లోనే నటించినప్పటికీ ఆడియెన్స్ లో తనకంటూ స్పెషల్ ఇమేజ్ ను తెచ్చుకుంది.  స్టార్ హీరోల సరసన నటించి గుర్తుండిపోయేలా పెర్ఫామెన్స్ ఇచ్చింది.
 

తొలుత ‘బావ’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది ప్రణీత. ఈ చిత్రంలో తన అందం, నటనతో  ఆడియెన్స్  ను కట్టిపడేసింది. ఈ సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా.. ప్రణీతకు మాత్రం మంచి క్రేజ్ నే సాధించి పెట్టింది. దీంతో ఇక్కడ వరుసగా ఆఫర్లు అందుకుంది. 
 


ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) సరసన ‘అత్తారింటికి దారేది’ చిత్రంతో ప్రణీతకు మరింత క్రేజ్ దక్కింది. బుట్టబొమ్మగానూ స్పెషల్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది. ఆవెంటనే  ‘బ్రహ్మోత్సవం’, ‘హాలో గురు ప్రేమకోసమే’, ‘ఎన్టీఆర్ : కథానాయకుడు’ వంటి చిత్రాల్లో నటించింది. 
 

ఇదిలా ఉంటే.. ప్రణీత 2021 మేలో వ్యాపార వేత్త నితిన్ రాజును పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. సంప్రదాయ పద్ధతుల్లో కోవిడ్ కారణంగా అతికొద్ది మంది సన్నిహితుల మధ్య జరిగింది.  జూన్ 10న పండంటి ఆడబిడ్డకు కూడా జన్మనిచ్చింది. ఫ్యామిలీతో హ్యాపీ లైఫ్ ను లీడ్ చేస్తోంది.
 

అయితే పెళ్లి తర్వాత కూడా ప్రణీత సినిమాలకు సైన్ చేస్తున్నారు. కేరీర్లో మరిన్ని చిత్రాల్లో నటించేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా కనిపిస్తున్నారు. పెళ్లై, ఓ కూతురికి జన్మనిచ్చినా చెక్కుచెదరని అందంతో ఆకట్టుకుంటోంది. 

అదిరిపోయే అవుట్ ఫిట్లలో దర్శనమిస్తూ అందాల విందు చేస్తోంది. తాజాగా టైట్ ఫిట్ లో స్లిమ్ ఫిట్ అందాలను ప్రదర్శించింది. సైడ్ యాంగిల్లో బుట్టబొమ్మ ఇచ్చిన పోజులకు ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. లైక్స్,, కామెంట్లతో వైరల్ చేస్తున్నారు. ఇక ప్రణీత ప్రస్తుతం మలయాళంలోకి Dileep148  చిత్రంతో ఎంట్రీ ఇవ్వబోతోంది.

Latest Videos

click me!