తెలుగులోకి 15 ఏండ్ల కిందనే హనీ రోజ్ ఎంట్రీ.. బాలయ్య భామ గురించి ఇంట్రెస్టింగ్ డిటేయిల్స్!

First Published | Jan 28, 2023, 11:23 AM IST

బాలయ్య భామ, మలయాళ నటి హనీ రోజ్ (Honey Rose) ఎప్పుడో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ప్రేక్షకులను పలకరించింది. రీసెంట్ గా ఇక్కడ ఫేమ్ దక్కించుకున్న ఈ ముద్దుగుమ్మ గురించి కొన్ని డిటేయిల్స్ ఆసక్తికరంగా ఉన్నాయి.
 

నందమూరి నటసింహాం, సీనియర్ నటుడు బాలయ్యకు జోడీగా మలయాళ నటి హనీ రోజ్ ‘వీరసింహారెడ్డి’లో నటించిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో స్టార్ హీరోయిన్ శృతి హాసన్ కూడా నటించారు. కానీ Veera Simha Reddy చిత్రంతో హనీరోజ్ కు మంచి గుర్తింపు దక్కింది.
 

వీరసింహారెడ్డి పాత్రకు భార్యగా నటించి మెప్పించింది. దాదాపు సినిమా మొత్తంగా హనీరోజ్ పాత్ర కనిపిస్తుంటుంది. దీంతో నటనకు మంచి స్కోప్ దక్కింది. దానికి తోడు ఆమె పెర్ఫామెన్స్ లోనూ అదరగొట్టింది. ఫలితంగా హనీరోజ్ కు మంచి గుర్తింపు దక్కింది. 
 


మరోవైపు ‘మా బావ మనోభావాలు’ సాంగ్ లోనూ గ్లామర్ మెరుపులతో  ఆడియెన్స్ ను కట్టిపడేసింది. అలాగే వీరసింహారెడ్డి ఈవెంట్లలోనూ అదిరిపోయే అవుట్ ఫిట్లలో సందడి చేస్తూ తన అందంతో మంత్రముగ్ధులను చేసింది. వీరసింహారెడ్డితో తెలుగు ప్రేక్షకుల్లో గుర్తింపు దక్కించుకుంది. అప్పటి నుంచి ఈ బ్యూటీకి ఫాలోవర్స్ పెరిగిపోతున్నారు. 
 

ఈ క్రమంలో హనీ రోజ్ కు సంబంధించిన కొన్ని వివరాలు  ఆసక్తికరంగా ఉన్నాయి. అయితే హనీరోజ్ టాలీవుడ్ కు 15 ఏండ్ల కిందనే ఎంట్రీ ఇచ్చింది. 2008లో వచ్చిన ‘ఆలయం’ అనే చిత్రంలో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులను పరిచయం అయ్యింది. శివాజీకి జోడీగా నటించింది. 

ఆ తర్వాత 2014లో వచ్చిన ‘ఈ వర్షం సాక్షిగా’లో కీలక పాత్రను పోషించింది. ఈ రెండు చిత్రాలు పెద్దగా ఆడకపోవడంతో హనీ రోజ్ కు గుర్తింపు దక్కలేకపోయింది. కానీ మలయాళం, తమిళం, కన్నడ చిత్రాల్లో నటిస్తూనే వస్తున్నారు. ఇక రీసెంట్ గా‘వీరసింహారెడ్డి’తో మళ్లీ తెలుగులో అడుగుపెట్టి ఆకట్టుకుంది. మున్ముందు మరిన్ని అవకాశాలు అందుకునేలా కనిపిస్తోంది. 
 

హనీ రోజ్ కేరళలోని తొడుపుజ సమీపంలోని మూలమట్టంలో జన్మించింది. ఆమె హనీరోజ్ తో పాటు ధ్వని, పొన్ను అనే ముద్దుపేర్లు కూడా ఉన్నాయి. ఈ బ్యూటీ స్థానికంగానే ప్రాథమిక విద్యాభ్యాసం నుంచి డిగ్రీ వరకు చదివారు. బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ లో డిగ్రీ పట్టా పొందారు. 2005లో సినిమా రంగంలోకి అడుగుపెట్టారు. పలు టీవీ షోల్లోనూ జడ్జీగా, మెంటర్ గా బుల్లితెరపై అలరించారు. 
 

ప్రస్తుతం హనీరోజ్ పేరు తెలుగు చిత్ర పరిశ్రలో గట్టిగానే వినిపిస్తోంది. రాబోయే చిత్రాల్లో ఈమె అవకాశాలు తప్పనిసరి అనితెలుస్తోంది. ఇందుకు తగ్గట్టుగానే సోషల్ మీడియాలోనూ తెగ యాక్టివ్ గా కనిపిస్తున్నారు. సంప్రదాయ దుస్తులు, మోడ్రన్ వేర్స్ లో ఫొటోషూట్లు చేస్తూ నెట్టింట దుమారం రేపుతోంది. గ్లామర్ మెరుపులతో ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఈ మేరకు తాజాగా చీరకట్టులో మైమరిపించింది. మతిపోయే పోజులతో ఆకర్షించింది. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.  

Latest Videos

click me!